2023 KTM 390 Adventure : 2023 కేటీఎం 390 అడ్వెంచర్​ లాంచ్​.. ధర ఎంతంటే..!-2023 ktm 390 adventure launched at 3 6 lakh see full details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  2023 Ktm 390 Adventure : 2023 కేటీఎం 390 అడ్వెంచర్​ లాంచ్​.. ధర ఎంతంటే..!

2023 KTM 390 Adventure : 2023 కేటీఎం 390 అడ్వెంచర్​ లాంచ్​.. ధర ఎంతంటే..!

Sharath Chitturi HT Telugu
May 15, 2023 03:43 PM IST

2023 KTM 390 Adventure : 2023 కేటీఎం 390 అడ్వెంచర్​ లాంచ్ అయ్యింది. ధరతో పాటు అప్డేటెడ్​ ఫీచర్స్​ వివరాలు ఇక్కడ చూడండి.

2023 కేటీఎం 390 అడ్వెంచర్​ లాంచ్​..
2023 కేటీఎం 390 అడ్వెంచర్​ లాంచ్​.. (HT AUTO)

2023 KTM 390 Adventure : 390 అడ్వెంచర్​ 2023 వర్షెన్​ను లాంచ్​ చేసింది ప్రముఖ ఆటోమొబైల్​ సంస్థ కేటీఎం. ఈ మోడల్​ ఎక్స్​షోరూం ధర రూ. 3.60లక్షలుగా ఉంది. 390 అడ్వెంచర్​, 390 అడ్వెంచర్​ ఎక్స్​ వేరియంట్లతో పాటు 2023 కేటీఎం 390 అడ్వెంచర్​ని విక్రయించనున్న సంస్థ. ఈ మోడల్​లో స్పోక్​ వీల్స్​తో పాటు ఫుల్లీ అడ్జస్టెబుల్​ సస్పెషన్​​ కొత్తగా వస్తున్నాయి.

2023 కేటీఎం 390 అడ్వెంచర్​..

కేటీఎం 390 అడ్వెంచర్​ బైక్​ను లాంచ్​ చేసి 3ఏళ్లు గడిచిపోయింది. అడ్జస్టెబుల్​ సస్పెషన్​ ఉంటే బాగుంటుందని కస్టమర్లు అభిప్రాయపడ్డారు. ఇక ఇప్పుడు రైడ్​ క్వాలిటీ, హ్యాండ్లింగ్​, కంఫర్ట్​ను పెంచుకునే విధంగా.. ఈ బైక్​ను కస్టమైజ్​ చేసుకోవచ్చు. ఫ్రెంట్​ యూఎస్​డీ ఫోర్క్స్​ను 30 క్లిక్స్​ వరకు అడ్జెస్ట్​ చేసుకోవచ్చు. రేర్​ మోనో షాక్​ను 20 క్లిక్స్​ వరకు అడ్జెస్ట్​ చేసుకోవచ్చు. 10 స్టెప్​ ప్రీలోడెడ్​ అడ్జస్టెబులిటీ ఎలాగో ఉంది.

2023 KTM 390 Adventure features : 2023 కేటీఎం 390 అడ్వెంచర్​లో 19 ఇంచ్​ ఫ్రెంట్​, 17 ఇంచ్​ రేర్​ లైట్​ స్పోక్డ్​ వీల్స్​ వస్తున్నాయి. బ్లాక్​ అనోడైజ్డ్​ అల్యుమీనియం రిమ్స్​ ఉన్నాయి. ఫలితంగా.. అడ్వెంచర్​ రైడ్స్​ మరింత స్మూత్​గా ఉండనుంది.

ఇదీ చూడండి:- KTM 890 SMT SuperMoto : రయ్​రయ్​.. కేటీఎం నుంచి కొత్త బైక్​ లాంచ్​!

టెక్నాలజీ పరంగా ఈ అడ్వెంచర్​ బైక్​లో మోటార్​సైకిల్​ ట్రాక్షన్​ కంట్రోల్​ విత్​ 3డీ ఇనర్షియల్​ మెజర్మెంట్​ యూనిట్​, క్విక్​షిఫ్టర్​+, లీన్​ యాంగిల్​ సెన్సిటివ్​ కార్నరింగ్​ ఏబీఎస్​ వంటివి వస్తున్నాయి. స్ట్రీట్​, ఆఫ్​రోడ్​, ఆఫ్​రోడ్​ ఏబీఎస్​, రైడ్​ బై వయర్​ వంటి మోడ్స్​తో పాటు ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్స్​ కూడా ఉన్నాయి. 5 ఇంచ్​ కలర్​ టీఎఫ్​టీ డిస్​ప్లే, హ్యాండిల్​బార్​ స్విఛ్​గేర్​లు ఈ బైక్​ సొంతం.

2023 KTM 390 Adventure India launch : ఐకానిక్​ అడ్వెంచర్​ బైక్స్​లో ఈ కేటీఎం 390 అడ్వెంచర్​ ఒకటి. ఈ బైక్​కు మంచి గుర్తింపు ఉంది. అదే విధంగా మంచి డిమాండ్​ కూడా లభిస్తోందని సంస్థకు చెందిన అధికారులు చెబుతున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం