Honda bikes warranty : ఈ హోండా బైక్స్​పై 10ఏళ్ల వరకు వారెంటీ..!-honda now offers up to 10 years of warranty for these bike models ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Honda Bikes Warranty : ఈ హోండా బైక్స్​పై 10ఏళ్ల వరకు వారెంటీ..!

Honda bikes warranty : ఈ హోండా బైక్స్​పై 10ఏళ్ల వరకు వారెంటీ..!

Sharath Chitturi HT Telugu
Jun 11, 2023 01:29 PM IST

Honda bikes extended warranty : పలు మోడల్స్​పై 10ఏళ్ల పాటు వారెంటీని ఇస్తోంది హోండా మోటార్​సైకిల్​ అండ్​ స్కూటర్​ ఇండియా. ఆ వివరాలు..

ఈ హోండా బైక్స్​పై 10ఏళ్ల వరకు వారెంటీ..!
ఈ హోండా బైక్స్​పై 10ఏళ్ల వరకు వారెంటీ..!

Honda bikes extended warranty : వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్​ను ప్రవేశపెట్టింది హోండా మోటార్​సైకిల్​ అండ్​ స్కూటర్​ ఇండియా (హెచ్​ఎంఎస్​ఐ). ఈ ఎక్స్​టెండెడ్​ వారెంటీ ప్లస్​ ప్రోగ్రామ్​తో పలు బైక్స్​పై 10ఏళ్ల వరకు వారెంటీ కవరేజ్​ని ఇస్తోంది. వివరాల్లోకి వెళితే..

10ఏళ్ల పాటు వారెంటీ..

హోండా ఈడబ్ల్యూ ప్లస్​ ప్రోగ్రామ్​ను 250సీసీ బైక్స్​ సెగ్మెంట్​​ వరకు అందిస్తోంది సంస్థ. బండి కొన్న 91 రోజుల నుంచి 9వ ఏడాది మధ్యలో ఎప్పుడైనా ఈ వెసులుబాటును పొందవచ్చు. వారెంటీతో పాటు రెన్యువల్​, ఓనర్​షిప్​ ట్రాన్స్​ఫర్​ వంటి ఆప్షన్స్​ని కూడా ఇస్తోంది సంస్థ.

న్యూ హోండా ఎక్స్​టెండెడ్​ వారెంటీ ప్లస్​ ధర 150ససీ బైక్​ మోడల్స్​కు రూ. 1,317గా ఉంది. 150 సీసీ- 250సీసీ బైక్స్​ను కొనుగోలు చేసిన కస్టమర్లు ఈ వారెంటీ కోసం రూ. 1,667 కట్టాల్సి ఉంటుంది. అయితే వాహనం కొనుగోలు చేసిన ఏడాదిని బట్టి ఈ ఫైనల్​ ప్రైజ్​ మారుతుంటుందని గుర్తుపెట్టుకోవాలి.

ఇదీ చూడండి:- Honda Dio H smart : హోండా డియో హెచ్​ స్మార్ట్​ వేరియంట్​ లాంచ్​.. ఫీచర్స్​ ఇవే

వారెంటీలో వచ్చే ఫీచర్స్​ ఇవే..

ఈ ఎక్స్​టెండెడ్​ వారెంటీని తీసుకున్న కస్టమర్లకు మూడు ఆప్షన్స్​ ఇస్తోంది హోండా. అవి.. బైక్​ కొని 7ఏళ్ల కావొస్తున్న కస్టమర్లకు 3 ఇయర్​ పాలసీ, బైక్​ 8వ ఏడాదిలో ఉన్న కస్టమర్లకు 2 ఇయర్​ పాలసీ, 9వ ఏడాదిలో ఉన్న బైక్​కు 1 ఇయర్​ పాలసీ. ఈ ప్రోగ్రామ్​లో భాగంగా.. హోండా స్కూటర్లు ఉన్న కస్టమర్లకు 1,20,000 కి.మీల వరకు, బైక్స్​ ఉన్న వినియోగదారులకు 1,30,000 కి.మీల వరకు కవరేజ్​ లభిస్తోంది.

Honda extended warranty plus : "కస్టమర్లను సంతృప్తి పరచడమే మాకు చాలా కీలకం. దేశంలో లీడింగ్​ 2-వీలర్​​ మేన్యుఫ్యాక్చరర్​గా.. కస్టమర్ల అంచనాలను అందుకోవడమే హోండా లక్ష్యం. సరికొత్త బెంచ్​మార్క్​ను సృష్టించేందుకు మేము ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాము. ఇక ఈ ఎక్స్​టెండెడ్​ వారెంటీ ప్లస్​ ప్రోగ్రామ్​తో ఓనర్​షిప్​ ఎక్స్​పీరియన్స్​ మరింత మెరుగుపడుతుంది. 10ఏళ్ల పాటు వారెంటీని ఇస్తున్న తొలి ప్రోగ్రామ్​ ఇదే. దీనితో మాపై ప్రజలకు ఉన్న నమ్మకం మరింత బలపడుతుందని భావిస్తున్నాము," అని హెచ్​ఎంఎస్​ఐ సేల్స్​- మార్కెటింగ్​ డైరక్టర్​ యోగేశ్​ మాథుర్​ తెలిపారు.

ఈ హోండా ఎక్స్​టెండెడ్​ వారెంటీ ప్లస్​తో కీలకమైన హై వాల్యూ ఇంజిన్​ పార్ట్​లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్​ పరికరాలు కూడా కవర్​ అవుతుండటం విశేషం. ఏదైనా లోపాలు ఉంటే.. వాటిని రిప్లేస్​ చేసుకోవచ్చు.

సంబంధిత కథనం