Royal Enfield buyback program: రాయల్ ఎన్ ఫీల్డ్ బై బ్యాక్ ప్లాన్; 77 శాతం డబ్బు వెనక్కు వచ్చేస్తుంది..-royal enfield introduces assured motorcycle buyback program partners with oto capital ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Royal Enfield Buyback Program: రాయల్ ఎన్ ఫీల్డ్ బై బ్యాక్ ప్లాన్; 77 శాతం డబ్బు వెనక్కు వచ్చేస్తుంది..

Royal Enfield buyback program: రాయల్ ఎన్ ఫీల్డ్ బై బ్యాక్ ప్లాన్; 77 శాతం డబ్బు వెనక్కు వచ్చేస్తుంది..

HT Telugu Desk HT Telugu
Oct 17, 2023 02:57 PM IST

Royal Enfield buyback program: రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ కొనే ప్లాన్ లో ఉన్నారా? మీ కోసం రాయల్ ఎన్ ఫీల్డ్ మరో కొత్త స్కీమ్ ను స్టార్ట్ చేసింది. వినియోగదారుడు కొంతకాలం వాడిన తరువాత అమ్మేయాలనుకుంటే కచ్చితమైన మొత్తంతో వెనక్కు తీసుకుంటామని (Royal Enfield buyback program) ప్రకటించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Royal Enfield buyback program: రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్స్ కు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. చాలామందికి ఎన్ ఫీల్డ్ బైక్ కొనుక్కోవడం ఒక టార్గెట్. రాయల్ ఎన్ ఫీల్డ్ కొనుగోలు చేయడం కోసం ఎదురు చూసేవారికి ఎన్ ఫీల్డ్ ఒక మంచి ఆఫర్ ను ప్రకటించింది.

yearly horoscope entry point

ఓటీఓ క్యాపిటల్ తో భాగస్వామ్యం..

సంస్థ కొత్తగా ఒక బై బ్యాక్ పథకాన్ని ప్రారంభించింది. ఈ కచ్చితమైన బై బ్యాక్ స్కీమ్ (Assured Buyback Program) ద్వారా వినియోగదారుడు కొన్న బైక్ ను కొంత కాలం తరువాత మళ్లీ రాయల్ ఎన్ ఫీల్డ్ (Royal Enfield buyback program) కొనుగోలు చేస్తుంది. ఈ స్కీమ్ ప్రకారం బైక్ ను వినియోగదారుడు వాడే కాల వ్యవధి ని బట్టి బై బ్యాక్ మొత్తం ఆధారపడి ఉంటుంది. గరిష్టంగా 77% వరకు ఈ బై బ్యాక్ ద్వారా వెనక్కు ఇస్తామని రాయల్ ఎన్ ఫీల్డ్ చెబుతోంది. రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ ఈ బై బ్యాక్ స్కీమ్ కోసం ఓటీఓ క్యాపిటల్ (OTO Capital) సంస్థ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కచ్చితమైన రీ సేల్ వ్యాల్యూ ప్రకారం రాయల్ ఎన్ ఫీల్డ్ లోని ఏ మోడల్ బైక్ నైనా కొనుగోలు చేసిన వినియోగదారుడు తాను కోరుకున్నంత కాలం ఆ బైక్ ను వినియోగించి, ఆ తరువాత వెనక్కు ఇచ్చేయవచ్చు.

వివిధ టెన్యూర్స్..

ఈ బై బ్యాక ప్రోగ్రామ్ లో వినియోగదారుడు 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు వివిధ కాల వ్యవధులకు సంబంధించిన ప్లాన్ ను ఎంపిక చేసుకోవచ్చు. కచ్చితమైన బై బ్యాక్ తో పాటు తక్కువ ఈఎంఐ సదుపాయం కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారా లభిస్తుంది. నెలవారీ వాయిదాల మొత్తంలో 45% వరకు తగ్గుతుంది. అంతేకాదు, మీరు ఎంపిక చేసుకున్న టెన్యూర్ ముగిసిన తరువాత కస్టమర్ కు ప్రత్యేకంగా క్యాష్ బ్యాక్ ను కూడా రాయల్ ఎన్ ఫీల్డ్ అందిస్తోంది. తాము ఎంపిక చేసుకున్న ప్లాన్ ప్రకారం టెన్యూర్ ముగిసిన తరువాత, కస్టమర్ తన బైక్ ను వెనక్కు ఇచ్చేయవచ్చు. లేదా, వేరే రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ మోడల్ తో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. కస్టమర్ సంతృప్తి తమ ప్రధాన ఉద్దేశమని ఈ సందర్భంగా రాయల్ ఎన్ ఫీల్డ్ ప్రతినిధులు తెలిపారు. ఈ స్కీమ్ ప్రస్తుతానికి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ సహా మొత్తం 12 నగరాల్లో అందుబాటులో ఉందని వెల్లడించారు. త్వరలో మరికొన్ని నగరాలకు విస్తరిస్తామన్నారు.

Whats_app_banner