తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Samsung Galaxy F15 : ఇండియాలో సామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​15 లాంచ్​.. ధర ఎంతంటే..

Samsung Galaxy F15 : ఇండియాలో సామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​15 లాంచ్​.. ధర ఎంతంటే..

Sharath Chitturi HT Telugu

04 March 2024, 15:15 IST

google News
  • Samsung Galaxy F15 :  సామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​15 స్మార్ట్​ఫోన్​ ఇండియాలో లాంచ్​ అయ్యింది. ఈ మోడల్​ ఫీచర్స్​, ధర వివరాలు మీకోసం..

సామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​15 ఇదిగో.,
సామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​15 ఇదిగో.,

సామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​15 ఇదిగో.,

Samsung Galaxy F15 price in India : సామ్​సంగ్​ తన కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​.. గెలాక్సీ ఎఫ్​15 5జీని ఇండియాలో లాంచ్​ చేసింది. ఇది.. మీడియాటెక్ 6100+ ప్రాసెసర్​తో పనిచేస్తుంది. అంతేకాకుండా.. ఈ మొబైల్​పై 4 సంవత్సరాల పాటు ఓఎస్ అప్డేట్స్​ని సంస్థ ఇస్తుందట! ఈ స్మార్ట్​ఫోన్​.. బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్ సెగ్మెంట్​లో.. రెడ్ మీ, రియల్ మీ, మోటరోలా వంటి ప్రత్యర్థి కంపెనీల స్మార్ట్​ఫోన్లకు గట్టి పోటీ ఇస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

సామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​15 విశేషాలు..

సామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​15 4జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999, 6జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999గా ఉన్నాయి. జాజీ గ్రీన్, గ్రూవీ వయొలెట్ ఫోన్లు ఫ్లిప్​కార్ట్​లో లభిస్తాయి. ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్.. ప్రస్తుతం ఫ్లిప్​కార్ట్ , సామ్​సంగ్​ ఇండియా వెబ్​సైట్​లో లిస్ట్ అయింది. ఈ రోజు రాత్రి 7:00 గంటలకు సేల్స్​ మొదలవుతాయి.

డిసెంబర్​లో లాంచ్​ అయిన గెలాక్సీ ఏ15 5జీ స్మామర్ట్​ఫోన్​ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,499గా ఉంది.

సామ్​సంగ్ గెలాక్సీ ఎఫ్ 15 స్పెసిఫికేషన్లు..

Samsung Galaxy F15 : సామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​15లో 6.5 ఇంచ్​ ఫుల్ హెచ్​డీ+ ఎస్​అమోలెడ్ డిస్​ప్లే ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్​తో పనిచేసే ఈ బడ్జెట్ స్మార్ట్​ఫోన్​ 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్​ని సపోర్ట్ చేస్తుంది. గెలాక్సీ ఎఫ్ 15 5జీ మైక్రో ఎస్​డీ కార్డ్ ద్వారా 1 టీబీ వరకు స్టోరేజ్ ఎక్స్​ప్యాన్షన్​ ఆప్షన్​ ఉంటుంది.

సామ్​సంగ్​ కొత్త స్మార్ట్​ఫోన్​ రేర్​లో 50ఎంపీ ప్రైమరీ, 5ఎంపీ సెకెండరీ, 2ఎంపీ మాక్రో లెన్స్​తో కూడిన ట్రిపుల్​ రేర్​ కెమెరా సెటప్​ ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం ఇందులో 13ఎంపీ ఫ్రెంట్​ కెమెరా వస్తోంది.

ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత వన్ యూఐ 6పై గెలాక్సీ ఎఫ్ 15 5జీ పనిచేస్తుంది. సామ్​సంగ్ ఈ ఫోన్​తో 4 సంవత్సరాల ఓఎస్ అప్​డేట్స్​ని ఆఫర్ చేస్తోంది. అంటే గెలాక్సీ ఎఫ్ 15 5జీ కనీసం ఆండ్రాయిడ్ 18 వరకు ఓఎస్ అప్​డేట్​లను అందుకుంటుందని అర్థమవుతుంది.

25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​తో 6,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ కలిగి ఉంది. అయితే, ఛార్జింగ్ అడాప్టర్ బాక్స్​తో ఇవ్వడం లేదు. వేగవంతమైన ఛార్జింగ్ సామర్థ్యాలను ఆస్వాదించడానికి వినియోగదారులు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని గుర్తు పెట్టుకోవాలి.

Samsung Galaxy F15 India launch : బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ సెగ్మెంట్​లో ఇప్పటికే విపరీతమైన పోటీ ఉంది. దాదాపు ప్రతి స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ కూడా.. వరుసపెట్టి ఈ సెగ్మెట్​లో గ్యాడ్జెట్స్​ని వదులుతోంది. ఇక సామ్​సంగ్​ కొత్త స్మార్ట్​ఫోన్​కు ఎంత డిమాండ్​ కనిపిస్తుందో వేచి చూడాలి.

తదుపరి వ్యాసం