Hero MotoCorp sales: ఒక్క నెలలోనే 5 లక్షలకు పైగా బైక్స్ సేల్; హీరో మోటోకార్ప్ రికార్డ్
Hero MotoCorp sales: ఒక్క అక్టోబర్ నెలలోనే 5 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలను అమ్మి హీరో మోటో కార్ప్ మరోసారి రికార్డు సృష్టించింది. అక్టోబర్ నెలలో దేశీయంగా హీరో మోటో కార్ప్ మొత్తం 5,59,766 బైక్స్ ను సేల్ చేసింది.
Hero MotoCorp sales: ద్విచక్ర వాహనాలను ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఉత్పత్తి చేస్తున్న సంస్థ హీరో మోటో కార్ప్. ఈ సంస్థ ఈ అక్టోబర్ నెలలోనూ రికార్డు స్థాయిలో టూ వీలర్స్ అమ్మకాలు జరిపింది. గత సంవత్సరం అక్టోబర్ లో ఈ సంస్థ మొత్తం 4,54,582 యూనిట్ల ద్వి చక్ర వాహనాలను అమ్మగా.. ఈ సంవత్సరం అక్టోబర్ లో ఎగుమతులు కూడా కలుపుకుని, మొత్తం 5,74,930 బైక్స్ ను సేల్ చేసింది. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 26% అధికం.
రికార్డు సేల్స్
ఈ అక్టోబర్ నెలలో దేశీయంగా హీరో మోటో కార్ప్ మొత్తం 5,59,766 యూనిట్లను అమ్మింది. గత సంవత్సరం అక్టబర్ లో ఈ సంఖ్య 4,42,825. అలాగే, ఈ అక్టోబర్ లో సంస్థ మొత్తం 15,164 వాహనాలను విదేశాలకు ఎగుమతి చేసింది. 2022 అక్టోబర్ లో ఈ ఎగుమతుల సంఖ్య 11,757 మాత్రమే. ఇటీవల హీరో మోటోకార్ప్ హార్లీ డేవిడ్సన్ భాగస్వామ్యంతో ఎక్స్ 440 సేల్స్ ను కూడా ప్రారంభించింది. ఇప్పటివరకు ఆ మోడల్ బైక్స్ 1000 యూనిట్లను అమ్మగలిగింది.
కరిష్మా ఎక్స్ఎంఆర్
కరిష్మా ఎక్స్ఎంఆర్ బైక్ డెలివరీలను కూడా హీరో మోటో కార్ప్ ప్రారంభించింది. ఈ బైక్ కు ఇప్పటివరకు 13 వేల బుకింగ్స్ పూర్తి అయ్యాయి. ఈ బైక్ ఎక్స్ షో రూమ్ ధర లాంచ్ సమయంలో రూ. 1,72,900 గా ఉండగా, ఇప్పుడు ఆ ధర ను రూ. 1,79,900 కి పెంచారు.