Ola Electric bike : ఓలా ఎలక్ట్రిక్​ బైక్స్​ ఇవే..​ డిజైన్​ అదిరిందిగా!-ola electric showcases its electric motorcycles at motogp bharat ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ola Electric Bike : ఓలా ఎలక్ట్రిక్​ బైక్స్​ ఇవే..​ డిజైన్​ అదిరిందిగా!

Ola Electric bike : ఓలా ఎలక్ట్రిక్​ బైక్స్​ ఇవే..​ డిజైన్​ అదిరిందిగా!

Sharath Chitturi HT Telugu
Sep 23, 2023 06:40 AM IST

Ola Electric bikes : 2023 మోటోజీపీ భారత్​ ఈవెంట్​లో.. నాలుగు కొత్త ఎలక్ట్రిక్​ బైక్స్​ను ప్రదర్శించింది ఓలా ఎలక్ట్రిక్​ సంస్థ. ఆ వివరాలు..

ఓలా ఎలక్ట్రిక్​ బైక్​..
ఓలా ఎలక్ట్రిక్​ బైక్​..

Ola electric bikes : ఓలా ఎలక్ట్రిక్​ నుంచి నాలుగు కొత్త ఈ-బైక్స్​ వస్తున్న విషయం తెలిసిందే. గత నెలలో జరిగిన ఓ ఈవెంట్​లో వీటిని ప్రపంచానికి పరిచయం చేసింది.. ఈ 2 వీలర్​ ఈవీ తయారీ సంస్థ. ఇక ఇప్పుడు.. తాజాగా జరుగుతున్న మోటోజీపీ భారత్​ 2023లో వీటిని ప్రదర్శనకు ఉంచింది. ఈ కొత్త బైక్స్​ డిజైన్​.. అందరిని అకట్టుకుంటోంది.

ఓలా ఎలక్ట్రిక్​ తీసుకొస్తున్న నాలుగు వాహనాల పేర్లు.. డైమెండ్​హెడ్​, అడ్వెంచర్​, క్రూజర్​, రోడ్​స్టర్​. డైమెండ్​హెడ్​ డిజైన్​ మరింత ప్రత్యేకంగా ఉంటుంది. దీనిని స్పోర్ట్స్​ బైక్​గా రూపొందించింది సంస్థ. క్లిప్​ ఆన్​ హ్యాండిల్​బార్స్​, రేర్​ సీట్​ ఫుట్​పెగ్స్​ ఉంటాయి. ఫ్రెంట్​ లుక్​ చాలా అగ్రెసివ్​గా ఉంటుంది. ఇక రోడ్​స్టర్​ బాడీ ప్యానెల్స్​ షార్ప్​గా ఉన్నాయి. స్లీక్​ ఎల్​ఈడీ డేటైమ్​ రన్నింగ్​ ల్యాంప్​, స్ప్లిట్​ సీట్స్​ వంటివి వస్తున్నాయి.

Ola electric bike launch : ఇక ఓలా నుంచి వస్తున్న మరో ఎలక్ట్రిక్​ బైక్​ పేరు అడ్వెంచర్​. ఇదొక ఆఫ్​-రోడ్​ అడ్వెంచర్​ టూరర్​. రైడింగ్​ పొజీషన్​ చాలా సౌకర్యంగా ఉంది. యూఎస్​డీ ఫోర్క్స్​, రేర్​లో మోనోషాక్​ అబ్సార్బర్స్​, స్పోక్​డ్​ వీల్స్​, చెయిన్​ డ్రైవ్​, నకల్​ గార్డ్స్​, టీఎఫ్​టీ స్క్రీన్​, టాల్​ విండ్​స్క్రిన్​ వంటివి లభిస్తున్నాయి.

ఇదీ చూడండి:- New electric bike : మార్కెట్​లోకి కొత్త ఎలక్ట్రిక్​ బైక్​.. 180కి.మీ రేంజ్​తో!

ఇక ఓలా క్రూజర్​ విషయానికొస్తే.. ఇందులో వైడ్​ ఎల్​ఈడీ డేటైమ్​ రన్నింగ్​ ల్యాంప్​, ఫ్రెంట్​ సీట్​ ఫుట్​పెగ్స్​, వైడ్​ హ్యాండిల్​బార్​, టీఎఫ్​టీ స్క్రీన్​, 17 ఇంచ్​ వీల్స్​, యూఎస్​డీ ఫోర్క్స్​, రేర్​లో మోనోషాక్​ అబ్సార్బర్​ యూనిట్​ వస్తోంది.

Ola electric bike price Hyderabad : ఈ ఓలా ఎలక్ట్రిక్​ బైక్స్​.. ప్రస్తుతం ప్రోటోటైప్​ దశలోనే ఉన్నాయి. వీటి ప్రొడక్షన్​ 2024లో మొదలవుతుందని సమాచారం. 2024 చివరి నాటికి వీటిని లాంచ్​ చేసి, డెలివరీలను మొదలుపెట్టాలని సంస్థ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ బైక్స్​కు సంబంధించిన ఇతర ఫీచర్స్​, రేంజ్​, బ్యాటరీ వంటి వివరాలపై ప్రస్తుతం సమాచారం లేదు. సంస్థ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఓలా మ్యాప్స్​..

ఓలా ఎలక్ట్రిక్​ బైక్స్​తో పాటు మూవ్​ఓఎస్​ 4పైనా సంస్థ పనిచేస్తోంది. వచ్చే నెలలో ఇది అందుబాటులోకి రానుందని సమాచారం. ప్రస్తుతం బీటా వర్షెన్​ను సంస్థ టెస్ట్​ చేస్తోంది. ఇది లాంచ్​ అయితే.. ఓలాకు సొంతంగా మ్యాప్స్​ ఫీచర్​ ఉంటుంది. దీని పేరు ఓలా మ్యాప్స్​. దీనితో పాటు రీజనరేషన్​, హిల్​ హోల్డ్​, ఛార్జింగ్​ టైమ్​ ప్రెడిక్షన్​, ఛార్జింగ్​, రైడింగ్​ రేంజ్​ని కూడా మెరుగుపరిచినట్టు ఓలా ఎలక్ట్రిక్​ చెబుతోంది.

సంబంధిత కథనం