Realme P1 series : ఇండియాలో రియల్​మీ పీ1 సిరీస్​ లాంచ్​.. ఫీచర్స్​, ధరలు ఇవే..-realme p1 5g realme p1 pro 5g launched in india price specs and more ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Realme P1 Series : ఇండియాలో రియల్​మీ పీ1 సిరీస్​ లాంచ్​.. ఫీచర్స్​, ధరలు ఇవే..

Realme P1 series : ఇండియాలో రియల్​మీ పీ1 సిరీస్​ లాంచ్​.. ఫీచర్స్​, ధరలు ఇవే..

Sharath Chitturi HT Telugu
Apr 15, 2024 02:30 PM IST

Realme P1 5G India launch : రియల్​మీ సంస్థ నుంచి రెండు కొత్త స్మార్ట్​ఫోన్స్​.. తాజాగా ఇండియాలో లాంచ్​ అయ్యాయి. వాటి ఫీచర్స్​, ధరలు వంటి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఇండియాలోకి రియల్​మీ పీ1 సిరీస్​.. ధర ఎంతంటే..
ఇండియాలోకి రియల్​మీ పీ1 సిరీస్​.. ధర ఎంతంటే..

Realme P1 5G price : ఇండియా స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లోని మిడ్ రేంజ్ సెగ్మెంట్​పై ఫోకస్​ చేసిన రియల్​మీ సంస్థ.. సరికొత్త సిరీస్​ని తాజాగా లాంచ్​ చేసింది. దీని పేరు రియల్​మీ పీ1 సిరీస్​. అద్భుతమైన పనితీరును అందించడమే లక్ష్యంగా లాంచ్​ చేసిన ఈ సిరీస్​లో.. రియల్​మీ పీ1 5జీ, రియల్​మీ పీ1 ప్రో 5జీ అనే రెండు స్మార్ట్​ఫోన్స్​ ఉన్నాయి. వీటి ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

రియల్​మీ పీ1 5జీ ధర వివరాలు..

రియల్​మీ పీ1 5జీ స్మార్ట్​ఫోన్​ 6 జీబీ ర్యామ్ / 128 జీబీ వేరియంట్ ధర రూ .15,999గా ఉంది. 8 జీబీ ర్యామ్ / 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .18,999గా ఉంది. రియల్​మీ పీ1 ప్రో 5జీ స్మార్ట్​ఫోన్​ 8 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999గాను, 8 జీబీ ర్యామ్/256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999గాను ఉంది.

రియల్​మీ పీ1 ప్రో 5జీ స్మార్ట్​ఫోన్​.. ప్యారట్ బ్లూ, ఫీనిక్స్ రెడ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

రియల్​మీ పీ1 5జీ- రియల్​మీ పీ1 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు..

Realme P1 pro 5G price : రియల్​మీ పీ1, రియల్​మీ పీ1 ప్రో 5జీలో 6.67 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. 2400 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్​తో ఈ స్మార్ట్​ఫోన్స్​ వస్తున్నాయి. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్​నెస్ వంటివి వీటిల్లో ఉన్నాయి.

ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్​మీ యూఐ 5.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​ పనిచేస్తాయి. రియల్​మీ.. ఈ డివైజ్​లకు 3 సంవత్సరాల ఓఎస్ అప్​డేట్స్, 4 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్​లను ఇస్తామని హామీనిచ్చింది.

Realme P1 5G specifcations : ప్రాసెసర్ విషయానికొస్తే, రియల్​మీ పీ1 5జీ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఎస్ఓసితో పనిచేస్తుంది. అన్ని గ్రాఫిక్స్ సంబంధిత పనుల కోసం మాలి-జ68 ఎంసీ 4 జీపీయును కనెక్ట్​ చేసింది సంస్థ. హైఎండ్ పీ1 ప్రో 5జీ స్మార్ట్​ఫోన్​లో క్వాల్కమ్ స్నాప్​డ్రాగన్ 6 జెన్ 1 చిప్​సెట్​, అడ్రినో జీపీయూ ఉన్నాయి. రెండు స్మార్ట్​ఫోన్​లు 8 జీబ వరకు ఎల్పిడిడిఆర్ 4ఎక్స్ ర్యామ్, 256 జీబీ యుఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్​తో వస్తాయి. దీంతోపాటు మైక్రో ఎస్​డీ కార్డు ద్వారా ఈ డివైజ్​లలో స్టోరేజ్​ను.. 1 టీబీ వరకు పెంచుకోవచ్చు!

ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​లో 50 మెగాపిక్సెల్ సోనీ ఎల్వైటి 600 ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉన్నాయి. అయితే, పీ1 ప్రో 5జీలో 8 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్​కు సంబంధించిన అన్ని అవసరాలను తీర్చడానికి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉంది. పీ1 5జీ, పీ1 ప్రో 5జీ రెండూ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​తో వస్తున్నాయి.

ఇంకో విషయం! హెచ్​టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్ ఛానల్స్​లో ఉంది! టెక్నాలజీ ప్రపంచం నుంచి ఎటువంటి అప్డేట్స్​ని మీరు మిస్ కాకుండా ఉండటానికి మమ్మల్ని అక్కడ అనుసరించండి. వాట్సప్ లో హెచ్​టీ తెలుగు ఛానల్​ని అనుసరించండి.

Whats_app_banner

సంబంధిత కథనం