Ola S1 Air: ఎస్ 1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీ ప్రారంభించిన ఓలా
Ola S1 Air: భారత్ తో అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా తమ సరికొత్త ఎస్ 1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలను ప్రారంభించింది. ఇప్పటివరకు 50 వేలకు పైగా ఎస్ 1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు బుక్ అయ్యాయని, దేశవ్యాప్తంగా 100 పైగా నగరాల్లో వాటి డెలివరీలను ప్రారంభించామని ఓలా ఎలక్ట్రిక్ వెల్లడించింది.
Ola S1 Air: భారత్ తో అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా గురువారం నుంచి తమ సరికొత్త ఎస్ 1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలను ప్రారంభించింది. ఇప్పటివరకు 50 వేలకు పైగా ఎస్ 1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు బుక్ అయ్యాయని, దేశవ్యాప్తంగా 100 పైగా నగరాల్లో వాటి డెలివరీలను ప్రారంభించామని ఓలా ఎలక్ట్రిక్ వెల్లడించింది. ఇతర మార్కెట్‌లలో త్వరలో మొదలవనున్నాయని తెలిపింది.
గత నెలలో లాంచ్
ఓలా ఎలక్ట్రిక్ సంస్థ ఎస్ 1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఇండియా మార్కెట్లో గత నెలలో లాంచ్ చేసింది. అందుబాటు ధరకే మార్కెట్లో లభ్యమవుతుండడంతో S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. కొద్ది రోజుల వ్యవధిలోనే ఈ విద్యుత్ స్కూటర్లు 50 వేలకు పైగా బుక్ అయ్యాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల నిర్వహణ ఖర్చు చాలా తక్కువ. ఎస్ 1 ఎయిర్, ఎస్ 1 ఎయిర్ ప్రొ ఈవీలు అత్యాధునిక సాంకేతికతను, డైనమిక్ డిజైన్ ను కలిగి ఉన్నాయి.
బ్యాటరీ పవర్..
ఎస్ 1 ఎయిర్ లో 3 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. 151 కిమీల గరిష్ట రేంజ్ తో ఓలా ఎస్ 1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లోకి వచ్చాయి. ఇవి గరిష్టంగా గంటకు 90 కిమీల వేగంతో వెళ్లగలవు. అంతేకాకుండా, S1 Air ఆరు అద్భుతమైన రంగులలో లభిస్తుంది. అవి స్టెల్లార్ బ్లూ, నియాన్, పింగాణీ వైట్, కోరల్ గ్లామ్, లిక్విడ్ సిల్వర్ మరియు మిడ్‌నైట్ బ్లూ రంగులు. ఇతర ఫీచర్ల విషయానికి వస్తే.. ట్విన్ ఫ్రంట్ ఫోర్క్, ఫ్లాట్ ఫుట్‌బోర్డ్, భారీ 34-లీటర్ బూట్ స్పేస్, డ్యూయల్-టోన్ బాడీ ఉన్నాయి. ఈ ఈవీలపై ఆసక్తి ఉన్న కస్టమర్లు ఓలా యాప్ ద్వారా, లేదా ఓలా ఎక్స్పీరియన్స్ కేంద్రాల ద్వారా సమాచారం పొందవచ్చు.