Honda electric SUV : హోండా నుంచి కొత్త ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ.. స్టైల్​ అదిరింది!-honda unveils electric suv concept at indonesia motor show ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Honda Electric Suv : హోండా నుంచి కొత్త ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ.. స్టైల్​ అదిరింది!

Honda electric SUV : హోండా నుంచి కొత్త ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ.. స్టైల్​ అదిరింది!

Sharath Chitturi HT Telugu
Aug 14, 2023 09:41 AM IST

Honda electric SUV : సరికొత్త ఎలక్ట్రిక్​ ఎస్​యూవీకి సంబంధించిన కాన్సెప్ట్​ను ప్రదర్శించింది హోండా సంస్థ. ఇది చాలా స్టైలిష్​గా, ఫ్యూచరిస్టిక్​ డిజైన్​ కలిగి ఉంది. ఈ మోడల్​ వివరాలు.. ఇక్కడ తెలుసుకుందాము..

హోండా నుంచి కొత్త ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ.. స్టైల్​ అదిరింది!
హోండా నుంచి కొత్త ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ.. స్టైల్​ అదిరింది!

Honda electric SUV : జపాన్​కు చెందిన దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ హోండా.. సరికొత్త ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని ప్రపంచానికి పరిచయం చేసింది. ఇండోనేషియాలో జరిగిన గోయికిండో ఇండోనేషియా ఇంటర్నేషనల్​ ఆటో షోలో భాగంగా.. ఈ- ఎస్​యూవీ ప్రొటోటైప్​ (కాన్సెప్ట్​) మోడల్​ను ప్రదర్శించింది. ఇది చాలా స్టైలిష్​గా ఉంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

హోండా ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ..

గత కొన్నేళ్లుగా.. ఈవీ సెగ్మెంట్​పై ఫోకస్​ చేసింది హోండా సంస్థ. ఇందులో భాగంగానే.. 2ఏళ్ల క్రితం షాంఘై ఆటో షోలో ఓ ఈ-ఎస్​యూవీ కాన్సెప్ట్​ను ప్రదర్శించింది. తాజాగా ఇండోనేషియాలో ఆవిష్కరించిన ప్రోటోటైప్​ మోడల్​.. ఇదేనని తెలుస్తోంది. దీనిని "హోండా ఎస్​యూవీ ఈ: ప్రోటోటైప్​ కాన్సెప్ట్​" అని సంస్థ పిలుస్తోంది. గ్లోబల్​ ట్రెండ్స్​, కస్టమర్ల అవసరాలకు తగ్గట్టు, ఈకో ఫ్రెండ్లీ వాహనాలను తయారు చేసేందుకు తమ సంస్థ కట్టుబడి ఉందని హోండా సేల్స్​ అండ్​ మార్కెటింగ్​ హెడ్​ యుసక్​ బిల్లి తెలిపారు.

Honda electric SUV concept : ఈ హోండా ఎస్​యూవీ ఈ: ప్రోటోటైప్​లో ఫ్యూచరిస్టిక్​ డిజైన్​ కనిపిస్తోంది. అడ్వాన్స్​డ్​ టెక్నాలజీని కూడా ఉపయోగించినట్టు తెలుస్తోంది. డైనమిక్​ డిజైన్​ స్టైల్​తో కూడిన ఈ కారులో డ్రైవింగ్​ ఎక్స్​పీరియన్స్​ అద్భుతంగా ఉంటుందని సంస్థ చెబుతోంది. ఎఫీషియెంట్​ అడ్వాన్స్​డ్​ బ్యాటరీ టెక్నాలజీతో ఈ ఎస్​యూవీ పర్ఫార్మెన్స్​ కూడా మెరుగ్గా ఉండనుందని చెబుతోంది. ఈ ఎలక్ట్రిక్​ వాహనంలో అడ్వాన్స్​డ్​ టచ్​ స్క్రీన్​, టీఎఫ్​టీ మల్టీ- ఇన్ఫర్మేషన్​ డిస్​ప్లే, ఓటీఏ3 (ఓవర్​ ది ఎయిర్​) ఆధారిత వాయిస్​ రికగ్నీషన్​, హోండా సెన్సింగ్​ సేఫ్టీ ఫీచర్స్​ వంటివి ఉండనున్నాయి.

ఇదీ చూడండి:- Tata Punch EV: టాటా పంచ్ ఈవీపై కీలక అప్ డేట్

హోండా ఈవీ ప్లాన్​లో ఇండియా కూడా ఉంది. ఇక్కడి ఆటోమొబైల్​ మార్కెట్​కు ఉన్న డిమాండ్​ను ఎవరు వదులుకోలేరు! అందుక 2030 నాటికి కనీసం 5 ఈవీలను ఇక్కడ లాంచ్​ చేయాలని సంస్థ ప్లాన్​ చేసింది. ఇక తాజాగా ప్రదర్శించిన ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ కూడా ఇండియాలో అడుగుపెట్టనుంది. అంతేకాదు, కొత్తగా ఇండియాలో లాంచ్​ అయిన ఎలివేట్​ ఎస్​యూవీకి కూడా ఈవీ టచ్​ ఇవ్వనుంది హోండా సంస్థ. మరి ఇవి ఎప్పుడు లాంచ్​ అవుతాయో వేచి చూడాలి.

Honda electric SUV price : ఇండోనేషియా ఆటో షోలో ఈ-ఎస్​యూవీ ప్రోటోటైప్​తో పాటు హోండా ఎన్​- వ్యాన్​ ఈవీ ప్రోటోటైప్​, ఆల్​ న్యూ హోండా సీఆర్​-వీ ఆర్​ఈ ఈ:హెచ్​ఈవీ, హోండా అకార్డ్​ ఈ:హెచ్​ఈవీ, హోండా సీఆర్​-జెడ్​ వంటి మోడల్స్​ను కూడా ప్రదర్శనకు ఉంచుంది.

Whats_app_banner

సంబంధిత కథనం