Royal Enfield Himalayan 411 : హిమాలయన్ 411 బైక్‌కి గుడ్ బై చెప్పేసిన రాయల్ ఎన్ఫీల్డ్!
Royal Enfield Himalayan 411 : రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 411 ఇక కనిపించదు! ఈ నెల చివరికి.. ఈ మోడల్ సేల్స్‌ని సంస్థ నిలిపివేయనుంది.
Royal Enfield Himalayan 411 : హిమాలయన్ 411 బైక్‌ని నవంబర్ నెల చివరికి డిస్కంటిన్యూ చేయనున్నట్టు దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ ప్రకటించింది. దేశ, విదేశీ విపణిలో ఇది కనిపించదని స్పష్టం చేసింది.
ఈ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 411 బైక్.. 2016లో లాంచ్ అయ్యింది. అడ్వంచర్ టూరింగ్ బైక్‌గా దీనికి మంచి గుర్తింపు లభించింది. తాజా పరిస్థితుల్లో.. హిమాలయన్ 452 మోడల్.. ఈ 411 మోడల్ని రిప్లేస్ చేస్తుంది.
2016 నుంచి ఈ హిమాలయన్ 411ని అనేకమార్లు అప్డేట్ చేస్తూ వచ్చింది ఆటోమొబైల్ సంస్థ. కానీ ఇందులో పలు లోపాలు ఉండేవి. ఈ లోపలను కూడా సరిచేస్తూ.. హిమాలయన్ 452ను రూపొందించింది రాయల్ ఎన్ఫీల్డ్. రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని మరింత మెరుగుపరిచింది. అంతేకాకుండా.. సరికొత్త లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ని బైక్‌కు ఫిక్స్ చేసింది. ఇది.. 40 హెచ్‌పీ పవర్‌ని జనరేట్ చేస్తుంది. ఈ కొత్త హిమాలయన్ 452ని నవంబర్ 7న భారత మార్కెట్లో విడుదల చేయనుంది సంస్థ. ఇందులో సరికొత్త డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ను ఏర్పాటు చేశారు. ఇది ఆల్-డిజిటల్ యూనిట్. ఇందులో గూగుల్ మ్యాప్‌లను నేరుగా చూపే ట్రిప్పర్ నావిగేషన్ ఫెసిలిటీ ఉంది.
Royal Enfield Himalayan 452 : ఈ హిమాలయన్ 452 బైక్ కు ముందు, వెనుక డిస్క్ బ్రేక్ లను అమర్చారు. డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది. వెనుక చక్రంలో ABS ను మార్చుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
స్క్రామ్ 411పై అప్డేట్..
హిమాలయన్ 411ని డిస్కంటిన్యూ చేసినప్పటికీ.. స్క్రామ్ 411 మోడల్ని కొనసాగించాలని నిర్ణయించింది రాయల్ ఎన్ఫీల్డ్. ఇండియాలో దీనిని కొనుగోలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. హిమాలయన్ 411 ఆధారంగానే ఈ స్క్రామ్ 411ని రూపొందించింది సంస్థ. కాకపోతే.. కొన్ని ఫీచర్స్, డిజైన్ వంటివి మారుతాయి. అంతేకాకుండా త్వరలోనే ఈ మోడల్‌కు కొన్ని కొత్త కలర్ ఆప్షన్స్ కూడా వస్తాయని టాక్ నడుస్తోంది.
సంబంధిత కథనం