Ola Electric: లక్ష రూపాయల లోపు ధరకే లభించే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..
Ola Electric: ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్లో భారత్లో అగ్రగామిగా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ కొత్తగా రెండు మోడల్స్ ని లాంచ్ చేసింది. అవి ఒకటి ఎస్1ఎక్స్, రెండోది ఎస్1ఎక్స్ +. ఈ రెండింటి ధరలు కూడా లక్ష రూపాయలు లోపే ఉండడం విశేషం.
Ola Electric: ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్లో భారత్లో అగ్రగామిగా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ కొత్తగా రెండు మోడల్స్ ని లాంచ్ చేసింది. అవి ఒకటి ఎస్1ఎక్స్, రెండోది ఎస్1ఎక్స్ +. ఈ రెండింటి ధరలు కూడా లక్ష రూపాయలు లోపే ఉండడం విశేషం. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లలో.. ఎస్1ఎక్స్ స్కూటర్ డెలివరీ డిసెంబర్లో, ఎస్1ఎక్స్ + డెలివరీ సెప్టెంబర్ చివర్లో ప్రారంభమవుతుంది.
లక్ష లోపే ధర
ఓలా ఎలక్ట్రిక్ నుంచి వచ్చిన అత్యంత చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్లు ఈ ఎస్1ఎక్స్ , అలాగే ఎస్1ఎక్స్ +. ఇవి రెండు కూడా ఓలా ఎస్ 1 ఎయిర్ ధర కన్నా తక్కువే ఉంటాయి. ఓలా ఎస్1ఎక్స్ ధర రూ. 79,999. ఇందులో 2 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఎస్1ఎక్స్ + ధరను 99,999 గా నిర్ణయించారు. ఇవి రెండు కూడా ఎక్స్ షోరూం ధరలు అలాగే ఇంట్రడక్టరీ ధరలు.
బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు..
ఎస్1ఎక్స్ లో రెండు బ్యాటరీ బ్యాక్ ఆప్షన్స్ ఉంటాయి. 3 కిలో వాట్ బ్యాటరీ బ్యాక్ ఉన్న ఎస్1ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 89,999 ఈ ధర ఆగస్టు 21 వరకే ఉంటుంది. ఆ తరువాత ఈ ధర రూ. 99,999 కి పెరుగుతుంది. 2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉన్న ఎస్1ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 79,999. ఈ ధర కూడా ఆగస్టు 21 వరకే ఉంటుంది. ఆ తరువాత ఇది రూ. 89,999 కి పెరుగుతుంది. ఎస్1ఎక్స్ + ఎలక్ట్రిక్ స్కూటర్ త్రీ కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. దీని ధర రూ. 99,999. ఈ ధర కూడా ఆగస్టు 21 వరకే ఉంటుంది ఆ తరువాత దీని ధర రూ. 1,09,999 కి పెరుగుతుంది.
150 కిమీల బైక్ రేంజ్
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లలో 3 కిలోవాట్ బైక్ రేంజ్ 151 కిలోమీటర్లు. ఎస్1ఎక్స్ + గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు మల్టీ టోన్ డిజైన్ లో వస్తున్నాయి. అంటే స్కూటర్ కింది అర్ధ భాగం నలుపు రంగులోనూ, పై అర్థభాగం వేరే రంగులోనూ ఉంటుంది. ఈ స్కూటర్స్ లో అలాయ్ వీల్స్ కు బదులుగా స్టీల్ రిమ్స్ ను వాడారు. ముందు, వెనుక కూడా డ్రమ్ బ్రేక్స్ ను అమర్చారు.
Scooter | Introductory price (ex-showroom) | New price (ex-showroom) |
Ola S1X+ | ₹99,999 | ₹1,09,999 |
Ola S1X 3 kWh | ₹89,999 | ₹99,999 |
Ola S1X 2 kWh | ₹79,999 | ₹89,999 |
సంబంధిత కథనం