KTM 250 Duke vs Honda CB300R : ఈ రెండు బైక్స్‌లో ఏది కొనాలి?
26 November 2023, 14:35 IST
- KTM 250 Duke vs Honda CB300R : కేటీఎం 250 డ్యూక్ వర్సెస్ హోండా సీబీ300ఆర్.. ఈ రెండింట్లో ఏది బెస్ట్?
ఈ రెండు బైక్స్‌లో ఏది కొనాలి?
KTM 250 Duke vs Honda CB300R : 250 డ్యూక్‌ని కేటీఎం ఇటీవలే ఇండియాలో లాంచ్ చేసింది. ఈ బైక్.. హోండా సీబీ300ఆర్కు గట్టిపోటీనిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి, ఏది బెస్ట్ అనేది ఇక్కడ తెలుసుకుందాము..
కేటీఎం 250 డ్యూక్ వర్సెస్ హోండా సీబీ300ఆర్- లుక్స్..
కేటీఎం బైక్‌కు అగ్రెసివ్ స్ట్రీఫైటర్ లుక్ వస్తోంది. ఇక సీబీ300ఆర్కు నియో- రెట్రో కేఫ్ రేసర్ లుక్ ఉంటుంది. హోండా బైక్‌కి సర్క్యుల్ హెడ్‌ల్యాంప్, సైడ్ మౌంటెడ్ ఎగ్జాస్ట్ వంటివి ఉంటాయి. కేటీఎంలో షార్ప్ బాడీ ప్యానెల్స్, అండర్బెల్లీ ఎగ్జాస్ట్ యూనిట్లు వస్తున్నాయి.
కేటీఎం 250 డ్యూక్ వర్సెస్ హోండా సీబీ300ఆర్- ఇంజిన్..
హోండా సీబీ300ఆర్‌లో 286 సీసీ, సింగిల్- సిలిండర్, లిక్విడ్ కూల్డ్ డీఓహెచ్సీ ఇంజిన్ ఉంటుంది. ఇది.. 30.67 బీహెచ్పీ పవర్‌ని, 270.5 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్ అసిస్ట్ క్లచ్ వంటివి ఉంటాయి.
KTM 250 Duke price in Hyderabad : ఇక కేటీఎం 250 డ్యూక్‌లో 299 సీసీ, లిక్విడ్ కూల్డ్, ఎస్ఓహెచ్సీ ఇంజిన్ ఉంటుంది. ఇది 30.57 బీహెచ్పీ పవర్‌ని, 25 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్ అసిస్ట్ క్లచ్ వంటివి ఉంటాయి.
కేటీఎం 250 డ్యూక్ వర్సెస్ హోండా సీబీ300ఆర్- ఫీచర్స్..
హోండా సీబీ300ఆర్‌లో ఎల్ఈడీ లైటింగ్, నెగిటివ్ ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, హజార్డ్ లైట్స్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ ఉంటాయి. ఇక కేటీఎం బైక్‌లో ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్విచ్చెబుల్ ఏబీఎస్, బ్లూటూత్ కనెక్టివిటీ, రైడ్ బై వైర్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, హజార్డ్ లైట్స్, ఆల్ ఎల్ఈడీ లైటింగ్ వంటివి ఉంటాయి.
కేటీఎం 250 డ్యూక్ వర్సెస్ హోండా సీబీ300ఆర్- ధర..
Honda CB300R price in Hyderabad : కేటీఎం 250 డ్యూక్ ఎక్స్‌షోరూం ధర రూ. 2.39లక్షలుగా ఉంది. ఇక హోండా సీబీ300ఆర్ ఎక్స్‌షోరూం ధర రూ. 2.40లక్షలుగా ఉంది.