తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Smartphones: 20 వేల లోపు ధరలో అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే..

Best smartphones: 20 వేల లోపు ధరలో అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే..

HT Telugu Desk HT Telugu

17 February 2024, 20:07 IST

  • Best smartphones under 20K: అద్భుతమైన కెమెరా క్వాలిటీ, నాణ్యమై డిస్ ప్లే, మరెన్నో అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్ అందుబాటు ధరలో కావాలా? ఈ కింద చూపిన ఐదు స్మార్ట్ ఫోన్స్ ను పరిశీలించండి. ఈ జాబితాలో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 54, రెడ్మి నోట్ 13 కూడా ఉన్నాయి.

రూ. 20 వేల లోపు బెస్ట్ ఫోన్స్
రూ. 20 వేల లోపు బెస్ట్ ఫోన్స్ (unsplash)

రూ. 20 వేల లోపు బెస్ట్ ఫోన్స్

Best smartphones under 20K: అందుబాటు ధరలో అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో, అద్భుతమైన కెమెరా సెటప్ తో, నాణ్యమైన డిస్ ప్లే తో ఉన్న స్మార్ట్ ఫోన్ ను ఎంపిక చేసుకోవడం గుప్త నిధిని కనుగొనడంతో సమానం. అలాంటి ఫోన్స్ ను మీ కోసం రీసెర్చ్ చేసి మీ ముందుకు తీసుకువచ్చాం.

ట్రెండింగ్ వార్తలు

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

Motorola X50 Ultra : మోటోరోలా ఎక్స్​50 అల్ట్రా లాంచ్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

1. రెడ్మీ నోట్ 13 5జీ

రెడ్మీ నోట్ 13 5జీ స్మార్ట్ ఫోన్ లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.67 అంగుళాల ఎఫ్ హెచ్ డీ+ పీఓ ఎల్ఈడీ డిస్ ప్లే ఉంటుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 6ఎన్ఎం ఆక్టాకోర్ ప్రాసెసర్ ను అమర్చారు. ఈ ఫోన్ లో 20 జీబీ వరకు పెంచుకోగల ర్యామ్ (8 జీబీ వర్చువల్ ర్యామ్ సహా) ఉంది. అలాగే, 108 మెగాపిక్సెల్ ఏఐ ట్రిపుల్ కెమెరా సెటప్, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్స్ ఉన్నాయి.

2. ఐక్యూ జెడ్7 ప్రో 5జీ

ఐక్యూ జెడ్7 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ డైమెన్సిటీ 7200 5జీ ప్రాసెసర్ తో, సరికొత్త 4ఎన్ఎం ఎనర్జీ ఎఫిషియెన్సీ ప్రాసెస్ తో రూపుదిద్దుకుంది. ఇందులో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.78 అంగుళాల 3డీ కర్వ్డ్ సూపర్ విజన్ డిస్ ప్లే ఉంది. అలాగే, 64 ఎంపీ ఆరా లైట్ ఓఐఎస్ కెమెరా అదిరిపోయే క్యాప్చర్లను అందిస్తుంది. ఈ డివైస్ యొక్క స్లిమ్ ప్రొఫైల్, ప్రీమియం ఎజి మ్యాట్ గ్లాస్ ఫినిషింగ్ తో ప్రీమియం స్మార్ట్ ఫోన్ లుక్ ను ఇస్తుంది. ఇందులో 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

3. వివో వై200 5జీ

డ్యూయల్ 64 ఎంపీ +2 ఎంపీ రియర్ కెమెరా సెటప్, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా కలిగిన వివో వై200 5జీ ప్రతి క్షణాన్ని క్లియర్ గా క్యాప్చర్ చేస్తుంది. ఇందులో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.67 అంగుళాల ఎఫ్ హెచ్ డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లే ఉంటుంది. ఇందులో ఎస్ డీ 4 జెన్ 1 ప్రాసెసర్ ను అమర్చారు. ఈ ఫోన్ లో 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమొరీని అందించారు. 44వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేసే 4800 ఎంఏహెచ్ బ్యాటరీని పొందుపర్చారు.

4. వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ

వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ స్మార్ట్ ఫోన్లో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, అల్ట్రా స్టడీ మోడ్, డ్యుయల్ వ్యూ వీడియో వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 6.7 అంగుళాల 120 హెర్ట్జ్ అమోఎల్ఈడీ ఎఫ్ హెచ్ డీ+ డిస్ ప్లే ఉంది. అలాగే, ఇందులో శక్తిమంతమైన క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 782జీ ప్రాసెసర్ ను పొందుపర్చారు. ఇది ఆండ్రాయిడ్ 13.1 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 13 యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ పై పని చేస్తుంది.

5. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్54 5జీ

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 54 5 జీ అద్భుతమైన ఫీచర్ సెట్ ను ప్రదర్శిస్తుంది. ఇందులో తక్కువ కాంతిలో ఫోటోలు తీసే వీలు కల్పించే నైట్రోగ్రఫీ మోడ్ ఉంది. ఇందులో శక్తివంతమైన 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఆస్ట్రోలాప్స్ మోడ్, ఆటో నైట్ మోడ్ సెల్ఫీ కెమెరా సపోర్ట్ తో ఫోటోగ్రఫీ ప్రియులను అలరిస్తుంది. డివైజ్ యొక్క సొగసైన డిజైన్, ఇమ్మర్సివ్ డిస్ ప్లే యూజర్లను ఆకర్షిస్తుంది. ఇందులో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

తదుపరి వ్యాసం