Hero Splendor Plus : ఈ బైక్​ని ఇప్పుడు కొంటే.. 3 నెలల వరకు డబ్బులు కట్టక్కర్లేదు!-2023 hero splendor plus offers available this festive season ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hero Splendor Plus : ఈ బైక్​ని ఇప్పుడు కొంటే.. 3 నెలల వరకు డబ్బులు కట్టక్కర్లేదు!

Hero Splendor Plus : ఈ బైక్​ని ఇప్పుడు కొంటే.. 3 నెలల వరకు డబ్బులు కట్టక్కర్లేదు!

Sharath Chitturi HT Telugu
Oct 20, 2023 11:13 AM IST

2023 Hero Splendor Plus : పండుగ సీజన్​ నేపథ్యంలో.. హీరో స్ల్పెండర్​ ప్లస్​ బైక్​పై అదిరిపోయే ఆఫర్​ని ఇస్తోంది ఆటోమొబైల్​ సంస్థ. ఆ వివరాలు..

ఈ హీరో 2 వీలర్​పై అదిరిపోయే ఫెస్టివల్​ ఆఫర్స్​..!
ఈ హీరో 2 వీలర్​పై అదిరిపోయే ఫెస్టివల్​ ఆఫర్స్​..!

2023 Hero Splendor Plus : పండుగ సీజన్​ నేపథ్యంలో కస్టమర్లని ఆకర్షించి, సేల్స్​ని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి ఆటోమొబైల్​ సంస్థలు. తాజాగా ఈ జాబితాలోకి దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ హీరో మోటోకార్ప్​ కూడా చేరింది. కస్టమర్ల కోసం గిఫ్ట్​ (గ్రాండ్​ ఫెస్టివల్​ ఆఫ్​ ట్రస్ట్​) అనే క్యాంపైన్​ను ప్రారంభించింది. ఇందులో భాగంగా.. తమ 2 వీలర్​ పోర్ట్​ఫోలియోలోని వాహనాలపై స్పెషల్​ డిస్కౌంట్స్​, బెనిఫిట్స్​, ఫైనాన్షియల్​ స్కీమ్స్​ని అందిస్తోంది. ఆ వివరాలు..

హీరో మోటోకార్ప్​ ఫెస్టివల్​ ఆఫర్స్​..

హీరో స్ల్పెండర్​ ప్లస్​ బైక్​.. సంస్థకు ఉన్న బెస్ట్​ సెల్లింగ్​ మోడల్స్​లో ఒకటి. ఈ 2 వీలర్​పై.. 'బై నౌ పే ఇన్​ 2024' ఆఫర్​ ఇస్తోంది. అంటే.. ఈ వెహికిల్​ని ఈ పండుగ సీజన్​లో కొన్నప్పటికీ, ఈఎంఐలు మాత్రం 2024 నుంచే మొదలవుతాయి!

అంతేకాకుండా.. ఈ వెహికిల్​కి 6.99శాతం తక్కువ వడ్డీతో లోన్​ కూడా ఇస్తోంది ఆటోమొబైల్​ సంస్థ. అదే సమయంలో రూ. 3వేల వరకు ఎక్స్​ఛేంజ్​ బోనస్​ కూడా అందిస్తోంది. అర్హత కలిగిన కస్టమర్లు.. ఆధార్​ ఆధారిత లోన్​ స్కీమ్​, క్యాష్​ ఈఎంఐ ఆప్షన్స్​ పొందొచ్చు.

Hero motors festival offers : 100-110 సీసీ సెగ్మెంట్​లో ఈ హీరో స్ల్పెండర్​ ప్లస్​కు ఇంకా మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ఇందులో 97.2 సీసీ, ఎయిర్​-కూల్డ్​, 4 స్ట్రోక్​, ఫ్యూయెల్​ ఇంజెక్టెడ్​, సింగిల్​ సిలిండర్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది.. 7.91 హెచ్​పీ పవర్​ను, 8.05 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 4 స్పీడ్​ గేర్​బాక్స్​ ఆప్షన్​ ఉంది.

ఇక ఫీచర్స్​ విషయనికొస్తే.. ఈ బైక్​లో ట్యూబ్​లెస్​ టైర్స్​తో కూడిన 18 ఇంచ్​ అలాయ్​ వీల్స్​, హాలోజెన్​ హెడ్​ల్యాంప్​, ఎలక్ట్రిక్​ సెల్ఫ్​ స్టార్ట్​, కిక్​ స్టార్టర్​, 9.8 లీటర్​ ఫ్యూయెల్​ ట్యాంక్​, ఫ్యూయెల్​ ఎఫీషియెన్సీ కోసం ఐ3ఎస్​ టెక్నాలజీ, సైడ్​ స్టాండ్​ ఇండికేటర్​ వంటివి వస్తున్నాయి. దీని బరువు 112 కేజీలు. గ్రౌండ్​ క్లియరెన్స్​ 165ఎంఎం.

Discounts on bikes in October : మొత్తం మీద 14 రంగుల్లో ఈ హీరో స్ల్పెండర్​ ప్లస్​ అందుబాటులో ఉంది. వీటిల్లో మోనోటోన్​, డ్యూయెల్​టోన్​ ఆప్షన్స్​ కూడా ఉన్నాయి.

ఈ బైక్​లో మొత్తం నాలుగు వేరియంట్లు ఉన్నాయి. ఇండియలో వీటి ఎక్స్​షోరూం ధరలు రూ. 75,141 నుంచి రూ. 77.986 మధ్యలో ఉంటాయి.

ఓలా భారత్​ ఈవీ ఫెస్ట్​..

Ola Bharat EV fest : పండుగ సీజన్​లో కస్టమర్లకు మరింత దగ్గరయ్యేందుకు ప్లాన్​ చేస్తోంది ఓలా ఎలక్ట్రిక్​. "భారత్​ ఈవీ ఫెస్ట్​" పేరుతో.. ఆఫర్స్​, డిస్కౌంట్స్​, బెనిఫిట్స్​ వంటివి అందిస్తోంది.

బ్యాటరీ వారెంటీ నుంచి ఎక్స్​ఛేంజ్​ వరకు పలు ఆకర్షణీయమైన ప్రోగ్రామ్స్​ని నిర్వహిస్తోంది ఓలా ఎలక్ట్రిక్​. అంతేకాకుండా.. తమ ఎలక్ట్రిక్​ స్కూటర్లను టెస్ట్​ డ్రైవ్​ చేసిన వారికి ప్రైజ్​లు కూడా ఇస్తోంది. రిఫరల్​ బెనిఫిట్స్​ని కూడా అందిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సంబంధిత కథనం