Ola electric : ఓలా ఎలక్ట్రిక్ ‘భారత్ ఈవీ ఫెస్ట్’.. అదిరిపోయే ఆఫర్స్, డిస్కౌంట్స్..!
Ola electric : భారత్ ఈవీ ఫెస్ట్‌ను లాంచ్ చేసింది ఓలా ఎలక్ట్రిక్. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా.. క్రేజీ ఆఫర్స్, బెనిఫిట్స్ ఇస్తోంది. అవేంటంటే..
Bharat EV fest OLA : పండుగ సీజన్లో కస్టమర్లకు మరింత దగ్గరయ్యేందుకు ప్లాన్ చేస్తోంది ఓలా ఎలక్ట్రిక్. "భారత్ ఈవీ ఫెస్ట్" పేరుతో.. ఆఫర్స్, డిస్కౌంట్స్, బెనిఫిట్స్ వంటివి అందిస్తోంది. ఈ నేపథ్యంలో వీటిపై ఓ లుక్కేద్దాము..
భారత్ ఈవీ ఫెస్ట్..
ఈ ఫెస్ట్.. ఇండియావ్యాప్తంగా సోమవారమే ప్రారంభమైంది. బ్యాటరీ వారెంటీ నుంచి ఎక్స్ఛేంజ్ వరకు పలు ఆకర్షణీయమైన ప్రోగ్రామ్స్‌ని నిర్వహిస్తోంది ఓలా ఎలక్ట్రిక్. అంతేకాకుండా.. తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను టెస్ట్ డ్రైవ్ చేసిన వారికి ప్రైజ్‌లు కూడా ఇస్తోంది. రిఫరల్ బెనిఫిట్స్‌ని కూడా అందిస్తోంది.
ఈ భారత్ ఈవీ ఫెస్ట్‌లో బ్యాటరీలపై 5ఏళ్ల వరకు వారెంటీ ఇస్తోంది ఓలా ఎలక్ట్రిక్. ఆల్ న్యూ ఎస్1 ప్రోపై 5ఏళ్ల ఎక్స్టెండెడ్ వారెంటీని కూడా అందిస్తోంది. ఇక ఎస్1 ఎయిర్‌పై 5ఏళ్ల ఎక్స్టెండెడ్ వారెంటీ మీద 50శాతం డిస్కౌంట్ని కూడా ఇస్తోంది. బ్యాటరీలపై ఉండే వారెంటీని కూడా 50శాతం డిస్కౌంట్లో అందిస్తోంది.
సాధారణంగా అయితే.. సంస్థకు చెందిన ఈవీ బ్యాటరీలపై కేవలం 3ఏళ్ల వరకే వారెంటీలు ఇస్తుంది ఓలా. కానీ ఈసారి దానిని 5ఏళ్లకు పెంచింది.
ఇదీ చూడండి:- Car paint protection tips : మీ కారు పెయింట్‌ను పదిలంగా చూసుకోండి ఇలా..!
ఇతర ఆఫర్స్, డిస్కౌంట్స్ ఇలా..
Discounts on Ola Electric : వెహికిల్ ఎక్స్ఛేంజ్పై రూ. 10వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది సంస్థ. పెట్రోల్ స్కూటర్‌ను ఇచ్చి, ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేసుకోవచ్చని సంస్థ చెబుతోంది. ఓలా ఎస్1 ఈ-స్కూటర్ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 85,099గా ఉంది.
ఇక తమ ఈవీలను టెస్ట్ డ్రైవ్ చేసిన వారికి లక్కీ ప్రైజ్‌లు కూడా ఇస్తోంది సంస్థ. అదే సమయంలో.. ఎవరికైనా ఎస్1 మోడల్ని రిఫర్ చేస్తే.. మీరు రివార్డులు కూడా పొందొచ్చు. ఇక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై కొన్ని ఎంపిక చేసిన బ్యాంక్ కార్డుల మీద రూ. 7,500 వరకు తగ్గింపు పొందొచ్చు.
ఈ నెల వరకు ఈ ఆఫర్స్ ఉంటాయి. మరి వచ్చే నెలలోనూ ఉంటాయా? లేదా? అన్న విషయంపై స్పష్టత లేదు.
Ola Electric latest news : ఇక ఇతర విషయానికొస్తే.. ఎస్1 ప్రో జెన్2 ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలను ఇటీవలే ప్రారంభించింది ఓలా ఎలక్ట్రిక్. ఇది ఆగస్టులో లాంచ్ అయ్యింది. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 1.48లక్షలు. 100కుపైగా నగరాల్లో ప్రస్తుతం ఈ మోడల్ డెలివరీలు జరుగుతున్నాయి.
సంబంధిత కథనం