తెలుగు న్యూస్  /  Business  /  Best Mid-range Phones With High Camera Quality In 2023

Best camera phones: బెస్ట్ కెమెరా క్వాలిటీ ఉన్న మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్ ఇవి..

HT Telugu Desk HT Telugu

24 March 2023, 18:39 IST

  • స్మార్ట్ ఫోన్ కొనేముందు వినియోగదారులు చూసే ముఖ్యమైన ఫీచర్ కెమెరా క్వాలిటీ. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఫోన్లలో అత్యుత్తమ కెమెరా క్వాలిటీ ఉన్న, అందుబాటు ధరలో లభించే ఫోన్లు ఇవి. 

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Pexels)

ప్రతీకాత్మక చిత్రం

ఇప్పుడు మన జీవితంలో చోటు చేసుకునే ప్రతీ చిన్నా, పెద్దా ఈవెంట్స్ ను కూడా ఫొటోల్లో భద్రపర్చుకుంటున్నాం. స్మార్ట్ ఫోన్ విప్లవం తీసుకువచ్చిన సౌలభ్యం ఇది. అత్యాధునిక కెమెరా సెటప్ లతో స్మార్ట్ ఫోన్స్ ఇప్పుడు మార్కెట్ ను ముంచెత్తుతున్నాయి. అయినా, వినియోగదారులు అందుబాటు ధరలోనే మంచి క్వాలిటీ కెమెరా ఉన్న ఫోన్ కోసం చూస్తుంటారు.

Samsung Galaxy S20 FE 5G: స్యామ్సంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5 జీ

సామ్సంగ్ నుంచి వచ్చిన బెస్ట్ కెమెరా క్వాలిటీ కలిగిన స్మార్ట్ ఫోన్ ఇది. ఫొటోగ్రఫీ ప్రేమికులకు ఇది బెస్ట్ చాయిస్. ఇందులో స్నాప్ డ్రాగన్ 865 అక్టాకోర్ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమొరీ ఉన్నాయి. స్టోరేజీని 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఈ 5జీ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. అంటే, బ్యాక్ సైడ్ 12 ఎంపీ (12MP (Dual Pixel)), 8 ఎంపీ (8MP OIS Tele Camera), 12 ఎంపీ (Ultra Wide lens) కెమెరా సెటప్ ఉంది. అలాగే, 30 ఎక్స్ స్పేస్ జూమ్, సింగిల్ టేక్, నైట్ మోడ్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

OnePlus 10R 5G : వన్ ప్లస్ 10 ఆర్ 5 జీ

చైనాలోని ప్రముఖ మొబైల్ మేకర్ వన్ ప్లస్ నుంచి వచ్చిన 10 ఆర్ 5 జీ (OnePlus 10R 5G) కూడా మంచి కెమెరా క్వాలిటీ కలిగి ఉంది. ఇందులో 50 ఎంపీ మెయిన్ కెమెరా (50 MP Main Camera - Sony IMX766), డ్యుయల్ ఎల్ఈడీ ఫ్లాష్ తో 2 ఎంపీ మాక్రో కెమెరా16 ఎంపీ ఫ్రంట్ కెమెరా (Sony IMX471) ఉన్నాయి. ఈ ఫోన్ నైట్ స్కేప్, సూపర్ మాక్రో, అల్ట్రా షాట్ హెచ్డీఆర్ ఫీచర్లు ఉన్నాయి. ఇది 6.7 అంగుళాల డిస్ ప్లే తో వస్తోంది.

OnePlus Nord 2T 5G: వన్ ప్లస్ నార్డ్ 2 టీ 5 జీ

ఇందులో కూడా మంచి క్వాలిటీ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 ఎంపీ మెయిన్ కెమెరా (50 MP Main Camera - Sony IMX766), డ్యుయల్ ఎల్ఈడీ ఫ్లాష్ తో 2 ఎంపీ మోనో లెన్స్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా (Sony IMX615) ఉన్నాయి. 6.43 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే, కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 సెక్యూరిటీ, హెచ్ డీఆర్ 10 ప్లస్ ఉన్నాయి. ఏఐ బేస్డ్ కలర్ సిస్టమ్ ఉంది. ఇందులో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో మీడియా టెక్ డైమెన్సిటీ 1300 (Mediatek Dimensity 1300) ప్రాసెసర్ ను అమర్చారు.

iQOO Z6 Pro 5G: ఐక్యూ జీ 6 ప్రొ 5 జీ

ఇది హై పెర్ఫార్మెన్స్ స్మార్ట్ ఫోన్. ఇందులో 64 ఎంపీ ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ఉంది. 8 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరా ఉన్నాయి. ఏఐ సూపర్ నైట్ మోడ్, సూపర్ వైడ్ యాంగిల్ నైట్ మోడ్ ల్లో చీకట్లో కూడా నాణ్యమైన ఫొటోలు తీయవచ్చు. ఇందులో స్నాప్ డ్రాగన్ 778 జీ ప్రాసెసర్, 66 వాట్ ఫ్లాష్ చార్జింగ్ ఫెసిలీటీ ఉన్నాయి. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఈ స్మార్ట్ ఫోన్ స్పెషాలిటీ.

Samsung Galaxy M53 5G సామ్సంగ్ గెలాక్జీ ఎం 53 5 జీ

అఫర్డబుల్ ధరలో సామ్సంగ్ నుంచి వచ్చిన 5 జీ ఫోన్ ఇది. ఇందులో 108 ఎంపీ క్వాడ్ కెమెరా సిస్టమ్ ను అమర్చారు. సింగిల్ టేక్, ఆబ్జెక్ట్ ఇరేజర్, ఫొటో రీమాస్టర్ వంటి ఫీచర్లతో అద్భుతమైన ఫొటోలను ఈ ఫోన్ ద్వారా తీసుకోవచ్చు. ఈ ఫోన్ కు 6.7 అంగుళాల Super AMOLED Plus FHD+ డిస్ ప్లే ఉంది. ఇందులో ఎంటీకే డీ 900 ప్రాసెసర్ ను అమర్చారు.