Ola S1 Air scooter: ఓలా ఎస్ 1 ఎయిర్ స్కూటర్ కొనే ఆలోచనలో ఉన్నారా? ఈ న్యూస్ మీ కోసమే..-ola electric announced that the purchase window for s1 air scooter will open on july 28th ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ola S1 Air Scooter: ఓలా ఎస్ 1 ఎయిర్ స్కూటర్ కొనే ఆలోచనలో ఉన్నారా? ఈ న్యూస్ మీ కోసమే..

Ola S1 Air scooter: ఓలా ఎస్ 1 ఎయిర్ స్కూటర్ కొనే ఆలోచనలో ఉన్నారా? ఈ న్యూస్ మీ కోసమే..

HT Telugu Desk HT Telugu
Jul 22, 2023 03:31 PM IST

Ola S1 Air scooter: ఓలా కమ్యూనిటీ కి మరియు జూలై 28 లోపల బుకింగ్ చేసుకున్న వారికి 1,09,999/- ప్రారంభ ధరకు వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాన్ని ఓలా కల్పిస్తోంది.

ఓలా ఎస్ 1 ఎయిర్ ఎలక్ట్రక్ స్కూటర్స్
ఓలా ఎస్ 1 ఎయిర్ ఎలక్ట్రక్ స్కూటర్స్

Ola S1 Air scooter: జూలై 28 నుండి S1 ఎయిర్ కొనుగోలు విండోను ప్రారంభిస్తున్నట్లు ఎలక్ట్రిక్ స్కూటర్స్ తయారీ సంస్థ ఓలా ప్రకటించింది. ఓలా కమ్యూనిటీ కి మరియు జూలై 28 లోపల బుకింగ్ చేసుకున్న వారికి రూ. 1,09,999/- ప్రారంభ ధరకు వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాన్ని ఓలా కల్పిస్తోంది.

ఆగస్ట్ లో డెలివరీ..

భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్, భారీ అంచనాలతో అందుబాటు ధరలో వస్తున్న S1 ఎయిర్ స్కూటర్ కొనుగోలు విండోను జూలై 28న ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఓలా కమ్యూనిటీ కి మరియు జూలై 28 లోపు S1 ఎయిర్‌ని బుక్ చేసుకునే వారికి రూ. 1,09,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ పరిమిత వ్యవధి కొనుగోలు విండో జూలై 28 నుండి జూలై 30 వరకు మాత్రమే ఉంటుంది. ఇతర కస్టమర్‌లందరికీ, కొనుగోలు విండో 31వ తేదీ నుండి రూ. 1,19,999 సవరించిన ధరతో ప్రారంభమవుతుంది. అలాగే, బుక్ చేసుకున్న కస్టమర్లకు ఆగస్టు తొలి వారం నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి.

అతి తక్కువ నిర్వహణ ఖర్చు

ఓలా ఎస్ 1 ఎయిర్ (Ola S1) ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలో, ముఖ్యంగా దేశం లోని పట్టణ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని భారీగా పెంచుతుందని ఓలా ఒక ప్రకటనలో తెలిపింది. అత్యాధునిక టెక్నాలజీ ని ఉపయోగించడం వల్ల ఓలా ఎస్ 1 ఎయిర్, ఓలా ఎస్ 1 ఎయిర్ ప్రో.. రెండు మోడల్స్ కు కూడా అతి తక్కువ నిర్వహణ ఖర్చు ఉంటుందని వెల్లడించింది. శక్తిమంతమైన 3kWh బ్యాటరీ కెపాసిటీ, 125 కిమీల సర్టిఫైడ్ రేంజ్, 90 కిమీ/గం టాప్ స్పీడ్‌తో, Ola S1 ఎయిర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తుందని ధీమా వ్యక్తం చేసింది. భారత్ లో ఎలక్ట్రిక్ వాహన విప్లవాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్కొంది.

ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లు

దేశవ్యాప్తంగా ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లను (EC) ఏర్పాటు చేస్తున్నామని ఓలా సంస్థ వెల్లడించింది. తద్వారా, ఓలా స్కూటర్ల ఉనికి భారత దేశమంతటా విస్తరించాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. కంపెనీ ఇటీవలే తన 750వ ECని ప్రారంభించింది మరియు ఆగస్టు నాటికి 1,000 కేంద్రాలకు విస్తరించాలని యోచిస్తోంది. సుమారు 90% మంది కస్టమర్లు ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్లకు 20 కిలోమీటర్ల లోపలే ఉండడం విశేషం. అత్యాధునిక టెక్నాలజీ మరియు అసమానమైన పనితీరు కలిగిన S1 ప్రో, S1, మరియు S1 ఎయిర్‌లతో కూడిన S1 లైనప్ సొగసైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. కంపెనీ ఇప్పుడు వరుసగా మూడు త్రైమాసికాలకు పైగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో అమ్మకాల చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉంది.

Whats_app_banner