Honda Dio H-Smart vs Yamaha RayZR 125 Fi : ఈ రెండు స్కూటర్లలో ఏది బెస్ట్?
Honda Dio H-Smart vs Yamaha RayZR 125 Fi : హోండా డియో హెచ్ స్మార్ట్ వర్సెస్ యమహా రేజెడ్ఆర్ 125 ఎఫ్ఐ.. ఈ రెండిట్లో ఏది బెస్ట్? ఇక్కడ తెలుసుకుందాము..
Honda Dio H-Smart vs Yamaha RayZR 125 Fi : ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హోండా.. తన హెచ్ స్మార్ట్ లైనప్‌ను పెంచుకునే పనిలో పడింది. తాజాగా.. డియో హెచ్ స్మార్ట్ వేరియంట్‌ను లాంచ్ చేసింది. ఈ స్కూటర్.. యమహా రేజెడ్ఆర్ 124 ఎఫ్ఐకి గట్టిపోటీనిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి, ఏది బెస్ట్? అన్నది తెలుసుకుందాము..
హోండా డియో హెచ్ స్మార్ట్ వర్సెస్ యమహా రేజెడ్ఆర్ 125 ఎఫ్ఐ..
హోండా కొత్త హెచ్ స్మార్ట్ స్కూటర్లో హెడ్‌లైట్ మౌంటెడ్ ఫ్రెంట్ ఏప్రన్, వైడ్ హ్యండిల్బార్, సైడ్ ప్యానల్స్ మీద స్పోర్టీ గ్రాఫిక్స్, యాంగ్యులర్ మిర్రర్స్, సింగిల్ పీస్ సీట్, బ్లాక్డ్ ఔట్ అలాయ్ వీల్స్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి వస్తున్నాయి. హోండా డియో సీట్ హైట్ 765ఎంఎం. గ్రౌండ్ క్లియరెన్స్ 160ఎంఎం. కర్బ్ వెయిట్ 105కేజీలు.
యమహా స్కూటర్లో ఏప్రన్ మౌంటెడ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, టింటెడ్ ఫ్లై స్క్రీన్, ఫ్లాట్ సీట్, వైడ్ హ్యాండిల్ బార్ విత్ నకల్ గార్డ్స్, బ్లూటూత్ ఎనేబుల్డ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డిజైనర్ 12 ఇంచ్ అలాయ్ వీల్స్ వస్తున్నాయి. యమహా రేజెడ్ఆర్ 125 సీట్ హైట్ 785ఎంఎం. గ్రౌండ్ క్లియరెన్స్ 145ఎంఎం. బరువు 98కేజీలు.
ఇదీ చూడండి:- Hero Passion Plus: లేటెస్ట్ ఫీచర్స్ తో, అందుబాటు ధరలో సరికొత్త హీరో ప్యాషన్ ప్లస్
ఈ రెండు స్కూటర్లలో ఏ ఇంజిన్లను ఉన్నాయి..?
హోండా డియో హెచ్ స్మార్ట్‌లో 109.55 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. యాక్టివా 6జీలోనూ ఇదే కనిపిస్తుంది. ఈ ఇంజిన్ 7.6 హెచ్‌పీ పవర్‌ను, 9ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
Honda Dio H-Smart price : యమహా స్కూటర్లో 125సీసీ, సింగిల్ సిలిండర్ ఉంటుంది. హైబ్రీడ్ పవర్ అసిస్ట్ ఫెసిలిటీ ఉండటం విశేషం. ఈ ఇంజిన్.. 8 హెచ్‌పీ పవర్‌ను, 10.3 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
ఈ రెండు స్కూటర్లలోనూ వీ బెల్ట్ ఆటోమెటిక్ గేర్‌బాక్స్ వస్తోంది.
ఇక సేఫ్టీ విషయానికొస్తే.. హోండా డియో ఫ్రెంట్- రేర్ వీల్స్‌కు డ్రమ్ బ్రేక్స్ వస్తున్నాయి. యమహా రేజెడ్ఆర్ 125 స్కూటర్‌కు ఫ్రెంట్లో డిస్క్ బ్రేక్, రేర్‌లో డ్రమ్ బ్రేక్ లభిస్తోంది. ఈ రెండు స్కూటర్లలోనూ కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టెమ్ వస్తోంది. సస్పెన్షన్స్ విషయానికొస్తే.. ఫ్రెంట్లో టెలిస్కోపిక్ ఫోర్క్స్, రేర్‌లో మోనో షాక్ యూనిట్లు లభిస్తోంది.
వీటి ధరలు ఎంతంటే..!
Honda Dio H-Smart on road price : ఇండియాలో హోండా డియో హెచ్ స్మార్ట్ ఎక్స్‌షోరూం ధర రూ. 77,712గా ఉంది. యమహా రేజెడ్ఆర్ 125 ఎఫ్ఐ ఎక్స్‌షోరూం ధర రూ. 83,730- రూ. 93,530గా ఉంది.
సంబంధిత కథనం