KTM 200 Duke vs Bajaj Pulsar NS200 : కేటీఎం 200 డ్యూక్​ వర్సెస్​ బజాజ్​ పల్సర్​ ఎన్​ఎస్​200- ఏది బెస్ట్​?-is 2023 ktm 200 duke better than bajaj pulsar ns200 check detailed comparison here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ktm 200 Duke Vs Bajaj Pulsar Ns200 : కేటీఎం 200 డ్యూక్​ వర్సెస్​ బజాజ్​ పల్సర్​ ఎన్​ఎస్​200- ఏది బెస్ట్​?

KTM 200 Duke vs Bajaj Pulsar NS200 : కేటీఎం 200 డ్యూక్​ వర్సెస్​ బజాజ్​ పల్సర్​ ఎన్​ఎస్​200- ఏది బెస్ట్​?

Sharath Chitturi HT Telugu
Apr 23, 2023 07:11 AM IST

2023 KTM 200 Duke vs Bajaj Pulsar NS200 : కేటీఎం 200 డ్యూక్​కు 2023 వర్షెన్​ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ బైక్​ను బజాజ్​ పల్సర్​ ఎన్​ఎస్​200తో పోల్చి.. రెండింట్లో ఏది కొంటే బెటర్​ అన్నది తెలుసుకుందాము..

కేటీఎం 200 డ్యూక్​ వర్సెస్​ బజాజ్​ పల్సర్​ ఎన్​ఎస్​200- ఏది బెస్ట్​?
కేటీఎం 200 డ్యూక్​ వర్సెస్​ బజాజ్​ పల్సర్​ ఎన్​ఎస్​200- ఏది బెస్ట్​?

2023 KTM 200 Duke vs Bajaj Pulsar NS200 : కేటీఎం 200 డ్యూక్​కు చెందిన 2023 మోడల్​ మార్కెట్​లోకి అడుగుపెట్టింది. ఈ 199.5సీసీ ఇంజిన్​ ఇప్పుడు ఒక ఓబీడీ- 2 కంప్లైంట్​. ఈ బైక్​.. 2023 బజాజ్​ పల్సర్​ ఎన్​ఎస్​200కు గట్టిపోటీనిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి, ఏది కొంటే బెటర్​? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

కేటీఎం 200 డ్యూక్​ వర్సెస్​ బజాజ్​ పల్సర్​ ఎన్​ఎస్​200- లుక్స్​..

KTM 200 Duke on road price in Hyderabad : కేటీఎం 200 డ్యూక్​లో ఆరెంజ్​ కలర్డ్​ ట్రెల్లిస్​ ఫ్రేమ్​, మస్క్యులర్​ ఫ్యూయెల్​ ట్యాంక్​ విత్​ ఎక్స్​టెన్షన్స్​, వైడ్​ హ్యాండిల్​బార్​, స్ప్లిట్​ టైప్​ సీట్స్​, యాంగ్యులర్​ మిర్రర్స్​, ఎల్​ఈడీ డీఆర్​ఎల్స్​తో కూడిన హాలోజెన్​ హెడ్​ల్యాంప్​ యూనిట్​, స్లిమ్​ ఎల్​ఈడీ టెయిల్​ల్యాంప్​ వంటివి లభిస్తాయి. ఈ బైక్​ ఎత్తు 822ఎంఎం. గ్రౌండ్​ క్లియరెన్స్​ 155ఎంఎం. వీల్​బస్​ 1,367ఎంఎం, కర్బ్​ వెయిట్​ 159కేజీలు.

మరోవైపు బజాజ్​ పల్సర్​ ఎన్​ఎస్​200లో పెరీమీటర్​ ఫ్రేమ్​, స్కల్ప్​టెడ్​ ఫ్యూయెల్​ ట్యాంక్​, యాంగ్యులర్​ హాలోజెన్​ హెడ్​ల్యాంప్​, క్లిప్​- ఆన్​ హ్యాండిల్​బార్​, అండర్​ బెల్లీ ఎగ్సాస్ట్​, స్లీక్​ ఎల్​ఈడీ టెయిల్​ల్యాంప్​ వంటివి వస్తున్నాయి. ఈ బైక్​ ఎత్తు 807ఎంఎం. గ్రౌండ్​ క్లియరెన్స్​ 168ఎంఎం. వీల్​బేస్​ 1,363ఎంఎం. వెయిట్​ 158కేజీలు.

ఇదీ చూడండి:- 2023 Bajaj Pulsar NS160 vs Hero Xtreme 160R: ఈ బైక్‍లు ఎలా ఉన్నాయి! ఏ అంశంలో ఏది బెస్ట్?

కేటీఎం 200 డ్యూక్​ వర్సెస్​ బజాజ్​ పల్సర్​ ఎన్​ఎస్​200- ఇంజిన్​..

KTM 200 Duke price : 2023 కేటీఎం 200 డ్యూక్​లో 199.5 సీసీ, సింగిల్​ సిలిండర్​, 4 వాల్వ్​, లిక్విడ్​ కూల్డ్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 25.4 హెచ్​పీ పవర్​ను, 19.5ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

బజాజ్​ పల్సర్​ ఎన్​ఎస్​200లో 199.5సీసీ, లిక్విడ్​ కూల్డ్​, డీటీఎస్​-ఐ, సింగిల్​ సిలిండర్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 24.13 హెచ్​పీ పవర్​ను, 18.5ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

Bajaj Pulsar NS200 on road price in Hyderabad : ఈ రెండు బైక్స్​లోనూ 6 స్పీడ్​ గేర్​బాక్స్​ ఉంటుంది.

ఇక సేఫ్టీ విషయానికొస్తే.. ఈ రెండు బైక్స్​లో.. రెండు వీల్స్​కి డిస్క్​ బ్రేక్​లు ఉన్నాయి. డ్యూయెల్​ ఛానెల్​ ఏబీఎస్​ కూడా వస్తోంది. సస్పెషన్స్​ కోసం ఫ్రెంట్​ వీల్​కి ఇన్​వర్టెడ్​ ఫోర్క్స్​, రేర్​లో.. ప్రీలోడ్​- అడ్జెస్టెబుల్​ మోనో షాక్​ యూనిట్​ వస్తున్నాయి.

కేటీఎం 200 డ్యూక్​ వర్సెస్​ బజాజ్​ పల్సర్​ ఎన్​ఎస్​200- ధర..

Bajaj Pulsar NS200 features : 2023 కేటీఎం 200 డ్యూక్​ ఎక్స్​షోరూం ధర రూ. 1.92లక్షలుగా ఉంది. ఇక 2023 బజాజ్​ పల్సర్​ ఎన్​ఎస్​200 ఎక్స్​షోరూం ధర రూ. 1.4లక్షలుగా ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం