Honda Elevate bookings : హోండా ఎలివేట్ బుకింగ్స్ షురూ.. లాంచ్ ఎప్పుడంటే!
Honda Elevate bookings : హోండా ఎలివేట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. సంస్థకు చెందిన డీలర్షిప్ షోరూమ్స్ లేదా ఆన్లైన్లో ఎలివేట్‌ను బుక్ చేసుకోవచ్చు.
Honda Elevate bookings : ఫ్లాగ్షిప్ ఎస్యూవీ ఎలివేట్‌కు సంబంధించి బుకింగ్స్‌ను తాజాగా ప్రారంభించింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హోండా. దేశవ్యాప్తంగా ఉన్న ఆథరైజ్డ్ డీలర్షిప్షోరూమ్స్లో సోమవారం నుంచి ఎలివేట్‌ను బుక్ చేసుకోవచ్చని ప్రకటించింది. ఆన్లైన్ ప్లాట్ఫార్మ్ 'హోండా ఫ్రం హోం'లోనూ ఈ ఎస్‌యూవీని బుక్ చేసుకునే ఆప్షన్ ఇచ్చింది.
ఇక రానున్న పండుగ సీజన్లో, అంటే సెప్టెంబర్‌లో హోండా ఎలివేట్ లాంచ్కానుంది. సెప్టెంబర్‌లో ఎలివేట్ డెలివరీలు మొదలవుతాయని సంస్థ వెల్లడించింది.
ఆ ఎస్‌యూవీలకు పోటీగా..ఎలివేట్!
గత నెలలో ఇండియా నుంచి ఎలివేట్ ఎస్‌యూవీని అంతర్జాతీయంగా ఆవిష్కరించింది హోండా సంస్థ. ఇండియాలోనే ఇది మొదటిగా లాంచ్కానుంది. 2030 వరకు 5 ఎస్‌యూవీలను ఇండియాలో లాంచ్ చేయాలని ప్లాన్ చేసింది ఈ ఆటోమొబైల్ సంస్థ. ఈక్రమంలోనే మొదటిగా ఎలివేట్‌ను తీసుకొస్తోంది. వాస్తవానికి.. ఇండియాలో ఎస్యూవీ సెగ్మెంట్ శక్తివంతంగా ఉన్నప్పటికీ, హోండా పోర్ట్‌ఫోలియోలో ఒక్క వెహికిల్ కూడా లేదు. డబ్ల్యూఆర్-వీ, బీఆర్-వీ మోడల్స్‌ను నిలిపివేసింది. అందుకే ఎలివేట్‌పై భారీ ఆశలు పెట్టుకుంది ఈ సంస్థ. ఎలివేట్‌తో సంస్థ ఆదాయం పెంచుకోవాలని భావిస్తోంది.
Honda Elevate SUV : అందుకే హోండా ఎలివేట్ ఎస్‌యూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. లాంచ్ తర్వాత ఈ మోడల్.. హ్యుందాయ్ క్రేటా, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, కియా సెల్టోస్ వంటి బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీలకు గట్టిపోటీనిస్తుందని మర్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇదీ చూడండి:- రేపే కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాాంచ్.. అదిరిపోతుందంతే!
హోండా ఎలివేట్ హైలైట్స్ ఇవే..
హోండా ఎలివేట్ ఎస్యూవీ పొడవు 4,312ఎంఎం. వెడల్పు 1,790ఎంఎం. ఎత్తు 1,650ఎంఎం. ఈ డైమెన్షన్స్‌తో ఎస్యూవీ కంఫ్టర్ చాలా మెరుగ్గా ఉంటుందని సంస్థ చెబుతోంది. రోడ్ ప్రెజెన్స్ కూడా బలంగా ఉంటుందని అంచనా వేస్తోంది.
ఇక ఫీచర్స్ విషయానికొస్తే.. ఈ వెహికిల్‌లో 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, 7 ఇంచ్ హెచ్డీ కలర్ టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వయర్లెస్ స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్ టెక్నాలజీ, హోండా కనెక్ట్ వంటివి లభిస్తున్నాయి. జియో ఫెన్సింగ్, ఎమర్జెన్సీ అసిస్టెన్స్ వంటివి కూడా వస్తున్నాయి.
Honda Elevate price in India : హోండా ఎలివేట్ ఎస్‌యూవీలో 1.5 లీటర్ డీఓహెచ్సీ ఐ- వీటెక్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 121 పీఎస్ పవర్‌ను, 145.1 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ మేనయువల్ గేర్‌బాక్స్‌తో పాటు అడ్వాన్స్డ్ సీవీటీ ట్రాన్స్మిషన్ లభిస్తోంది. సెల్ఫ్ ఛార్జింగ్, డ్యూయెల్ మోటార్ ఈ-సీవీటీ టెక్నాలజీతో కూడిన స్ట్రాంగ్ హైబ్రీడ్ వేరియంట్ కూడా ఈ ఎస్‌యూవీకి లభిస్తుందని తెలుస్తోంది. ఇది 126 పీఎస్ పవర్‌ను, 253ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
ఇండియాలో ఈ ఎలివేట్ ఎస్యూవీ ధరకు సంబంధించిన వివరాలు లాంచ్ సమయంలో తెలుస్తాయి. అయితే దీని ఎక్స్‌షోరూం ధర రూ. 10.50లక్షలు- రూ. 20లక్షల మధ్యలో ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇండియాలో మరో మూడేళ్లల్లో ఒక ఫుల్లీ ఎలక్ట్రిక్ కారును సైతం లాంచ్ చేయనున్నట్టు హోండా ప్రకటించింది. ఎలివేట్ ఎస్యూవీ ఈవెంట్లో ఈ విషయాన్ని వెల్లడించింది.
సంబంధిత కథనం