Samsung Galaxy Ring : సామ్సంగ్ గెలాక్సీ రింగ్ ఫీచర్స్ ఇవే..!
Samsung Galaxy Ring price : సామ్సంగ్ గెలాక్సీ రింగ్‌పై తాజాగా ఓ రిపోర్ట్ బయటకి వచ్చింది. ఈ గ్యాడ్జెట్ గురించి పలు ఆసక్తికర విషయాలు ఆ రిపోర్ట్‌లో ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేయండి.
Samsung Galaxy Ring launch date : సామ్సంగ్ గెలాక్సీ రింగ్ గురించి మొదటి వార్త బయటకి వచ్చినప్పటి నుంచి ఈ గ్యాడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు ఈ రింగ్‌కు సంబంధించి పెద్దగా వివరాలు తెలియకపోవడం, సంస్థ కూడా సీక్రెసీని మెయిన్టైమ్ చేస్తుండటంతో.. గెలాక్సీ రింగ్‌పై అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఇప్పుడు.. ఈ ఇన్నోవేటివ్ గ్యాడ్జెట్‌కి సంబంధించిన కొన్ని ఫీచర్స్ లీక్ అయ్యాయి. వాటిని చూసేద్దాము..
సామ్సంగ్ గెలాక్సీ రింగ్- ఫీచర్స్ ఇవేనా..?
కొరియన్ సంస్థ 'ది ఎలెక్' ప్రకారం.. ఈ సామ్సంగ్ గెలాక్సీ రింగ్ ప్రస్తుతం ప్రోటోటైప్ దశలో ఉంది. రెండో త్రైమాసికంలో దీని మాస్ ప్రొడక్షన్ ప్రారంభమవ్వొచ్చు. అంటే.. సుమారు ఇంకో నెల- నెలన్నర సమయం మాత్రమే ఉంది!
ది ఎలెక్ నివేదిక ప్రకారం.. కొన్ని నెలల్లో సామ్సంగ్ గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ జరుగుతుంది. అందులో.. గెలాక్సీ జెడ్ ఫోలడ్ 6, ఫ్లిప్ 6 స్మార్ట్‌ఫోన్స్‌ని సంస్థ లాంచ్ చేస్తుంది. వాటితో పాటు.. ఈ సామ్సంగ్ గెలాక్సీ రింగ్ కూడా లాంచ్ అవుతుంది! జులై చివర్లో.. ఈ ఈవెంట్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో అన్ప్యాక్డ్ ఈవెంట్స్.. సుమారు అదే సమయంలో జరిగాయి.
Samsung Galaxy Ring price in India : ఇక ఈ సామ్సంగ్ గెలాక్సీ రింగ్ గ్యాడ్జెట్లో అదిరిపోయే, గ్రౌండ్బ్రైకింగ్ ఫీచర్స్ ఉంటాయని టాక్ నడుస్తోంది. ఈ వేరెబుల్ గ్యాడ్జెట్లో బ్లడ్ ఫ్లో మెజరింగ్ కెపబులిటీస్ ఉంటాయట. హార్ట్ రేట్ మానిటరింగ్ సిస్టెమ్ ఎలాగూ ఉంటుంది! అయితే.. గుండె రిథమ్ సరిగ్గా లేకపోతే, దానిని పసిగట్టేందుకు ఉపయోగపడే ఎలక్ట్రోకార్డియోగ్రామ్ వంటి ఫీచర్స్ ఈ డివైజ్‌లో ఉంటాయని తెలుస్తోంది.
అంతేకాకుండా.. ఈ రింగ్ కేవలం హెల్త్ మానిటరింగ్ ఒక్కటే కాకుండా ఇతర పనులు కూడా చేస్తుందట. ఈ రింగ్‌తో వయర్లెస్ పేమెంట్స్ చేయవచ్చని, ఇతర డివైజ్‌లను కంట్రోల్ చేయవచ్చని ది ఎలెక్ చెబుతోంది. సామ్సంగ్ పే, సామ్సంగ్థింగ్స్ వంటి ఇన్హౌడ్ సాఫ్ట్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఈ రింగ్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు!
Samsung Galaxy Ring features : అయితే.. ఈ రింగ్ యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది? అన్న విషయంపై ప్రస్తుతం క్లారిటీ లేదు. అదే సమయంలో సామ్సంగ్ గెలాక్సీ ఏఐని ఈ రింగ్‌లో సంస్థ వాడుతుందా? అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఇన్ని కొత్త, క్రేజీ ఫీచర్స్ ఉంటే.. ఈ సామ్సంగ్ గెలాక్సీ రింగ్ ధర చాలా ఎక్కువగానే ఉండొచ్చని టాక్ నడుస్తోంది.
ఏది ఏమైనా.. సామ్సంగ్ గెలాక్సీ రింగ్ గ్యాడ్జెట్ ఫంక్షనాలిటీపై అందరిలోను కుతుహలం నెలకొంది. ఇన్నోవేషన్‌ని, యూజబులిటీని ఈ రింగ్ ఎలా మేనేజ్ చేస్తుంది? అన్నది అత్యంత ఆసక్తికర విషయంగా మారింది.
Samsung Galaxy Ring : అయితే.. ప్రస్తుతం ఇవన్నీ రూమర్స్ స్టేజ్‌లోనే ఉన్నాయి. వీటిపై సంస్థ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ సామ్సంగ్ గెలాక్సీ రింగ్ ఫీచర్స్, ధర, లాంచ్ డేట్‌పై త్వరలోనే ఓ ప్రకటన వస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అఫీషియల్ ప్రకటన వచ్చేంత వరకు.. సామ్సంగ్ లవర్స్‌లో కచ్చితంగా ఆసక్తి పెరిగిపోతుంది!
సంబంధిత కథనం