Bajaj Avenger street 220 : బజాజ్​ అవెంజర్​ స్ట్రీట్​ 220.. తిరిగొస్తోంది!-bajaj avenger street 220 to relaunch soon in india check full details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bajaj Avenger Street 220 : బజాజ్​ అవెంజర్​ స్ట్రీట్​ 220.. తిరిగొస్తోంది!

Bajaj Avenger street 220 : బజాజ్​ అవెంజర్​ స్ట్రీట్​ 220.. తిరిగొస్తోంది!

Sharath Chitturi HT Telugu
May 12, 2023 08:12 AM IST

Bajaj Avenger street 220 : బజాజా అవెంజర్​ స్ట్రీట్​ 220 తిరిగొస్తోంది! ఈ మోడల్​ను మార్కెట్​లోకి తీసుకొచ్చేందుకు సంస్థ ప్లాన్​ చేస్తోంది.

బజాజ్​ అవెంజర్​ స్ట్రీట్​ 220.. తిరిగొస్తోంది!
బజాజ్​ అవెంజర్​ స్ట్రీట్​ 220.. తిరిగొస్తోంది! (HT AUTO)

Bajaj Avenger street 220 : పాత మోటార్​సైకిల్స్​ను మళ్లీ మార్కెట్​లోకి రీ-లాంచ్​ చేసే పనిలో పడింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ బజాజ్​ ఆటో! ఈ క్రమంలోనే.. అవెంజర్​ స్ట్రీట్​ 220ని తీసుకురానుంది. ఈ మేరకు డీలర్​షిప్​ షోరూమ్​ల నుంచి హెచ్​టీ ఆటో బృందానికి సమాచారం అందింది. అవెంజర్​ క్రూజ్​ 220, అవెంజర్​ స్ట్రీట్​ 160 సరసన ఈ అవెంజర్​ స్ట్రీట్​ 220 చేరనుంది.

తిరిగొస్తున్న స్ట్రీట్​ 220..

ఈ బజాజ్​ అవెంజర్​ స్ట్రీట్​ 220 స్టైలింగ్​.. అవెంజర్​ స్ట్రీట్​ 160ని పోలి ఉంటుంది. రౌండ్​ హెడ్​ల్యాంప్​, బ్లాక్​డ్​ ఔట్​ ఇంజిన్​, ఫోర్క్​ గైటెర్స్​, బ్లాక్​ అలాయ్​ వీల్స్​, స్మాలర్​ పిలియన్​ బ్యాక్​రెస్ట్​ వంటివి ఉంటాయి. ఇందులో చిన్నపాటి ఫ్లైస్క్రీన్​, ఫ్లాట్​ హ్యాండిల్​బార్​లు వస్తాయి. క్రూజ్​ 220లో మాత్రం పెద్ద విండ్​స్క్రీన్​, రైజెడ్​ హ్యాండిల్​బార్​లు ఉంటాయి.

Bajaj Avenger street 220 relaunch : రీ- లాంచ్​ అవుతున్న అవెంజర్​ స్ట్రీట్​ 220లో 200 సీసీ సింగిల్​ సిలిండర్​ ఇంజిన్​ ఉంటుంది. బజాజ్​ పల్సర్​ 220ఎఫ్​లోనూ ఇదే ఇంజిన్​ కనిపిస్తుంది. ఈ ఇంజిన్​ 18.7 బీహెచ్​పీ పవర్​ను, 17.5 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇందులో 5 స్పీడ్​ గేర్​బాక్స్​ ఉంటుంది. బీఎస్​6 ఫేజ్​ 2 ఎమిషన్​ నార్మ్స్​కు ఈ మోడల్​ అప్డేట్​ అయ్యింది.

ఇదీ చూడండి:- Bajaj Avenger 220 bobber : బాబర్​గా మారిన బజాజ్​ అవెంజర్​ 220.. బైక్​ అదిరింది!

ఇక సస్పెషన్స్​ కోసం బైక్​ ఫ్రెంట్​లో టెలిస్కోపిక్​ ఫోర్క్స్​, రేర్​లో ట్విన్​ షాక్​ అబ్సార్బర్స్​ వంటివి వస్తున్నాయి. ఫ్రెంట్​, రేర్​లో డిస్క్​ బ్రేక్​లు ఉంటాయి. సింగిల్​ ఛానెల్​ ఏబీఎస్​ కూడా లభిస్తుంది.

స్ట్రీట్​ 220 ధర ఇదే..!

Bajaj Avenger street 220 price : స్టైలింగ్​లో మార్పులను మినహాయిస్తే.. అవెంజర్​ స్ట్రీట్​ 220, క్రూజ్​ 220 బైక్స్​ దాదాపు ఒకే విధంగా ఉంటాయి. అయితే.. క్రూజ్​ 220 కన్నా స్ట్రీట్​ 220 ధర తక్కువగా ఉంటుంది. ఇక రీ లాంచ్​కు సిద్ధమవుతున్న బజాజ్​ అవెంజర్​ 220 స్ట్రీట్​ ఎక్స్​షోరూం ధర రూ. 1.40లక్షలుగా ఉంటుందని తెలుస్తోంది.

బైక్​ రీ-లాంచ్​ డేట్​, ఇతర ఫీచర్స్​, స్పెసిఫికేషన్స్​ వంటి వివరాలు తెలియాల్సి ఉంది. లాంచ్​ టైమ్​ సమీపిస్తున్న కొద్ది.. వివరాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం