తెలుగు న్యూస్ / ఫోటో /
రేపే కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాాంచ్.. అదిరిపోతుందంతే!
- భారీ అంచనాల మధ్య సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ను మంగళవారం లాంచ్ చేయనుంది కియా మోటార్స్. దేశంలో కియాకు బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉన్న సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
- భారీ అంచనాల మధ్య సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ను మంగళవారం లాంచ్ చేయనుంది కియా మోటార్స్. దేశంలో కియాకు బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉన్న సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
(1 / 5)
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రూ. 25వేల రీఫండెబుల్ టోకెన్ అమౌంట్‌తో సంస్థకు చెందిన డీలర్షిప్ షోరూమ్స్‌లో ఈ ఎస్‌యూవీని బుక్ చేసుకోవచ్చు.
(2 / 5)
2019లో సెల్టోస్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది కియా. అప్పటి నుంచి సంస్థకు బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా కొనసాగుతోంది. ఇటీవలే.. 5లక్షల సేల్స్ మార్క్‌ను సైతం అందుకుంది. ఇంకా చెప్పాలంటే.. ఇండియాలో సంస్థ సేల్స్‌లో సెల్టోస్ వాటా 55శాతం ఉందడం విశేషం.
(3 / 5)
ఇక 2023 కియా సెల్టోస్ లుక్ మరింత బోల్డ్‌గా మారింది. ఇందులో స్కల్ప్టెడ్ బానెట్, క్రోమ్ సరౌండెడ్ టైగర్ నోస్ గ్రిల్, ఇంటిగ్రేడెట్ డీఆర్ఎల్స్తో కూడిన స్లీక్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, రివైజ్డ్ బంపర్స్, సిల్వర్డ్ స్కిడ్ ప్లేట్స్, రూఫ్ రెయిల్స్, ఓఆర్వీఎంలు, ఫ్లేర్డ్ వీల్ ఆర్చీస్, డిజైనర్ డ్యూయెల్- టోన్ అలాయ్ వీల్స్ వంటి ప్రీమియం ఫీచర్స్ ఉన్నాయి.
(4 / 5)
ఈ ఎస్‌యూవీలోని 5 సీటర్ కేబిన్‌లో ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రెంట్ సీట్స్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్, డ్యూయెల్ 10.25 ఇంచ్ స్క్రీన్ సెటప్ వంటివి వస్తున్నాయి. ఇప్పటి వరకు టాప్ ఎండ్ వేరియంట్లో కూడా లేని పానోరమిక్ సన్‌రూఫ్‌ను ఈసారి తీసుకోస్తోంది సంస్థ.
(5 / 5)
2023 కియా సెల్టోస్ ఎస్‌యూవీలో సరికొత్త 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ సీఆర్డీఐ డీజిల్ ఇంజిన్ ఉండే అవకాశం ఉంది. ఇవి.. 160 హెచ్‌పీ పవర్- 253 ఎన్ఎం టార్క్, 113.4 హెచ్‌పీ పవర్- 244 ఎన్ఎం టార్క్, 113.4 హెచ్‌పీ పవర్- 250 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తాయి.
ఇతర గ్యాలరీలు