Bajaj Chetak : సరికొత్తగా బజాజ్​ 'చేతక్​'.. ధర ఎంతంటే..-bajaj chetak hits the roads of dehradun details on offers ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bajaj Chetak : సరికొత్తగా బజాజ్​ 'చేతక్​'.. ధర ఎంతంటే..

Bajaj Chetak : సరికొత్తగా బజాజ్​ 'చేతక్​'.. ధర ఎంతంటే..

Sharath Chitturi HT Telugu
Apr 08, 2023 12:11 PM IST

Bajaj Chetak : ‘బజాజ్​ చేతక్​’.. సరికొత్తగా మార్కెట్​లోకి వచ్చింది. ఈ-స్కూటర్​ రూపంలో ప్రజలను పలకరిస్తోంది. ఆ వివరాలు..

<p>సరికొత్తగా బజాజ్​ 'చేతక్​'.. ధర ఎంతంటే..</p>
<p>సరికొత్తగా బజాజ్​ 'చేతక్​'.. ధర ఎంతంటే..</p> (FB/Chetak)

Bajaj Chetak : బజాజ్​ చేతక్​.. భారత్​ విపణిలోకి సరికొత్తగా తిరిగొచ్చింది. బజాజ్​ చేతక్​ ఈ-స్కూటర్​ను ఉత్తరాఖండ్​ రాజధాని డెహ్రాడూన్​లో తాజాగా.. లాంచ్​ చేశారు. ఈ బజాజ్​ చేతక్​ సింగిల్​ వేరియంట్​లో అందుబాటులో ఉండనుంది.

కాగా.. బజాజ్​ చేతక్​ నాలుగు రంగుల్లో(హాజెల్​ నట్​, ఇండిగో మెటాలిక్​, వెల్లుటో, బ్రోక్లిన్​ బ్లాక్​) ఉండనుంది. ఉత్తరాఖండ్​లో.. బజాజ్​ చేతక్​ ఎక్స్​షోరూం ధర రూ. 1,51,769. ఆఫర్లలో ఇది రూ. 1.15లక్షలకే లభిస్తుంది!

బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఆన్​లైన్​ బుకింగ్స్​ను సంస్థ ప్రారంభించింది. రూ. 2000 చెల్లించి బుకింగ్​ చేసుకోవచ్చు. ఇందులో 2.8కిలోవ్యాట్​ ఎలక్ట్రిక్​ మోటర్​ని వినియోగించారు. 3కేడబ్ల్యూహెచ్​ ఐపీ67 లిథియం-ఐయన్​ బ్యాటరీ ఉంది. 70-90కిలోమీటర్ల టాప్​స్పీడ్​ దీని సొంతం. ఐదు గంటల పాటు ఈ బజాజ్​ చేతక్​ని ఛార్జ్​ చేయాల్సి ఉంటుంది.

బజాజ్​ చేతక్​ దేశంలో గతంలోనే లాంచ్​ అయ్యింది. ఇప్పటివరకు 14వేల యూనిట్లను అమ్మింది. ప్రస్తుతం 10వేలకుపైగా బుకింగ్స్​ ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న కేటీఎం షోరూమ్​లలో బజాజ్​ చేతక్​ను విక్రయించేందుకు సంస్థ ప్రణాళికలు రచిస్తోంది.

సంబంధిత కథనం