KTM electric scooter : కేటీఎం నుంచి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్.. లాంచ్ ఎప్పుడు?
KTM electric scooter : కేటీఎం నుంచి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ ఏడాదిలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఆ వివరాలు..
KTM electric scooter : దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ కేటీఎం.. ఓ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటలీ మిలాన్‌లో ఈ ఏడాదిలో జరగనున్న ఈఐసీఎంఏ షోలో దీనిని.. సంస్థ ప్రదర్శిస్తుందని తెలుస్తోంది. ఇది జరిగిన కొన్ని నెలలకే.. కేటీఎం ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండియాలో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ స్కూటర్‌కు సంబంధించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
అద్భుతమైన ఫీచర్స్‌తో..
ఈవీలను రూపొందించేందుకు అనేక ఆటోమొబైల్ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ జాబితాలోకి కేటీఎం కూడా తాజాగా చేరింది. ఇండియాలో దీనిని బజాజ్ ఆటో రూపొందిస్తుందని తెలుస్తోంది. ఇండియాలో తయారు చేసి అంతర్జాతీయ విపణిలోకి ఎగుమతి చేసే యోచనలో సంస్థ ఉన్నట్టు సమాచారం.
KTM electric scooter launch date in India : ఇక ఇప్పుడు.. కేటీఎం ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సంబంధించిన టెస్ట్ మ్యూల్ ఒకటి రోడ్డు మీద దర్శనమిచ్చింది. ఫలితంగా ఈ 2 వీలర్ డిజైన్‌తో పాటు ఇతర వివరాలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో ఫ్లాట్ సీట్, ఫ్లైస్క్రీన్‌తో పాటు వీల్స్ స్పోర్టీగా ఉంటాయని తెలుస్తోంది. ఫ్రెంట్ ఏప్రన్ చాలా అగ్రెసివ్‌గా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఫుట్‌బోర్డ్ ఫ్లాట్‌గా, సిల్వర్డ్ పిలియన్ గ్రాబ్ టెయిల్‌తో కూడిన సింగిల్ సీట్ ఉండొచ్చు. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, అల్యుమీనియం స్వింగ్ అర్మాతో పాటు అలాయ్ వీల్స్ వచ్చే అవకాశం ఉంది.
ఇదీ చూడండి:- Honda electric scooters : హోండా నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు..
కేటీఎం తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ డైమెన్షన్స్కు సంబంధించిన వివరాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇందులో 8కేడబ్ల్యూ మోటార్ ఉండొచ్చు. పవర్, బ్యాటరీ ప్యాక్, రేంజ్ వంటి వివరాలు ఇంకా తెలియరాలేదు.
KTM electric scooter in India : కేటీఎం ఈ-స్కూటర్ ఫ్రెంట్, రేర్ వీల్స్‌కు డిస్క్ బ్రేక్స్ వస్తాయని తెలుస్తోంది. సింగిల్/ డ్యూయెల్ ఛానెల్ ఏబీఎస్ సిస్టెమ్ కూడా ఉండనుంది. ధరకు సంబంధించిన వివరాలు.. లాంచ్ టైమ్‌లో అందుబాటులోకి వస్తాయి. ఈ-స్కూటర్ గురించి కేటీఎం లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారిని సంతృప్తి పరిచే విధంగా ఈ ప్రాడెక్ట్‌ను తీర్చిదిద్దాలని కేటీఎం భావిస్తోంది.
సంబంధిత కథనం