Top premium smartphones : 2024లో.. బెస్ట్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్ లిస్ట్ ఇదే..!
29 January 2024, 12:50 IST
- Premium smartphones in India : ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనాలని భావిస్తున్నారా? అయితే.. ఈ లిస్ట్ మీకు ఉపయోగపడుతుంది. టాప్ స్మార్ట్‌ఫోన్స్ వివరాలు ఇవే..
2024లో.. బెస్ట్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్ లిస్ట్ ఇదే..!
Top Premium smartphones to buy : ఓ మంచి ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? మార్కెట్లో ఉన్న ఆప్షన్స్ చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారా? కంగారు పడకండి! ఇండియా గ్యాడ్జెట్స్ మార్కెట్లో.. టాప్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్ లిస్ట్‌ని మీకోసం మేము రూపొదించాము. ఆ లిస్ట్‌ని ఇక్కడ చూసేయండి.
టాప్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్..
సామ్సంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా:- ఈ సామ్సంగ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లో 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.7 ఇంచ్- 6.8 ఇంచ్ క్యూహెచ్డీ+ డిస్ప్లే ఉంటుంది. ఎస్ పెన్ కూడా లభిస్తోంది. ఎస్24 అల్ట్రాలో టిటానియం ఫ్రేమ్ ఉంటుంది. 200ఎంపీ ప్రైమరీ, 50ఎంపీ టెలిఫొటో, 10ఎంపీ టెలిఫొటో, 12ఎంపీ అల్ట్రా వైడ్‌తో కూడిన క్వాడ్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. 12ఎంపీ ఫ్రెంట్ కెమెరా వస్తోంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ దీని సొంతం. ఇందులో అనేక సూపర్ ఏఐ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ మొబైల్ ధర రూ. 1,39,999గా ఉంది.
Apple iPhone 15 pro max price : యాపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్:- ఈ యాపిల్ స్మార్ట్‌ఫోన్‌లో 6.7 ఇంచ్ స్క్రీన్ ఉంటుంది. 48ఎంపీతో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా దీని సొంతం. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 12ఎంపీ ఫ్రెంట్ కెమెరా వస్తోంది. ఇందులో.. యాపిల్ ఏ17 ప్రో చిప్సెట్ ఉంటుంది. 4,441 ఎంఏహెచ్ బ్యాటరీ, 15వాట్ వయర్లెస్, 4.5వాట్ రివర్స్ వయర్డ్ ఛార్జర్ సపోర్ట్ లభిస్తోంది. ఈ మోడల్ ప్రారంభ ధర రూ. 1,56,900గా ఉంది.
గూగుల్ పిక్సెల్ 8 ప్రో:- ఇందులో 6.7 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. కార్నరింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ లభిస్తోంది. ఆండ్రాయిడ్ 14పై ఈ మొబైల్ పనిచేస్తుంది. 50ఎంపీ ప్రైమరీతో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ దీని సొంతం. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 10.5 ఎంపీ ఫ్రెంట్ కెమెరా వస్తోంది. గూగుల్ టెన్సార్ జీ3 ప్రాసెసర్ ఇందులో ఉంటుంది. 5050 ఎంఏహెచ్ బ్యాటరీ, 30వాట్ వయర్డ్, 23వాట్ వయర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తోంది. ఈ గ్యాడ్జెట్ ప్రారంభ ధర రూ. 1,06,999గా ఉంది.
OnePlus 12 price in India : వన్‌ప్లస్ 12:- వన్‌ప్లస్ 12లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంది. 120 హెజ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.82 ఇంచ్ కర్వ్డ్ ఓఎల్ఈడీ డిస్ప్లే వస్తోంది. 50ఎంపీ ప్రైమరీ, 64ఎంపీ సెకెండరీ, 48ఎంపీ అల్ట్రావైడ్ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఇందులో 32ఎంపీ ఫ్రెంట్ కెమెరా లభిస్తోంది. 5,400ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు 100 వాట్ వయర్డ్- 50వాట్ వయర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. వన్‌ప్లస్ 12 ప్రారంభ ధర రూ. 64,999గా ఉంది.