Okaya electric scooter : ఒకాయా నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఎంతంటే!
Okaya electric scooter : ఇండియాలో మరో ఈ-స్కూటర్‌ను లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది ఒకాయా సంస్థ. ఈ వెహికిల్ పేరు, రేంజ్, ధర వంటి వివరాలు మీకోసం..
Okaya new electric scooter : ఇండియా ఆటోమొబైల్ మర్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అడుగుపెట్టనుంది. దాని పేరు ఒకాయా మోటో ఫాస్ట్. ఈ నెల 17న ఈ మోడల్‌ను లాంచ్ చేయనున్నట్టు సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ కొత్త ఈవీ ఫీచర్స్, ధర వంటి వివరాలపై ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విశేషాలివే..
ఒకాయా మోటో ఫాస్ట్ ఈ-స్కూటర్లో అలాయ్ వీల్స్ వస్తున్నాయి. అంటే.. ట్యూబ్‌లెస్ టైర్లు వచ్చే అవకాశం ఉంది. రైడింగ్‌కు ఇవి చాలా ఉపయోగపడుతాయి. అంతేకాకుండా.. ఈ స్కూటర్లో 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ కూడా ఉంటుంది. ఇందులో స్పీడ్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, రైడింగ్ మోడ్, టైమ్, బ్యాటరీ పర్సెంటేజ్ వంటివి చూసుకోవచ్చు.
Okaya Moto Faast price Hyderabad : ఈ ఎలక్ట్రిక్ వెహికిల్‌లో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లు లభిస్తున్నాయి. ఫ్రెంట్లో డిస్క్ బ్రేక్స్‌తో పాటు రేర్‌లో డ్రమ్ బ్రేక్స్ వస్తున్నాయి. ఇక వెహికిల్ ఫ్రెంట్లో టెలిస్కోపిక్ ఫోర్క్స్, రేర్ల షాక్ అబ్సార్బర్స్ వంటివి ఉన్నాయి.
ఈ ఒకాయా మోటో ఫాస్ట్.. ఐదు రంగుల్లో అందుబాటులోకి రానుంది. సయన్ బ్లాక్, గ్రీన్, రెడ్, గ్రే. ఇందులో ఉన్న ఎలక్ట్రిక్ మోటార్ గురించి ప్రస్తుతం వివరాలు అందుబాటులో లేవు. కాకపోతే.. ఇది హబ్ మౌంటెడ్ యూనిట్ అని మాత్రం తెలుస్తోంది. ఈ ఈవీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 120కిమీ- 135కి.మీల వరకు ప్రయాణిస్తుందని సమాచారం. ఈ వెహికిల్ టాప్ స్పీడ్ 60-70కేఎంపీహెచ్ అని తెలుస్తోంది.
ఈ కొత్త ఈ-స్కూటర్ ధర ఎంతంటే..
Okaya Moto Faast electric scooter : ప్రస్తుతానికి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరకు సంబంధించిన వివరాలపై క్లారిటీ లేదు. కాగా.. ఈ ఒకాయా మోటో ఫాస్ట్ ఎక్స్‌షోరూం ధర రూ. 1.50లక్షలుగా ఉండొచ్చని టాక్ నడుస్తోంది.
అక్టోబర్ 17 లాంచ్‌తో.. ఈ మోడల్‌కు సంబంధించిన ఇతర ఫీచర్స్, ధర వంటి వివరాలపై ఓ స్పష్టత వస్తుంది.
ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లోని ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌కు మంచి డిమాండ్ కనిపిస్తోంది. 4 వీలర్ మాత్రమే కాకుండా.. 2 వీలర్‌కి కూడా ట్రాక్షన్ పెరుగుతోంది. అందుకే.. కస్టమర్లను ఆకట్టుకునేందుకు.. ఆటోమొబైల్ సంస్థలు తెగ పోటీపడుతున్నాయి. వెంటవెంటనే లాంచ్‌లు చేస్తూ.. పోటీని మరింత పెంచేస్తున్నాయి. ఒకాయా సంస్థకు కూడా ఇప్పటికే మంచి పోర్ట్‌ఫోలియో ఉంది. ఇక కొత్త వెహికిల్ లాంచ్‌తో ఈ పోర్ట్‌ఫోలియో.. మరింత బలంగా మారుతుందని, సంస్థ ఆశిస్తోంది.
సంబంధిత కథనం