Ather 450S vs Ola S1 Air : ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్ట్?
Ather 450S vs Ola S1 Air : కొత్తగా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని చూస్తున్నారా? ఏథర్ 450ఎస్, ఓలా ఎస్1 ఎయిర్ మోడల్స్ అఫార్డిబుల్ ధరలో వస్తున్నాయి. మరి ఈ రెండిట్లో బేస్ట్ ఏది? ఇక్కడ తెలుసుకుందాము..
Ather 450S vs Ola S1 Air : ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లోకి మూడు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను ఇటీవలే లాంచ్ చేసింది ఏథర్ ఎనర్జీ సంస్థ. వీటిల్లో చౌకైన 450ఎస్ మోడల్‌పై కస్టమర్ల ఫోకస్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ మోడల్‌ను.. ఓలా ఎస్1 ఎయిర్‌తో పోల్చి, ఈ రెండిట్లో ఏది బెస్ట్? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
ఈ రెండు ఈ-స్కూటర్ల ఫీచర్స్ ఇవే..
ఏథర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లో ఏప్రాన్ మౌంటెడ్ ఎల్ఈడీ హెడ్‌లైట్‌తో కూడిన యాంగ్యులర్ బాడీ ఉంటుంది. ఫ్లష్ ఫిట్టెడ్ సైడ్ స్టాండ్, స్లీక్ ఎల్ఈడీ టెయిల్ల్యాంప్, 12 ఇంచ్ అలాయ్ వీల్స్, 7.0 ఇంచ్ "డీప్-వ్యూ" ఎల్సీడీ డిస్ప్లే లభిస్తోంది.
ఇక ఓలా ఎస్1 ఎయిర్‌లో డ్యూయెల్ పాడ్ ఎల్ఈడీ హెడ్‌లైట్, ఫ్లాట్ ఫుట్‌బోర్డ్, స్లిమ్ ఎల్ఈడీ టెయిల్ల్యాంప్, 12 ఇంచ్ స్టీల్ వీల్స్, 7.0 ఇంచ్ టీఎఫ్టీ టచ్‌స్క్రీన్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తున్నాయి.
Ather 450S on road price Hyderabad : ఇక సేఫ్టీ విషయానికొస్తే ఏథర్ 450ఎస్ ఫ్రెంట్- రేర్ వీల్స్‌కు డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి. ఫ్రెంట్లో టెలిస్కోపిక్ ఫోర్క్స్, రేర్‌లో మోనో షాక్ అబ్సార్బర్స్ ఉంటాయి. అదే సమయంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లోని రెండు్ వీల్స్‌కు డ్రమ్ బ్రేక్స్ లభిస్తున్నాయి. ఫ్రెంట్లో టెలిస్కోపిక్ ఫోర్క్స్, రేర్‌లో డ్యూయెల్ షాక్ అబ్సార్బర్స్ వస్తున్నాయి.
ఇదీ చూడండి:- New electric scooters : మార్కెట్లోకి నాలుగు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. హైలైట్స్ ఇవే!
అంతేకాకుండా రైడ్, హ్యాండ్లింగ్ క్వాలిటీని పెంచేందుకు ఈ రెండు ఈవీల్లో కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టెమ్ (సీబీఎస్) వస్తోంది.
ఈ రెండిట్లో ఉన్న బ్యాటరీ సెటప్స్ ఏంటి?
ఏథర్ స్కూటర్లో 5.4 వాట్ మిడ్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటర్ ఉంటుంది. దీనిని 2.9కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో కనెక్ట్ చేసింది సంస్థ. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 115కి.మీల దూరం ప్రయాణిస్తుందని సంస్థ చెబుతోంది.
Ola S1 Air on road price Hyderabad : ఇక ఓలా ఎస్1 ఎయిర్‌లోని 4.5 కేడబ్ల్యూ హబ్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌కు 3కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. దీని రేంజ్ 125కి.మీలు!
ఈ రెండు స్కూటర్ల ధరలెంత?
Ola new scooter : ఏథర్ 450ఎస్ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 1.3లక్షలుగా ఉంది. అదే సమయంలో ఓలా స్కూటర్ ఎక్స్‌షోరూం ధర రూ. 1.19లక్షలుగా ఉంది.
సంబంధిత కథనం