New electric scooters : మార్కెట్లోకి నాలుగు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. హైలైట్స్ ఇవే!
New electric scooters : ఇనక్ మోటార్స్ అనే సంస్థ.. కొత్తగా నాలుగు ఈ-స్కూటర్లను మార్కెట్లో లాంచ్ చేసింది. ఇవి స్లో స్పీడ్ ఈవీలు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
New electric scooters : ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌కు ఉన్న డిమాండ్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ డిమాండ్‌ను క్యాప్చర్ చేసుకునేందుకు అనేక సంస్థలు పోటీపడుతున్నాయి. ఇక ఇప్పుడు.. ఓ కొత్త ఈవీ సంస్థ కూడా ఈ పోటీలోకి అడుగుపెట్టింది. దాని పేరు "ఇనక్ మోటార్స్". వస్తూనే.. ఒకేసారి 4 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింది! వాటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఇనక్ మోటార్స్ ఈ-స్కూటర్ల వివరాలు..
ఇనక్ నుంచి నాలుగు స్లో స్పీడ్ ఈ-స్కూటర్లు వచ్చాయి. అవి.. ప్రో, మాగ్నా, స్మార్ట్, వెర్వ్. వీటి ఎక్స్‌షోరూం ధరలు రూ. 89,000- రూ. 99,000 మధ్యలో ఉన్నాయి. ప్రస్తుతం ఇవి హైదరాబాద్ పరిధిలో అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే దేశవ్యాప్తంగా డీలర్ నెట్‌వర్క్స్‌లో వీటిని కొనుగోలు చేసుకోవచ్చు.
Enook electric scooter : ఈ ఇనక్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో 250 వాట్ బీఎల్డీసీ మోటార్ ఉంటుంది. 60వీ- 28ఏహెచ్ ఎల్ఎఫ్పీ బ్యాటరీ ప్యాక్ వీటి సొంతం. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. ఈ ఈవీలు 90కి.మీ రేంజ్‌ను ఇస్తాయి. పూర్తి ఛార్జింగ్‌కు 3-4 గంటల సమయం పడుతుంది. అయితే ఇవి స్లో స్పీడ్ ఈ-స్కూటర్లు. వీటి టాప్ స్పీడ్ 90 కేఎంపీహెచ్ మాత్రమే.
ఇదీ చూడండి:- Ola S1X : ఓలా నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ‘ఎస్1ఎక్స్’ వచ్చేస్తోంది..!
"ఇన్నోవేటివ్, సస్టైనబుల్, అఫార్డిబుల్ మొబిలిటీని నగరవాసులకు అందించడమే మా లక్ష్యం. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో తొలి ఇనక్ షోరూమ్‌ను లాంచ్ చేశాము. నాలుగు ఈవీలను తీసుకొచ్చాము," అని సంస్థ ఎండీ హితేశ్ పటేల్ తెలిపారు.
Enook electric scooters range : ఈ ఈ-స్కూటర్లకు 150 కేజీల వరకు పేలోడ్ కెపాసిటీ వస్తోంది. 10 ఇంచ్ ట్యూబ్‌లెస్ టైర్స్, అలాయ్ వీల్స్, ఎల్సీడీ డిస్ప్లే, టెలిస్కోపిక్ ఫ్రెంట్ ఫోర్క్స్, ఈ-ఏబీఎస్ వంటి ఫీచర్స్ ఈ ఇనక్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఉంటాయి. ఈ 2 వీలర్ల గ్రౌండ్ క్లియరెన్స్ 160ఎంఎం. అండర్ సీట్ స్టోరేజ్ 19 లీటర్లు. జీపీఎస్ ట్రాకింగ్, యాప్ బేస్ట్ కెనెక్టివిటీ, రియల్ టైమ్ రైడ్ ఇన్ఫర్మేషన్ వంటివి కూడా ఉన్నాయి. అన్ని ఇనక్ వాహనాలకు ఫుల్ ఎల్ఈడీ లైటింగ్ లభిస్తోంది.
ఏథర్ నుంచి మూడు స్కూటర్లు..!
ఈ మధ్య కాలంలో సంస్థలన్నీ పోటీపడి మరీ ఈ-స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి. ప్రముఖ ఈవీ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ సైతం.. ఒకేసారి మూడు స్కూటర్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. వాటి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం