Honda Elevate : నాలుగు వేరియంట్స్​లో హోండా ఎలివేట్​.. ఫీచర్స్​ ఇవే!-honda elevate to be available in four variants explained ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Honda Elevate : నాలుగు వేరియంట్స్​లో హోండా ఎలివేట్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Elevate : నాలుగు వేరియంట్స్​లో హోండా ఎలివేట్​.. ఫీచర్స్​ ఇవే!

Sharath Chitturi HT Telugu
Aug 01, 2023 11:54 AM IST

Honda Elevate variants : హోండా ఎలివేట్​లో నాలుగు వేరియంట్స్​ ఉంటాయని సమాచారం. వాటి పేర్లు, ఫీచర్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

నాలుగు వేరియంట్లలో హోండా ఎలివేట్​..!
నాలుగు వేరియంట్లలో హోండా ఎలివేట్​..!

Honda Elevate variants : ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో ఎలివేట్​ ఎస్​యూవీని ఇటీవలే ఆవిష్కరించింది హోండా సంస్థ. సెప్టెంబర్​లో ఈ మోడల్​ సేల్స్​ ప్రారంభమవుతాయి. కాగా.. బుకింగ్స్​ ఇప్పటికే మొదలయ్యాయి. రూ. 21వేలు చెల్లించి హోండా ఎలివేట్​ ఎస్​యూవీని బుక్​ చేసుకోవచ్చు. మరోవైపు.. ఈ ఎస్​యూవీ వేరియంట్లకు సంబంధించి తాజాగా ఓ వార్త బయటకొచ్చింది. అదేంటంటే..

ఎస్​యూవీలో నాలుగు వేరియంట్లు..

ఇండియాలో ఎస్​యూవీ సెగ్మెంట్​కు బీభత్సమైన డిమాండ్​ కనిపిస్తోంది. ఆటోమొబైల్​ సంస్థలన్నీ పోటీపడి మరీ వాహనాలను లాంచ్​ చేస్తున్నాయి. అలాంటిది.. హోండాకు ఈ సెగ్మెంట్​లో ఒక్క మోడల్​ కూడా లేదు! గతంలో కొన్నింటిని లాంచ్​ చేసినా, అవి ఇప్పుడు లేవు. అందుకే ఎలివేట్​ ఎస్​యూవీపై చాలా ఆశలు పెట్టుకుంది హోండా సంస్థ. అందుకే చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది.

ఇక ఇప్పుడు హోండా ఎలివేట్​ ఎస్​యూవీలో నాలుగు వేరియంట్లు ఉంటాయని తెలుస్తోంది. అవి ఎస్​వీ, వీ, వీఎక్స్​, జెడ్​ఎక్స్​. హోండా సిటీ సెడాన్​లోనూ ఇలాంటివే ఉంటాయి.

Honda Elevate price : హోండా ఎలివేట్​ ఎస్​వీ:- ఇది ఎస్​యూవీ బేస్​ మోడల్​. ఇందులో ఎల్​ఈడీ ప్రొజెక్టర్​ హెడ్​ల్యాంప్స్​, ఎల్​ఈడీ టెయిల్​లైట్స్​ వస్తాయి. పుష్​ స్టార్ట్​- స్టాప్​ బటన్​, ఆటోమెటిక్​ ఏసీ, బైగ్​ కలర్​ ఫాబ్రిక్​ అప్​హోలిస్ట్రీ వంటివి ఉండొచ్చు. 16 ఇంచ్​ స్టీల్​ వీల్స్​ లభించే అవకాశం ఉంది. టచ్​స్క్రీన్​ ఆప్షన్​ ఉండదని తెలుస్తోంది.

ఇదీ చూడండి:- Honda Elevate vs Kia Seltos : ఎలివేట్​ వర్సెస్​ సెల్టోస్​.. స్పెసిఫికేషన్స్​లో ఏది బెస్ట్​?

వీ వేరియంట్​:- ఇందులో ఎస్​వీ కన్నా కొన్ని ఎక్కువ ఫీచర్స్​ ఉంటాయి. 8 ఇంచ్​ టచ్​స్క్రీన్​, 4 స్పీకర్​ ఆడియో సిస్టెమ్​, యాపిల్​ కార్​ప్లే, ఆండ్రాయిడ్​ ఆటో కనెక్టివిటీ, రివర్స్​ పార్కింగ్​ కెమెరా, మల్టీఫంక్షనల్​ స్టీరింగ్​ వీల్​ వంటివి రావొచ్చు.

Honda Elevate SUV features : వీఎక్స్​ వేరియంట్​:- ఇందులో వీ వేరియంట్​ కన్నా ఎక్కువ ఫీచర్స్​, ఎక్కువ కంఫర్ట్​ లభిస్తుంది. సన్​రూఫ్​, 7 ఇంచ్​ సెమీ డిజిటల్​ క్లస్టర్​, వయర్​లెస్​ ఛార్జర్​, ఆటో ఫోల్డింగ్​ మిర్రర్స్​, లేన్​ వాచ్​ కెమెరా, 6 స్పీకర్​ ఆడియో సెటప్​, 17 ఇంచ్​ అలాయ్​ వీల్స్​, ఎల్​ఈడీ ఫాగ్​ ల్యాంప్స్​ వంటివి వచ్చే అవకాశం ఉంది.

జెడ్​ఎక్స్​ వేరియంట్​:- హోండా ఎలివేట్​ ఎస్​యూవీలో ఇది టాప్​ ఎండ్​ మోడల్​. ఇందులో అనేక ఫీచర్స్​ ఉండనున్నాయి. 10.25 ఇంచ్​ టచ్​స్క్రీన్​, 8 స్పీకర్​ ఆడియో సిస్టెమ్​, లెథరెట్​ బ్రౌన్​ అప్​హోలిస్ట్రీ, సాఫ్ట్​ టచ్​ డాష్​బోర్డ్​, ఆటో డిమ్మింగ్​ డే/ నైట్​ మిర్రర్​ వంటివి వస్తాయని తెలుస్తోంది.

ధర ఎంత ఉండొచ్చు..?

Honda Elevate price : ఈ కొత్త వెహికిల్​లో 1.5 లీటర్​, 4 సిలిండర్​ నేచురల్లీ ఆస్పిరేటెడ్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉండనుంది. 6 స్పీడ్​ మేన్యువల్​- 7 స్పీడ్​ సీవీటీ గేర్​బాక్స్​ ఆప్షన్​ లభిస్తుంది. ఈ ఇంజిన్​ 119 బీహెచ్​పీ పవర్​ను, 145 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

ఈ హోండా కొత్త ఎస్​యూవీ క్లిక్​ అవ్వాలంటే, దీని ధర కీలకంగా మారనుంది! ఎలివేట్​ ధరకు సంబంధించిన వివరాలను సంస్థ ఇంకా వెల్లడించలేదు. అయితే.. సరసమైన ధరకు అందుబాటులో వస్తే మాత్రం.. కియా సెల్టోస్​, హ్యుందాయ్​ క్రేటా, వోక్స్​వ్యాగన్​ టైగున్​, స్కోడా కుషాక్​, మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా, ఎంజీ ఆస్టర్​, సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​ వంటి మోడల్స్​కు గట్టి పోటీ తప్పదని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం