Streetwind V3 : లాంగ్​​ డ్రైవ్​కి వెళుతున్నారా? రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త రైడింగ్​ జాకెట్ మీకోసమే​!-royal enfield launches streetwind v3 riding jacket check out whats new ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Streetwind V3 : లాంగ్​​ డ్రైవ్​కి వెళుతున్నారా? రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త రైడింగ్​ జాకెట్ మీకోసమే​!

Streetwind V3 : లాంగ్​​ డ్రైవ్​కి వెళుతున్నారా? రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త రైడింగ్​ జాకెట్ మీకోసమే​!

Sharath Chitturi HT Telugu
Oct 01, 2023 02:30 PM IST

Royal Enfield Streetwind V3 jacket : లాంగ్​ డ్రైవ్​కి ప్లాన్​ చేస్తున్నారా? బైక్​తో పాటు ఔట్​ఫిట్​ కూడా ముఖ్యమే కదా! మీకోసమే కొత్త రైడింగ్​ జాకెట్​ను లాంచ్​ చేసింది రాయల్​ ఎన్​ఫీల్డ్​. ఆ వివరాలు..

లాంగ్​​ డ్రైవ్​కి వెళుతున్నారా? రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త రైడింగ్​ జాకెట్​ మీకోసమే!
లాంగ్​​ డ్రైవ్​కి వెళుతున్నారా? రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త రైడింగ్​ జాకెట్​ మీకోసమే!

Royal Enfield Streetwind V3 jacket : మన దేశంలో బైక్​ లవర్స్​ చాలా మందే ఉన్నారు! మరీ ముఖ్యంగా నచ్చిన బైక్​లో లాంగ్​ డ్రైవ్​కి వెళ్లి ఆ ఫీల్​ని ఎంజాయ్​ చేయాలని చాలా మంది కలలుకంటారు. ఇలాంటి వారికి ఫస్ట్​ చాయిస్​.. రాయల్​ ఎన్​ఫీల్డ్​! ఈ ఆటోమొబైల్​ సంస్థకు చెందిన రెట్రో బైక్స్​కు మంచి డిమాండ్​ ఉంటుంది. అయితే.. లాంగ్​ డ్రైవ్స్​కు కేవలం బైక్​ ఉంటే సరిపోదు. జర్నీకి తగ్గట్టు రైడింగ్​ జాకెట్​ కూడా ఉంటేనే మంచి లుక్​, ఆ వైబ్స్​ వస్తాయి! అందుకే.. రాయల్​ ఎన్​ఫీల్డ్​ సంస్థ రైడింగ్​ జాకెట్స్​ని కూడా లాంచ్​ చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా.. సరికొత్త జాకెట్​ను తీసుకొచ్చింది. దీని పేరు స్ట్రీట్​విండ్​ వీ3. ఈ జాకెట్​ విశేషాలివే..

రాయల్​ ఎన్​ఫీల్డ్​ స్ట్రీట్​విండ్​ వీ3..

రాయల్​ ఎన్​ఫీల్డ్​ జాకెట్​లో మెషన్​ డిజైన్​ ఉంటుంది. బరువుతో పాటు ధర కూడా తక్కువే. ఇందులో ఎర్గో ప్రో టెక్​ ఆర్మర్​ ఉంటుంది. ఇదొక లెవల్​ 2 ఆర్మర్​. భుజాలు, ఎముకలకు ఈ ఆర్మర్​ వస్తుంది. బ్యాక్​ ప్రొటెక్టర్​కు స్పేస్​ కూడా ఉంటుంది. నైట్​ రైడ్​లో విజిబులిటీని పెంచే విధంగా రిఫ్లెక్టివ్​ ఎలిమెంట్స్​ కూడా ఉన్నాయి.

ఈ రైడింగ్​ జాకెట్​ను కార్డురా ఫాబ్రిక్​తో తయారు చేశారు. ఇందులో 90శాతం హై అబ్రెసివ్​- రెసిస్టెంట్​ పాలిస్టర్​, 10శాతం 600డీ పాలిస్టర్​లు ఉంటాయి. దీని బరువు 1.17కేజీలు మాత్రమే. చిన్న ల్యాప్​టాప్​ బ్యాగ్​లో దీనిని పెట్టుకోవచ్చు. ఎక్కువ స్పేస్​ కూడా తీసుకోదు! కఫ్స్​, వెయిస్ట్​, బైసెప్స్​, ఫోర్​ఆర్మ్స్​ వద్ద అడ్జెస్టెబుల్​ ట్యాబ్​లు కూడా వస్తున్నాయి. సన్​గ్లాస్​ లూప్​, వెల్​క్రో ప్యాచ్​, ప్రీ-కర్వ్​డ్​ ఆర్మ్స్​, మెడకు స్నాప్​ ఫాస్టెనర్స్​ కూడా వస్తుండటంతో.. పర్ఫెక్ట్​ రైడింగ్​ లుక్​ పొందవచ్చు.

ఇదీ చూడండి:- Retro bikes in India : బైక్​ నడిపితే ‘రెట్రో’ ఫీల్​ రావాలా? ఇవి బెస్ట్​..!

ఈ రాయల్​ ఎన్​ఫీల్డ్​ స్ట్రీట్​విండ్​ వీ3 రైడింగ్​ జాకెట్​ ధర రూ. 5,950. సంస్థకు చెందిన డీలర్​షిప్స్​ లేదా అధికారిక వెబ్​సైట్​లో దీనిని కొనుగోలు చేసుకోవచ్చు.

కొత్త బైక్​ వచ్చేస్తోంది..!

దేశీయ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ రాయల్​ ఎన్​ఫీల్డ్​.. షార్ట్​గన్​ 650 అనే పేరుతో ఓ కొత్త బైక్​ను సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ మోడల్​కు సంబంధించిన కొన్ని వివరాలు ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి.

ఈ రాయల్​ ఎన్​ఫీల్డ్​ షార్ట్​గన్​ 650.. సూపర్​ మీటియర్​ 650 కన్నా వెడల్పు తక్కువ, ఎత్తు ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఈ బైక్​ పొడవు 2,170ఎంఎం. వెడల్పు 820ఎంఎం. ఎత్తు 1,105ఎంఎంగా ఉంటుందని తెలుస్తోంది. వీల్​బేస్​ వచ్చేసి 1,465గా ఉంటుందని సమచారం. ఈ బైక మొత్తం బరువు 428కేజీలని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం