Kia EV5 electric SUV: కియా నుంచి ఈవీ 5 ఎలక్ట్రిక్ ఎస్యూవీ.. కళ్లు చెదిరే డిజైన్ తో..
Kia EV5 electric SUV: కొరియన్ ఆటోమేకర్ కియా సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్ యూ వీ ఈవీ 5 ని లాంచ్ చేసింది. ఈవీ 5 తో పాటు ఈవీ 3, ఈవీ 4 కాన్సెప్ట్ ఎస్ యూ వీ లను కూడా ఆవిష్కరించింది.
Kia EV5 electric SUV: అంతర్జాతీయ విద్యుత్ వాహన దినోత్సవం సందర్భంగా గురువారం కియా సంస్థ తమ ఎలక్ట్రిక్ కార్ల లైనప్ లోకి మరో కొత్త ఎస్ యూ వీ ని చేర్చింది. అత్యాధునిక ఫీచర్స్, నెక్ట్స్ లెవెల్ డిజైన్ తో కొత్త ఈవీ 5 ఎస్ యూ వీ (EV5 SUV) ని లాంచ్ చేసింది.
కాన్సెప్ట్ కార్స్..
ఈవీ 5 (EV5) ఎస్ యూ వీ తో పాటు ఈవీ 3 (EV3), ఈవీ 4 (EV4) కాన్సెప్ట్ కార్ లను కూడా కియా (Kia) ఆవిష్కరించింది. వీటిలో ఈవీ 3 ఎలక్ట్రిక్ ఎస్ యూ వీ కాగా, ఈవీ 4 ఎలక్ట్రిక్ సెడాన్ మోడల్. ఈ మోడల్స్ రాకతో 2026 నాటికి సంవత్సరానికి 10 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను అమ్మాలన్న తమ లక్ష్యం నెరవేరుతుందని ఆశిస్తున్నామని కియా (Kia) ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే 2030 నాటికి సంవత్సరం నాటికి ఏటా 16 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను అమ్మాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించింది.
ఈవీ 6 కూడా..
కియా సంస్థ తమ ఎలక్ట్రిక్ ఎస్ యూ వీ మోడల్ ఈవీ 6 (EV6) ను ఈ సంవత్సరం ఇప్పటికే భారత్ సహా పలు దేశాల్లో మార్కెట్లో ప్రవేశపెట్టింది. అలాగే, ఇటీవల ఇండియాలో జరిగిన ఆటో ఎక్స్ పోలో తమ ఫ్లాగ్ షిప్ ఎలక్ట్రిక్ ఎస్ యూ వీ మోడల్ ఈవీ 9 (EV9) ను కాన్సెప్ట్ ఫామ్ లో ఆవిష్కరించింది. ఈ ఈవీ 9 ను 2024 లో భారత్ లో మార్కెట్లోకి తీసుకురావాలని కియా నిర్ణయించింది. ఈవీ 5 డిజైన్ కూడా ఈవీ 9 తరహా డిజైన్ లోనే ఉంటుంది. కియా తమ ఎలక్ట్రిక్ వాహనాలను తమ ప్రత్యేక ఈ జీఎంపీ (e-GMP) మోడ్యులార్ ప్లాట్ ఫామ్ పై రూపొందిస్తుంది.
మూడు వేరియంట్లలో..
కియా ఈవీ 5 మొత్తం 3 వేరియంట్లలో లభిస్తుంది. అవి స్టాండర్డ్ వేరియంట్, లాంగ్ రేంజ్ వేరియంట్, లాంగ్ రేంజ్ ఏడబ్ల్యూడీ వేరియంట్. స్టాండర్డ్ వేరియంట్ లో 64 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్, 160 కిలోవాట్ మోటార్ ఉంటాయి. సింగిల్ చార్జ్ తో 530 కిమీలు ప్రయాణించవచ్చు. లాంగ్ రేంజ్ వేరియంట్, లాంగ్ రేంజ్ ఏడబ్ల్యూడీ వేరియంట్ లలో 88 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. సింగిల్ చార్జ్ తో లాంగ్ రేంజ్ వేరియంట్ 720 కిమీలు, లాంగ్ రేంజ్ ఏడబ్ల్యూడీ వేరియంట్ 650 కిమీలు ప్రయాణించవచ్చు.