Ola S1X : ఓలా నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​.. ‘ఎస్​1ఎక్స్’​ వచ్చేస్తోంది..!-ola s1x to be launched on august 15 will cost under 1 lakh ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ola S1x : ఓలా నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​.. ‘ఎస్​1ఎక్స్’​ వచ్చేస్తోంది..!

Ola S1X : ఓలా నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​.. ‘ఎస్​1ఎక్స్’​ వచ్చేస్తోంది..!

Sharath Chitturi HT Telugu
Aug 07, 2023 12:38 PM IST

Ola S1X launch : ఈ నెల 15న కొత్త ఈ-స్కూటర్​ను లాంచ్​ చేస్తోంది ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్​. ఈ మోడల్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఓలా నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​.. ఎస్​1ఎక్స్​ వచ్చేస్తోంది..!
ఓలా నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​.. ఎస్​1ఎక్స్​ వచ్చేస్తోంది..!

Ola S1X launch : ఓలా ఎలక్ట్రిక్​ సంస్థ మంచి జోరు మీద ఉంది! ఎస్​1 ఎయిర్​ను ఇటీవలే లాంచ్​ చేసిన ఈ సంస్థ.. ఇప్పుడు మరో ఎలక్ట్రిక్​ స్కూటర్​ను సిద్ధం చేస్తోంది. దీని పేరు ఓలా ఎస్​1ఎక్స్​. ఈ మోడల్​.. ఈ నెల 15న ఇండియాలో లాంచ్​ అవుతుందని తెలుస్తోంది. ఎస్​1 ఎయిర్​ కన్నా ఎస్​1ఎక్స్​ ధర తక్కువగా ఉంటుందని సమాచారం.

ఓలా ఎస్1ఎక్స్​ విశేషాలివే..!

ఓలా ఎలక్ట్రిక్​.. ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ను న్యూ జనరేషన్​ ప్లాట్​ఫార్మ్​పై రూపొందిస్తోందని తెలుస్తోంది. అయితే ఇందులో ఎస్​1 ఎయిర్​కు సంబంధించి కొన్ని ఫీచర్స్​ ఉండొచ్చు. వీల్స్​, సస్పెన్షన్స్​, హార్డ్​వేర్​ కాంపోనెంట్స్​ ఒకే విధంగా ఉండే అవకాశం ఉంది. ఫలితంగా ఓలాకు డెవలప్​మెంట్​ కాస్ట్​ తగ్గుతుంది!

ఇక ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఫ్రెంట్​లో టెలిస్కోపిక్​ ఫోర్క్స్​, రేర్​లో గ్యాస్​ ఛార్జ్​డ్​ షాక్​ అబ్సార్బర్స్​ ఉండొచ్చు. ఫ్రెంట్​, రేర్​ వీల్స్​కు డ్రమ్​ బ్రేక్స్​ వస్తాయి. కంబైన్డ్​ బ్రేకింగ్​ సిస్టెమ్​ ఉండే అవకాశం ఉంది. అలాయ్​ వీల్స్​ స్థానంలో స్టీల్​ వీల్స్​ వస్తాయని టాక్​ నడుస్తోంది.

Ola S1X price : ఓల్​ ఎస్​1 ఎయిర్​లో ఉన్న హెడ్​ల్యాంప్​ డిజైన్​, ఎల్​ఈడీ డేటైమ్​ రన్నింగ్​ ల్యాంప్​, ప్రొజెక్టర్​ సెటప్​.. ఎస్1ఎక్స్​లోనూ ఉండొచ్చు. రేర్​ టెయిల్​ ల్యాంప్​ డిజైన్​ కూడా మారకపోవచ్చు. డిజైన్​ పరంగా ఓలా వాహనాల్లో పెద్దగా మార్పులు ఉండటం లేదు.

ఇదీ చూడండి:- Ola S1 Air scooter: ఓలా ఎస్ 1 ఎయిర్ స్కూటర్ కొనే ఆలోచనలో ఉన్నారా? ఈ న్యూస్ మీ కోసమే..

ఇక ఫీచర్స్​ కూడా ఈ రెండు స్కూటర్లలో ఒకే విధంగా ఉండొచ్చు. స్క్రీన్​ రిసొల్యూషన్​ తక్కువగానే ఉండనుంది. మరి ఈ కొత్త ఈ-స్కూటర్​లో నేవిగేషన్​, బ్లూటూత్​, కనెక్టివిటీ, ఇంటర్నెట్​ కనెక్షన్​ వంటి ఫీచర్స్​ ఉంటాయా? లేదా? అన్న విషయంపై ప్రస్తుతం క్లారిటీ లేదు.

ధర ఎంతంటే..

Ola S1X launch date in India : ఈ ఓలా ఎస్1ఎక్స్​ ఎక్స్​షోరూం ధర రూ. 1.10లక్షలుగా ఉంటుందని తెలుస్తోంది. ఆగస్ట్​ 15 లాంచ్​ టైమ్​లో ఈ మోడల్​పై మరిన్ని వివరాలు అందుబాటులోకి వస్తాయి.

ఎస్​1కు ఓలా గుడ్​బై..!

ఎస్​1 ఎయిర్​ ఎంట్రీతో ఎస్1​ ఎలక్ట్రిక్​ స్కూటర్​కు గుడ్​ బై చెప్పేసింది ఓలా ఎలక్ట్రిక్​ సంస్థ. ఫలితంగా.. ఇప్పుడు ఈ సంస్థ పోర్ట్​ఫోలియోలో ఎస్​1 ఎయిర్​, ఎస్​1 ప్రో మోడల్స్​ మాత్రమే ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం