Honda Elevate vs Kia Seltos : ఎలివేట్ వర్సెస్ సెల్టోస్.. స్పెసిఫికేషన్స్‌లో ఏది బెస్ట్?
Honda Elevate vs Kia Seltos : హోండా ఇటీవలే ఆవిష్కరించిన ఎలివేట్‌ను కియాకు బెస్ట్ సెల్లింగ్‌గా ఉన్న సెల్టోస్ మోడల్ స్పెసిఫికేషన్స్‌తో పోల్చి.. ఈ రెండింటిలో ఏది బెస్ట్? అన్నది ఇక్కడ తెలుసుకుందాము. వివరాల్లోకి వెళితే..
Honda Elevate vs Kia Seltos : 'హోండా ఎలివేట్'.. ఆటోమొబైల్ రంగంలో ఈ ఎస్యూవీ ఇప్పుడు హాట్ టాపిక్. ఇండియా మార్కెట్లో సేల్స్‌ను పెంచుకునేందుకు ఎలివేట్‌పై భారీగా ఆశలు పెట్టుకుంది హోండా. కాగా.. ఇప్పటికే మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉన్న కియా సెల్టోస్‌కు ఈ ఎస్యూవీ గట్టిపోటీనిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటి స్పెసిఫికేషన్స్, ఇంజిన్ ఆప్షన్స్, ధరలను పోల్చి.. ఏది బెస్ట్ అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
హోండా ఎలివేట్ వర్సెస్ కియా సెల్టోస్- డైమెన్షన్స్..
హోండా కొత్త ఎస్యూవీ పొడవు 4,312 ఎంఎం. వెడల్పు 1,790 ఎంఎం. ఎత్తు 1,650 ఎంఎం. వీల్‌బేస్ 2,650 ఎంఎం. గ్రౌండ్ క్లియరెన్స్ 220 ఎంఎం. ఎలివేట్‌లో 458 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తోంది.
మరోవైపు కియా సెల్టోస్ పొడవు 4,315 ఎంఎం. వెడల్పు 1,800 ఎంఎం. ఎత్తు 1,645 ఎంఎం. వీల్‌బేస్ 2,610 ఎంఎం. గ్రౌండ్ క్లియరెన్స్ 190ఎంఎం. ఈ ఎస్‌యూవీలో 433 లీటర్ల బూట్ స్పేస్ వస్తోంది.
Honda Elevate price in India : డైమెన్షన్స్ పరంగా.. హోండా ఎలివేట్ కన్నా కియా సెల్టోస్ కాస్త పొడవు ఎక్కువ అని, ఎత్తు తక్కువ అని అర్థమవుతుంది. వీల్‌బేస్, గ్రౌండ్ క్లియరెన్స్ విషయంలో హోండా వాహనం స్పేషియస్గా ఉంటుంది.
ఇదీ చూడండి:- కియా సెల్టోస్ సరికొత్త మైలురాయి.. 4ఏళ్లల్లో 5లక్షల సేల్స్!
ఈ వాహనాల్లో ఏ ఇంజిన్లు ఉన్నాయంటే..!
హోండా ఎలివేట్ ఎస్‌యూవీలో 1.5 లీటర్ డీఓహెచ్సీ ఐ-వీటెక్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. 6 స్పీడ్ మేన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు సీవీటీ ఆప్షన్ లభిస్తోంది. ఈ ఇంజిన్.. 121 హెచ్‌పీ పవర్‌ను, 145 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. హోండా సిటీలోనూ ఇదే ఇంజిన్‌ను వినియోగిస్తున్నారు. కాగా కొంతకాలం తర్వాత హైబ్రీడ్ వేరియంట్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Kia Seltos on road price in Hyderabad : ఇక కియా సెల్టోస్‌లో 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది.. 115 హెచ్‌పీ పవర్‌ను, 144 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ గేర్‌బాక్స్, సీవీటీ ఆప్షన్ ఇందులోనూ ఉంది.
ధరలు ఎంతంటే..
హోండా ఎలివేట్ బుకింగ్స్ జులైలో మొదలవుతాయి. ధరకు సంబంధించిన వివరాలను సంస్థ ఇంకా ప్రకటించలేదు. కాగా.. పండుగ సీజన్లో దీనిని లాంచ్ చేయాలని సంస్థ భావిస్తోంది.
మరోవైపు కియా సెల్టోస్ ఎక్స్‌షోరూం ధర రూ. 10.89లక్షలు- రూ. 19.65లక్షల మధ్యలో ఉంది.
సంబంధిత కథనం