Kia cars sales: కియా అమ్మకాల్లో ఈ కారుదే హవా..
మే నెల అమ్మకాల్లో సౌత్ కొరియన్ ఆటో కంపెనీ కియా (Kia) మెరుగైన ఫలితాలను సాధించింది. మే నెలలో మొత్తం 18,766 కార్లను అమ్మగలిగింది. ఇవి కాకుండా, మరో 6,004 కార్లను ఎగుమతి చేసింది.
మే నెల అమ్మకాల్లో దక్షిణ కొరియాకు చెందిన వాహన తయారీ సంస్థ కియా (Kia) మెరుగైన ఫలితాలను సాధించింది. మే నెలలో మొత్తం 18,766 కార్లను అమ్మగలిగింది. ఇవి కాకుండా, మరో 6,004 కార్లను ఎగుమతి చేసింది.
3 percent growth: 3 శాతం వృద్ధి
గత సంవత్సరం మే నెల అమ్మకాలతో పోలిస్తే, ఈ సంవత్సరం మే నెల అమ్మకాల్లో 3% వృద్ధి నమోదైందని కియా శుక్రవారం వెల్లడించింది. గత సంవత్సరం మే నెలలో మొత్తం 24.079 కియా కార్లు అమ్ముడవగా, ఈ సంవత్సరం మే నెలలో 24,770 కియా కార్లు అమ్ముడయ్యాయి. ఈ మే నెలలో దేశీయంగా 18,766 కార్లను అమ్మిన కియా సంస్థ, మరో 6,004 కార్లను విదేశాలకు ఎగుమతి చేసింది.
Sonet tops the list: సొనెట్ దే హవా..
ఈ మే నెలలో కియా (Kia) ఎంట్రీ లెవెల్ ఎస్యూవీ సోనెట్ (Sonet) అమ్మకాల్లో మెరుగైన ఫలితాలను సాధించింది. ప్రీమియం మోడల్స్ అయిన సెల్టోస్ (Celtos), కేరెన్స్ (Carens) ను అధిగమించి మే నెలలో కియా సోనెట్ (Sonet) కార్లు మొత్తం 8,251 యూనిట్లు అమ్ముడయ్యాయి. సెల్టోస్ (Celtos) కార్లు 4.065 యూనిట్లు అమ్ముడయ్యాయి. కేరెన్స్ (Carens) కార్లు 6.367 యూనిట్లు అమ్ముడయ్యాయి. కియా ఫ్లాగ్ షిప్ ఎలక్ట్రిక్ కార్ ఈవీ 6 (EV6) ఈ మే నెలలో మొత్తం 82 కార్లు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం అన్ని కియా మోడల్స్ పై 12 వారాల వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది.
Sonet Aurochs: కియా సోనెట్ ఆరాక్స్
ఇటీవల కియా సోనెట్ మోడల్ లో ఆరాక్స్ (Sonet Aurochs) ఎడిషన్ ను లాంచ్ చేసింది. సోనెట్ హెచ్ టీఎక్స్ (Sonet HTX) మోడల్ కు కొన్ని మార్పులు చేసి ఈ సోనెట్ ఆరాక్స్ (Sonet Aurochs) ను రూపొందించారు. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 11.85 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో ఆరాక్స్ ఫ్రంట్, సైడ్, రియర్ స్కిడ్ ప్లేట్స్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ను అమర్చారు. ఇది గ్రేవిటీ గ్రే, అరోరా బ్లాక్ పెరల్, స్పార్క్లింగ్ సిల్వర్, గేషియర్ వైట్ పెరల్ కలర్స్ లో లభిస్తుంది.