తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Royal Enfield Himalayan 450 : హైదరాబాద్​లో హిమాలయన్​ 450 ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..

Royal Enfield Himalayan 450 : హైదరాబాద్​లో హిమాలయన్​ 450 ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..

Sharath Chitturi HT Telugu

30 November 2023, 15:15 IST

google News
    • Royal Enfield Himalayan 450 : రాయల్​ ఎన్​ఫీల్డ్​ హిమాలయన్​ 450 బైక్​ కొనాలని చూస్తున్నారా? హైదరాబాద్​లో ఈ బైక్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హైదరాబాద్​లో హిమాలయన్​ 450 ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..
హైదరాబాద్​లో హిమాలయన్​ 450 ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..

హైదరాబాద్​లో హిమాలయన్​ 450 ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..

Royal Enfield Himalayan 450 on road price Hyderabad : రాయల్​ ఎన్​ఫీల్డ్​ హిమాలయన్​ 450 బైక్​ని ఇటీవలే లాంచ్​ చేసింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. ఈ మోడల్​పై బైక్​ లవర్స్​లో ఆసక్తి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్​లో హిమాలయన్​ 450 ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

హిమాలయన్​ 450 ఆన్​రోడ్​ ప్రైజ్​..

రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త బైక్​లో మూడు వేరియంట్లు ఉన్నాయి. అవి.. బేస్​, పాస్​, సమిట్​. వీటి ఎక్స్​షోరూం ధరలు వరుసగా రూ. 2.69లక్షలు, రూ. 2.74లక్షలు, రూ. 2.84లక్షలుగా ఉన్నాయి. ఇక హైదరాబాద్​లో వీటి ఆన్​రోడ్​ ప్రైజ్​లు..

  • హిమాలయన్​ 450 బేస్​:- రూ. 3,23,053
  • హిమాలయన్​ 450 పాస్​​:- రూ. 3,28,699.
  • హిమాలయన్​ 450 సమిట్​​:- రూ. 3,34,345.

Royal Enfield Himalayan 450 price : ఎన్​ఫీల్డ్​ హిమాలయన్​ 450 బుకింగ్స్​ ఓపెన్​ అయ్యాయి. సంస్థకు చెందిన డీలర్​షిప్​షోరూమ్స్​లో ఈ వెహికిల్​ని బుక్​ చేసుకోవచ్చు. కాగా.. డిసెంబర్​ 31 వరకు ఈ ధరలు అమల్లో ఉంటాయని సంస్థ చెప్పింది. ఆ తర్వాత.. బైక్​ ధరలు పెరిగే అవకాశం ఉందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి.

ఇదీ చూడండి:- Royal Enfield Himalayan 450 vs KTM 390 Adventure : ఈ రెండు బైక్స్​లో ఏది కొనాలి?

రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త బైక్​ విశేషాలు..

రాయల్​ ఎన్​ఫీల్డ్​ హిమాలయన్​ 450లో 450సీసీ, సింగిల్​ సిలిండర్​, లిక్విడ్​ కూల్డ్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది.. 450 హెచ్​పీ పవర్​ని, 40 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. ఈ వెహికిల్​ బరువు 196కేజీలు. ఇందులో 17 లీటర్​ ఫ్యూయెల్​ ట్యాంక్​ ఉంటుంది. 825ఎంఎం అడ్జెస్టెబుల్​ సీట్​ హైట్​ లభిస్తోంది.

ఇక ఈ కొత్త బైక్​లో రౌండ్​ టీఎఫ్​టీ కలర్​ స్క్రీన్​ వస్తోంది. ఇందులో గూగుల్​ మ్యాప్స్​ ఇంటిగ్రేటెడ్​గా ఉంటాయి. ఈ స్క్రీన్​ని స్మార్ట్​ఫోన్​తో కనెక్ట్​ చేసుకోవచ్చు. కాల్స్​, నోటిఫికేషన్స్​, ఎస్​ఎంఎస్​లని యాక్సెస్​ చేసుకోవచ్చు. అదనంగా.. రైడ్​- బై- వైర్​ టెక్నాలజీ, స్విఛ్చెబుల్​ ఏబీఎస్​, ఫుల్​- ఎల్​ఈడీ లైటింగ్​ వంటివి కూడా ఈ బైక్​కి వస్తున్నాయి.

Royal Enfield Himalayan 450 price in Hyderabad : రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త బైక్​లో 21/17 ఇంచ్​ స్పోక్​ వీల్స్​ వస్తున్నాయి. సస్పెన్షన్స్​ విషయానికొస్తే.. ఫ్రెంట్​లో షోవా యూఎస్​డీ ఫోర్క్స్​, రేర్​లో మోనో-షాక్​ అబ్సార్బర్స్​ లభిస్తున్నాయి. ఫ్రెంట్​, రేర్​ వీల్స్​కి డిస్క్​ బ్రేక్స్​ వస్తున్నాయి.

కేటీఎం 390 అడ్వెంచర్​, బీఎండబ్ల్యూ జీ310 జీఎస్​ వంటి బైక్స్​కి ఈ రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త వెహికిల్​ గట్టిపోటీనిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

తదుపరి వ్యాసం