Hero XPulse 400 : హీరో మోటోకార్ప్​ నుంచి కొత్త బైక్​.. ఎక్స్​పల్స్​ 400 విశేషాలివే!-hero xpulse 400 likely to be revealed soon in india check details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hero Xpulse 400 : హీరో మోటోకార్ప్​ నుంచి కొత్త బైక్​.. ఎక్స్​పల్స్​ 400 విశేషాలివే!

Hero XPulse 400 : హీరో మోటోకార్ప్​ నుంచి కొత్త బైక్​.. ఎక్స్​పల్స్​ 400 విశేషాలివే!

Sharath Chitturi HT Telugu
Oct 28, 2023 07:50 AM IST

Hero XPulse 400 : హీరో ఎక్స్​పల్స్​ 400 బైక్​ని సంస్థ త్వరలో రివీల్​ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఆ వివరాలు..

హీరో మోటోకార్ప్​ నుంచి కొత్త బైక్​..
హీరో మోటోకార్ప్​ నుంచి కొత్త బైక్​.. (Representative image)

Hero XPulse 400 : దేశీయ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ హీరో మోటోకార్ప్​ నుంచి ఓ కొత్త బైక్​.. లాంచ్​కు సిద్ధమవుతోందని తెలుస్తోంది. దీని పేరు హీరో ఎక్స్​పల్స్​ 400. ఈ మోడల్​ని సంస్థ త్వరలోనే రివీల్​ చేస్తుందని తెలుస్తోంది. ఈ బైక్​కి సంబంధించిన టెస్ట్​ డ్రైవర్​ ఇటీవలే జరిగినట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మోడల్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

హీరో ఎక్స్​పల్స్​ 400 హైలైట్స్​..

హీరో ఎక్స్​పల్స్​ 400 అనేది ఒక అడ్వెంచర్​ బైక్​! ఇందులో 350సీసీ- 400సీసీ, సింగిల్​ సిలిండర్​, లిక్విడ్​ కూల్డ్​ ఇంజిన్​ ఉండొచ్చు. ఈ ఇంజిన్​.. 35 హెచ్​పీ- హెచ్​పీ పవర్​ను జనరేట్​ చేస్తుంది. మిడ్​ రేంజ్​ టార్క్​ ఔట్​పుట్​ లభించొచ్చు.

Hero XPulse 400 launch : టెస్ట్​ డ్రైవ్​లో కనిపించిన బైక్​లో ఫ్రెంట్​ సైడ్​ ఇన్వర్టెడ్​ ఫోర్క్స్​, రేర్​లో ప్రీలోడ్​- అడ్జెస్టెబుల్​ మోనో షాక్​ అబ్సార్బర్​లు ఉన్నాయి. రగ్​డ్​ స్పోక్​డ్​ వీల్స్​, ట్యూబ్​ టైప్​ టైర్స్​ ఇందులో ఉంటాయని తెలుస్తోంది.

హీరో ఎక్స్​పల్స్​ 400 లాంచ్​ ఎప్పుడు..?

అనేక కారణాలతో.. ఈ హీరో ఎక్స్​పల్స్​ 400 ప్రాజెక్ట్​ ఆలస్యమవుతూ వచ్చింది. ఇటీవలి కాలంలో కాస్త ఊపందుకుంది. ఇక కొన్ని నెలల తర్వాత సంస్థ ఈ మోడల్​ని రివీల్​ చేసి, 2024 చివరి నాటికి లాంచ్​ చేయొచ్చు అని టాక్​ నడుస్తోంది.

ఇక ఈ కొత్త బైక్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలపై ప్రస్తుతం క్లారిటీ లేదు. రానున్న రోజుల్లో ఓ స్పష్టత వస్తుంది.

Hero XPulse 400 features : ఇది ఇలా ఉండగా.. ఎక్స్​పల్స్​ 210 బైక్​ని వచ్చే ఏడాది లాంచ్​ చేసేందుకు హీరో మోటోకార్ప్​ ఏర్పాట్లు చేసుకుంటోదట. ఇందులో హీరో కరిష్మా ఎక్స్​ఎంఆర్​లో ఉన్న 210సీసీ ఇంజిన్​ ఉంటుందని తెలుస్తోంది.

ఫెస్టివల్​ ఆఫర్స్​ చూశారా..?

పండుగ సీజన్​ నేపథ్యంలో కస్టమర్లని ఆకర్షించి, సేల్స్​ని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి ఆటోమొబైల్​ సంస్థలు. తాజాగా ఈ జాబితాలోకి దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ హీరో మోటోకార్ప్​ కూడా చేరింది. కస్టమర్ల కోసం గిఫ్ట్​ (గ్రాండ్​ ఫెస్టివల్​ ఆఫ్​ ట్రస్ట్​) అనే క్యాంపైన్​ను ప్రారంభించింది. ఇందులో భాగంగా.. తమ 2 వీలర్​ పోర్ట్​ఫోలియోలోని వాహనాలపై స్పెషల్​ డిస్కౌంట్స్​, బెనిఫిట్స్​, ఫైనాన్షియల్​ స్కీమ్స్​ని అందిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం