Royal Enfield Himalayan 450 : రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త బైక్​ లాంచ్​.. ధర ఎంతంటే!-royal enfield himalayan 450 launched in india check price details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Royal Enfield Himalayan 450 : రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త బైక్​ లాంచ్​.. ధర ఎంతంటే!

Royal Enfield Himalayan 450 : రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త బైక్​ లాంచ్​.. ధర ఎంతంటే!

Sharath Chitturi HT Telugu
Nov 25, 2023 08:05 AM IST

Royal Enfield Himalayan 450 : రాయల్​ ఎన్​ఫీల్డ్​ బైక్​ లవర్స్​కి క్రేజీ న్యూస్​! సరికొత్త బైక్​ని ఈ ఆటోమొబైల్​ సంస్థ లాంచ్​ చేసింది. దీని పేరు హిమాలయన్​ 450. ఈ బైక్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త బైక్​ లాంచ్​..
రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త బైక్​ లాంచ్​..

Royal Enfield Himalayan 450 : దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ రాయల్​ ఎన్​ఫీల్డ్​.. సరికొత్త బైక్​ని ఇండియాలో లాంచ్​ చేసింది. దీని పేరు రాయల్​ ఎన్​ఫీల్డ్​ హిమాలయన్​ 450. ఈ నేపథ్యంలో.. ఈ బైక్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త బైక్​ విశేషాలివే..

రాయల్​ ఎన్​ఫీల్డ్​ హిమాలయన్​ 450లో 450సీసీ, సింగిల్​ సిలిండర్​, లిక్విడ్​ కూల్డ్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది.. 450 హెచ్​పీ పవర్​ని, 40 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. ఈ వెహికిల్​ బరువు 196కేజీలు. ఇందులో 17 లీటర్​ ఫ్యూయెల్​ ట్యాంక్​ ఉంటుంది. 825ఎంఎం అడ్జెస్టెబుల్​ సీట్​ హైట్​ లభిస్తోంది.

ఇక ఈ కొత్త బైక్​లో రౌండ్​ టీఎఫ్​టీ కలర్​ స్క్రీన్​ వస్తోంది. ఇందులో గూగుల్​ మ్యాప్స్​ ఇంటిగ్రేటెడ్​గా ఉంటాయి. ఈ స్క్రీన్​ని స్మార్ట్​ఫోన్​తో కనెక్ట్​ చేసుకోవచ్చు. కాల్స్​, నోటిఫికేషన్స్​, ఎస్​ఎంఎస్​లని యాక్సెస్​ చేసుకోవచ్చు. అదనంగా.. రైడ్​- బై- వైర్​ టెక్నాలజీ, స్విఛ్చెబుల్​ ఏబీఎస్​, ఫుల్​- ఎల్​ఈడీ లైటింగ్​ వంటివి కూడా ఈ బైక్​కి వస్తున్నాయి.

Royal Enfield Himalayan 450 price : రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త బైక్​లో 21/17 ఇంచ్​ స్పోక్​ వీల్స్​ వస్తున్నాయి. సస్పెన్షన్స్​ విషయానికొస్తే.. ఫ్రెంట్​లో షోవా యూఎస్​డీ ఫోర్క్స్​, రేర్​లో మోనో-షాక్​ అబ్సార్బర్స్​ లభిస్తున్నాయి. ఫ్రెంట్​, రేర్​ వీల్స్​కి డిస్క్​ బ్రేక్స్​ వస్తున్నాయి.

రాయల్​ ఎన్​ఫీల్డ్​ హిమాలయన్​ 450 ధర..

ఈ రాయల్​ ఎన్​ఫీల్డ్​ హిమాలయన్​ 450లో మూడు వేరియంట్లు ఉన్నాయి. వాటి పేర్లు.. బేస్​, పాస్​, సమిట్​. బేస్​ వేరియంట్​ ఎక్స్​షోరూం ధర రూ. 2.69లక్షలుగా ఉంది. పాస్​ వేరియంట్​ ఎక్స్​షోరూం ధర రూ. 2.74లక్షలుగా ఉంది. సమిట్​ వేరియంట్​ ఎక్స్​షోరూం ధర రూ. 2.84లక్షలుగా ఉంది. ఇవి ఇంట్రొడక్టరీ ప్రైజ్​లని తెలుస్తోంది. డిసెంబర్​ 31 వరకు ఈ రేట్లు కొనసాగనున్నట్టు సమాచారం. ఆ తర్వాత.. కొత్త బైక్​ ధర పెరిగే అవకాశం ఉంది.

Royal Enfield Himalayan 450 price in India : ఈ రాయల్​ ఎన్​ఫీల్డ్​ హిమాలయన్​ 450 బుకింగ్స్​ ఓపెన్​ అయ్యాయి. సంస్థకు చెందన డీలర్​షిప్​షోరూమ్స్​లో ఈ వెహికిల్​ని బుక్​ చేసుకోవచ్చు.

కేటీఎం 390 అడ్వెంచర్​, బీఎండబ్ల్యూ జీ310 జీఎస్​ వంటి బైక్స్​కి ఈ రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త వెహికిల్​ గట్టిపోటీనిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

హిమాలయ్​ 411కి గుడ్​ బై..!

హిమాలయన్​ 411 బైక్​ని ఈ​ నెల చివరికి డిస్కంటిన్యూ చేయనున్నట్టు రాయల్​ ఎన్​ఫీల్డ్ ఇప్పటికే​ ప్రకటించింది. దేశ, విదేశీ విపణిలో ఇది కనిపించదని స్పష్టం చేసింది. ఈ రాయల్​ ఎన్​ఫీల్డ్​ హిమాలయన్​ 411 బైక్​.. 2016లో లాంచ్​ అయ్యింది. అడ్వంచర్​ టూరింగ్​ బైక్​గా దీనికి మంచి గుర్తింపు లభించింది. తాజా పరిస్థితుల్లో.. హిమాలయన్​ 452 మోడల్​.. ఈ 411 మోడల్​ని రిప్లేస్​ చేస్తుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం