తెలుగు న్యూస్ / ఫోటో /
Ather 450X: ఇండియన్ మార్కెట్లో మరో ఎలక్ట్రిక్ స్కూటర్; ట్రెండీ లుక్స్ తో అదరగొడ్తోంది..
భారతీయ ఎలక్ట్రిక్ స్కూటర్స్ మార్కెట్లో ఆదర్ ను ప్రత్యేక స్థానం ఉంది. ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్స్ సెగ్మెంట్లో మార్కెట్ లీడర్లలో ఒకటిగా ఉంది. లేటెస్ట్ గా మార్కెట్లోకి వచ్చిన ఆదర్ 450 ఎక్స్ (Ather 450X) ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా ఎస్ 1 ప్రొ (Ola S1 Pro), టీవీఎస్ఓ ఐ క్యూబ్ (TVS iQube) లతో పోటీ పడుతోంది.
(1 / 10)
ఆదర్ ఎనర్జీ నుంచి వచ్చిన మరో ఎలక్ట్రిక్ స్కూటర్ ఆదర్ 450 ఎక్స్ (Ather 450X). ఇది ఇండియన్ మార్కెట్లో టాప్ ఎండ్ ఎలక్ట్రిక్ స్కూటర్.
(2 / 10)
సింగిల్ చార్జింగ్ తో 146 కిమీలు వస్తుందని కంపెనీ చెబుతోంది. కానీ వాస్తవ పరిస్థితుల్లో 100 నుంచి 110 కిమీల వరకు వచ్చే అవకాశముంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఎకో, స్మార్ట్ ఎకో, నార్మల్, స్పోర్ట్, వార్ప్ రైడింగ్ మోడ్స్ ఉన్నాయి.
(3 / 10)
ఆదర్ 450 ఎక్స్ (Ather 450X ) గరిష్టంగా గంటకు 90 కిమీల వేగంతో వెళ్లగలదు. జీరో నుంచి 40 కిమీల వేగానికి 3.3 సెకన్లలో చేరుకోగలదు.
(4 / 10)
ఆదర్ 450 ఎక్స్ లో బూట్ స్పేస్ ఎక్కువగానే ఉంది. హెల్మెట్ తో పాటు కొన్ని ఇతర వస్తువులు పెట్టుకోవచ్చు. నైట్ టైమ్ ఉపయోగపడేలా ఎల్ఈడీ లైట్ స్ట్రిప్ కూడా ఉంది.
(5 / 10)
ఈ ఆదర్ 450 ఎక్స్ డిజైన్ పై ఆదర్ ఎనర్జీ (Ather Energy) ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. టర్న్ ఇండికేటర్స్ ను టెయిల్ ల్యాంప్ లో ఇంటిగ్రేట్ చేయడంతో రియర్ లుక్ మరింత ఆకర్షణీయంగా మారింది.
(6 / 10)
In terms of size, the scooter is quite compact in size. So, people with large structures might face some issue. There is a hook behind the front apron that can be used to hang stuff. On the left side, there is the socket for the charger.
(8 / 10)
ఈ ఆదర్ 450 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కు ముందు, వెనుక డిస్క్ బ్రేక్ లను అమర్చారు. ఇందులో ఏబీఎస్ సదుపాయం లేదు. దానికి బదులుగా సీబీఎస్ ఉంది.
(9 / 10)
టచ్ స్క్రీన్ చాలా రెస్పాన్సివ్ గా ఉంది. ఇన్ బిల్డ్ గూగుల్ మాప్స్ రైడర్ కు చాలా హెల్ప్ ఫుల్ గా ఉంది. టైర్ ప్రెజర్ వార్నింగ్ ఫెసిలిటీ కూడా ఉంది.
ఇతర గ్యాలరీలు