Royal Enfield Himalayan 452 : రూమర్స్‌కి బ్రేక్‌లు వేస్తూ.. సరికొత్త, మచ్ అవైటెడ్ బైక్‌ను ఆవిష్కరించింది ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్. దీని పేరు హిమాలయన్ 452! ఈ అడ్వెంచర్ మోటార్‌సైకిల్.. 2016లో లాంచ్ అయిన హిమాలయన్ 411ని పోలి ఉంది. కాగా.. ఈ కొత్త మోడల్.. ఈ ఏడాది నవంబర్‌లో లాంచ్ అవుతుందని తెలుస్తోంది.
హిమాలయన్ 411తో పోల్చుకుంటే ఈ సరికొత్త రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 452లో చాలానే మార్పులు జరిగాయి! ఇందులో స్లీకర్ స్టైల్లో ఫ్లూయెల్ ట్యాంక్, రీడిజైన్డ్ ఫెండర్స్, స్ప్లిట్ సీట్ సెటప్ వంటివి వస్తున్నాయి. ఫ్రెంట్ మడ్‌గార్డ్‌లో హిమాలయన్ బ్రాండింగ్ వస్తోంది. ఫ్యుయెల్ ట్యాంక్, సైడ్ ప్యానెల్, రేర్ ఫెండర్స్కు హిమాలయన్ గ్రాఫిక్స్ వస్తున్నాయి. ఈ బైక్‌లో క్రోమ్ ప్యానెల్‌తో కూడిన సింగిల్ ఎగ్సాస్ట్ ఉంటుంది.
Royal Enfield Himalayan 452 price : త్వరలో లాంచ్‌కానున్న హిమాలయన్ 452లో యూఎస్డీ ఫ్రెంట్ ఫోర్క్స్ విత్ ఫోర్క్ కవర్ వస్తోంది. 21 ఇంచ్ మల్టీ స్పోక్ వీల్స్, ఆఫ్ రోడ్ టైర్స్ దీని సొంతం.
ఇక ఈ రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త బైక్‌లో 451.65 సీసీ, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 40 బీహెచ్పీ పవర్‌ను, 45 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ బైక్ బరువు 210 కేజీలు ఉండొచ్చని సమాచారం. ఎనలాగ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విత్ టీఎఫ్టీ డిస్ప్లే వస్తుందని, ఇందులో టర్న్ బై టర్న్ నేవిగేషన్ సెటప్ కూడా ఉంటుందని తెలుస్తోంది.
Royal Enfield Himalayan 452 price in India : ఈ హిమాలయన్ 452 అడ్వెంచర్ బైక్‌కి సంబంధించి.. వీటికి మించి, ఇతర వివరాలను వెల్లడించలేదు రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ. కాగా.. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 2.80లక్షలుగా ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
లాంచ్ తర్వాత.. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయ్ 452.. కేటీఎం 390 అడ్వెంచర్, బీఎండబ్ల్యూ జీ310 జీఎస్, యెజ్డి అడ్వెంచర్‌తో పాటు త్వరలో లాంచ్‌కు సిద్ధమవుతున్న హీరో ఎక్స్‌పల్స్ 400కి గట్టిపోటీనిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి.
Royal Enfield Streetwind V3 jacket : మన దేశంలో బైక్ లవర్స్ చాలా మందే ఉన్నారు! మరీ ముఖ్యంగా నచ్చిన బైక్‌లో లాంగ్ డ్రైవ్‌కి వెళ్లి ఆ ఫీల్‌ని ఎంజాయ్ చేయాలని చాలా మంది కలలుకంటారు. ఇలాంటి వారికి ఫస్ట్ చాయిస్.. రాయల్ ఎన్ఫీల్డ్! ఈ ఆటోమొబైల్ సంస్థకు చెందిన రెట్రో బైక్స్‌కు మంచి డిమాండ్ ఉంటుంది. అయితే.. లాంగ్ డ్రైవ్స్‌కు కేవలం బైక్ ఉంటే సరిపోదు. జర్నీకి తగ్గట్టు రైడింగ్ జాకెట్ కూడా ఉంటేనే మంచి లుక్, ఆ వైబ్స్ వస్తాయి! అందుకే.. రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ రైడింగ్ జాకెట్స్‌ని కూడా లాంచ్ చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా.. సరికొత్త జాకెట్‌ను ఇటీవలే తీసుకొచ్చింది. దీని పేరు స్ట్రీట్విండ్ వీ3. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం