Samsung Galaxy S23 FE: శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ పై ఊహించనంత భారీ డిస్కౌంట్-amazon rolls out samsung galaxy s23 fe price cut check discounts offers and more ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Samsung Galaxy S23 Fe: శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ పై ఊహించనంత భారీ డిస్కౌంట్

Samsung Galaxy S23 FE: శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ పై ఊహించనంత భారీ డిస్కౌంట్

HT Telugu Desk HT Telugu
Feb 24, 2024 04:32 PM IST

Samsung Galaxy S23 FE: ప్రీమియం స్మార్ట్ ఫోన్ గా మార్కెట్లోకి వచ్చిన శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 ఎఫ్ఇ ఇప్పుడు భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. తక్కువ ధరలో శామ్సంగ్ ప్రీమియం ఫోన్ కు అప్ గ్రేడ్ కావాలనుకునేవారికిి ఇది మంచి చాయిస్ గా నిలుస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 ఎఫ్ఇ 5 జీ ప్రీమియం స్మార్ట్ ఫోన్
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 ఎఫ్ఇ 5 జీ ప్రీమియం స్మార్ట్ ఫోన్ (Samsung)

Samsung Galaxy S23 FE: మీరు శాంసంగ్ ప్రీమియం ఫోన్ కు అప్ గ్రేడ్ కావాలనుకుంటున్నారా?.. ఆమెజాన్ మీకు మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 ఎఫ్ఇ 5 జి ఇప్పుడు అమెజాన్ లో నమ్మశక్యం కాని తగ్గింపు ధరలో లభిస్తుంది. 38 శాతం ధర తగ్గింపుతో ఈ శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 ఎఫ్ఇ ని ఇప్పుడు సొంతం చేసుకోవచ్చు.ఈ స్మార్ట్ ఫోన్ అసలు ఒరిజినల్ ధర రూ .79,999 కాగా, ఇప్పుడు ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ కేవలం రూ .49,999 లకు కొనుగోలు చేయవచ్చు.

ఇతర బ్యాంక్ ఆఫర్స్, క్యాష్ బ్యాక్స్ కూడా..

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 ఎఫ్ఇ 5 జీ (Samsung Galaxy S23 FE) స్మార్ట్ ఫోన్ పై ఆమెజాన్ లో 38% డిస్కౌంట్ తో పాటు పలు ఇతర బ్యాంక్ ఆఫర్స్, క్యాష్ బ్యాక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అవి

  • నో కాస్ట్ ఈఎంఐ: శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 ఎఫ్ఇ 5 జీ స్మార్ట్ ఫోన్ ను కస్టమర్లు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ను ఎంచుకుని, నెలవారీ కేవలం రూ.2,424 ఈఎంఐ చెల్లించి సొంతం చేసుకోవచ్చు. ఈ నో కాస్ట్ ఈఎంఐ విధానంలో అదనంగా ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు.
  • బ్యాంక్ ఆఫర్: శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 ఎఫ్ఇ 5 జీ స్మార్ట్ ఫోన్ ను ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1,500 వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
  • పార్టనర్ ఆఫర్లు: జీఎస్టీ ఇన్ వాయిస్ తో చేసే వ్యాపార కొనుగోళ్లపై అదనంగా 28 శాతం వరకు ఆదా చేసే అవకాశం ఉంది.
  • ఎక్స్ఛేంజ్ ఆఫర్: ప్రస్తుతం వర్కింగ్ కండిషన్ లో ఉన్న మీ పాత స్మార్ట్ ఫోన్ ను ఎక్స్చేంజ్ చేస్తే, ఈ ఫోన్ కొనుగోలుపై రూ .27,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 ఎఫ్ఈ ఎందుకు కొనాలి?

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 ఎఫ్ఇ 5 జీ ప్రీమియం డిజైన్, అధునాతన కెమెరా నాణ్యత, శక్తివంతమైన పనితీరుతో సహా అత్యాధునిక లక్షణాల శ్రేణిని కలిగి ఉంది. ఐకానిక్ డిజైన్ హెరిటేజ్, ఫ్లోటింగ్ కెమెరా డిజైన్, ప్రీమియం మెటల్ ఫినిషింగ్ తో గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ ఆకర్షణీయంగా రూపొందింది. అదనంగా, ఎపిక్ నైటోగ్రఫీ, ప్రో-గ్రేడ్ కెమెరా ఫీచర్లు ఉన్నాయి.