Bajaj Auto electric scooters : బజాజ్​ ఆటో నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్లు..!-bajaj auto trademarks swinger and genie names new evs incoming ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bajaj Auto Electric Scooters : బజాజ్​ ఆటో నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్లు..!

Bajaj Auto electric scooters : బజాజ్​ ఆటో నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్లు..!

Sharath Chitturi HT Telugu
Jun 23, 2023 07:52 AM IST

Bajaj Auto new electric scooters : బజాజ్​ ఆటో నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్లు వస్తున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు..

బజాజ్​ ఆటో నుంచి కొత్తగా రెండు ఎలక్ట్రిక్​ స్కూటర్లు..!
బజాజ్​ ఆటో నుంచి కొత్తగా రెండు ఎలక్ట్రిక్​ స్కూటర్లు..!

Bajaj Auto new electric scooters : ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో ఎలక్ట్రిక్​ స్కూటర్లకు సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో జోరుగా వినిపిస్తున్నాయి. ప్రముఖ ఆటోమొబైల్​ సంస్థల నుంచి ఎలక్ట్రిక స్కూటర్లు రాబోతున్నట్టు కథనాలు వస్తున్నాయి. ఈ జాబితాలోకి మరో దిగ్గజ సంస్థ బజాజ్​ ఆటో కూడా చేరింది. 'స్వింగర్​', 'జీనీ' వంటి రెండు పేర్లను బజాజ్​ ఆటో ఇటీవలే రిజిస్టర్​ చేసుకుంది. ఫలితంగా.. ఇవి రాబోయే రెండు ఎలక్ట్రిక్​ స్కూటర్ల పేర్లని వార్తలు వస్తున్నాయి.

ఇవి.. ఎలక్ట్రిక్​ స్కూటర్ల పేర్లేనా..?

ఇండియా పేటెంట్స్​ డిజైన్​ అండ్​ ట్రైడ్​మార్క్స్​ వెబ్​సైట్​లో స్వింగర్​, జీనీ పేర్లు మే నెలలో దర్శనమిచ్చాయి. వీటిని బజాజ్​ ఆటో ట్రైడ్​మార్క్​ చేసుకున్నట్టు తేలింది. వీటికి సంబంధించిన ఇతర వివరాలేవీ అందుబాటులో లేవు. కానీ ఇవి ఎలక్ట్రిక్​ స్కూటర్లని మార్కెట్​లో అంచనాలు మొదలయ్యాయి.

బజాజ్​ ఆటోకు ప్రస్తుతం చేతక్​ ఈవీ ఉంది. ఇక స్వింగర్​, జీనీ కూడా చేతక్​ సరసన చేరే అవకాశం ఉంది. అయితే.. ఒక పేరు ట్రేడ్​మార్క్​ చేసుకున్నంత మాత్రాన.. దానిని భవిష్యత్తులో కచ్చితంగా ఉపయోగించుకోవాలన్న రూల్​ ఏమీ లేదు! గతంలోనూ.. ఆరా, హామర్​, రేసర్​ వంటి పేర్లను బజాజ్​ ఆటో ట్రేడ్​మార్క్​ చేసుకుంది. కానీ వాటిని 2 వీలర్​, 3 వీలర్లకు ఉపయోగించుకోలేదు. మరి జీనీ, స్వింగర్​లను వాడుకుంటుందో లేదో చూడాలి.

ఇదీ చూడండి:- KTM electric scooter : కేటీఎం నుంచి తొలి ఎలక్ట్రిక్​ స్కూటర్​.. లాంచ్​ ఎప్పుడు?

అయితే.. ఎలక్ట్రిక్​ స్కూటర్లతో మార్కెట్​లో బజాజ్​ ఆటో దండయాత్ర చేసేందుకు ప్లాన్​ చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ట్రేడ్​మార్క్​ పేర్లు ఆసక్తి కలిగిస్తున్నాయి.

ఇక చేతక్​ విషయానికొస్తే.. ఈ ఈవీని సప్లై చెయిన్​ వ్యవస్థలో లోపాలు చాలా ఇబ్బంది పెట్టాయి. తాజాగా ఇవి తొలగిపోయినట్టు తెలుస్తోంది. ఫలితంగా చేతక్​ ఈవీ వాల్యూమ్​లు పెరుగుతాయని భావిస్తున్నారు. చేతక్​ బ్రాండ్​లోనే అని కొన్ని ప్రాడక్టులను కూడా సంస్థ తీసుకొస్తుందని తెలుస్తోంది. కానీ ఇవి లాంచ్​ అయ్యేందుకు ఇంకాస్త సమయం పడుతుందని సమాచారం.

హోండా ఎలక్ట్రిక్​ స్కూటర్లు..

ఇండియా 2 వీలర్​ సెగ్మెంట్​లో మార్కెట్​ షేరును పెంచుకునేందుకు విపరీతంగా కృషిచేస్తోంది హోండా సంస్థ. సీబీఆర్​250ఆర్​ఆర్​, సీఎల్​300లకు ఇటీవలే పేటెంట్​ పొందిన ఈ ఆటోమొబైల్​ కంపెనీ.. ఇప్పుడు ఎలక్ట్రిక్​ స్కూటర్లపై ఫోకస్​ పెంచింది. ఈ క్రమంలోనే కొత్తగా రెండు స్కూటర్లకు పేటెంట్​లు ఫైల్​ చేసింది.

హోండా తాజాగా పేటెంట్​ పొందిన ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్ల పేర్లు డాక్స్​ ఈ, జూమర్​ ఈ అని తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్ల వర్షెన్​లు మాడెర్న్​గా ఉంటాయని సమాచారం. సైజు పరంగా రెండు చిన్నవే! అయితే వీటిల్లో బాష్​ హబ్​ మోటార్​ ఉంటుందని తెలుస్తోంది. ఇదే నిజమైతే వీటిని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 80కి.మీల రేంజ్​ రావొచ్చు. 25కేఎంపీహెచ్​ టాప్​ స్పీడ్​ ఉండొచ్చు. హోండా డాక్స్​ ఈ, జూమర్​ ఈలో ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్​, ఎల్​ఈసీ ఇన్​స్ట్రుమెంట్​ స్క్రీన్​, ఫ్రెంట్​- రేర్​లో డిస్క్​ బ్రేక్స్​ వంటివి ఫీచర్స్​గా ఉండే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం