Vespa Dual SXL 150 vs Yamaha Aerox 155 : ఆల్ న్యూ ఎంవై23 వెస్పా ఎస్ఎక్స్ఎల్ 150 డ్యూయెల్ వేరియంట్‌ను ఇటీవలే లాంచ్ చేసింది పియాజియో సంస్థ. పర్ల్ వైట్/ మాట్ రెడ్, పర్ల్ వైట్/ మాట్ బ్లాక్ పెయింట్స్‌లో అందుబాటులో ఉండనుంది. ఈ స్కూటర్.. యమహా ఏరోక్స్ 155కి గట్టిపోటీనిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి.. ఏది బెస్ట్? అన్నది తెలుసుకుందాము..
వెస్పా స్కూటర్ ఎత్తు 77ఎంఎం. వీల్‌బేస్ 1,290ఎంఎం. కర్బ్ వెయిట్ 115కేజీలు. మరోవైపు యమహా ఏరోక్స్ 155 సాడిల్ హైట్ 790ఎంఎం. వీల్‌బేస్ 1,350ఎంఎం. కర్బ్ వెయిట్ 126కేజీలు.
Vespa Dual SXL 150 price : 2023 వెస్పా డ్యూయెల్ ఎస్ఎక్స్ఎల్ 150లో రెట్రో స్టైల్ డిజైన్ ఉంటుంది. స్క్వేర్ షేప్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, క్రోమ్డ్ మిర్రర్స్, రబ్బరైజ్డ్ ఇన్సర్ట్స్తో కూడిన ఫుట్‌బోర్డ్, వైడ్ హ్యాండిల్ బార్, సింగిల్ పీస్ సీట్, 12 ఇంచ్ అలాయ్ వీల్స్, స్క్వేర్డ్ ఔట్ ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌లు లభిస్తున్నాయి.
Yamaha Aerox 155 price : ఇక యమహా ఏరోక్స్ 155లో ఏప్రాన్ మౌంటెడ్ డ్యూయెల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఆరోహెడ్ షేప్ మిర్రర్స్, బ్లూటూత్ ఎనేబుల్డ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, స్టెప్డ్ అప్ సీట్, అప్స్వెప్ట్ ఎగ్సాస్ట్, 14 ఇంచ్ అలాయ్ వీల్స్, ఎల్ఈడీ టెయిల్లైట్లు వస్తున్నాయి.
Vespa SXL 150 price in Hyderabad : వెస్పా డ్యూయెల్ ఎస్ఎక్స్ఎల్ 150లో 150సీసీ, సింగిల్ సిలిండర్, 3 వాల్వ్, ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 10.4 హెచ్‌పీ పవర్‌ను, 10.6 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
యమహా ఏరోక్స్ 155లో 155సీసీ, వేరియబుల్ వాల్వ్ అక్సేషన్ సిస్టెమ్తో కూడిన లిక్విడ్ కూల్డ్ మోటార్ ఉంటుంది. ఇది 14.8 హెచ్‌పీ పవర్‌ను, 13.9 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
Yamaha Aerox 155 price Hyderabad : ఈ రెండు స్కూటర్లలోనూ సీవీటీ గేర్‌బాక్స్ ఉంటుంది.
Yamaha Aerox 155 review : ఈ రెండు స్కూటర్ల ఫ్రెంట్ వీల్‌కు డిస్క్ బ్రేక్, రేర్ వీల్‌కు డ్రమ్ బ్రేక్ వస్తోంది. వెస్పా స్కూటర్లో కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టెమ్ వస్తుండగా.. యమహా బండికి సింగిల్ ఛానెల్ ఏబీఎస్ లభిస్తోంది.
Vespa Dual SXL 150 mileage : ఇండియా మార్కెట్లో వెస్పా డ్యూయెల్ ఎస్ఎక్స్ఎల్ 150 ఎక్స్‌షోరూం ధర రూ. 1.49లక్షలుగా ఉంది. యమహా ఏరోక్స్ 155 ఎక్స్‌షోరూం ధర రూ. 1.43లక్షలుగా ఉంది.
సంబంధిత కథనం
టాపిక్