Kia EV2 : అతి చౌకైన కియా ఈవీ2 వచ్చేస్తోంది..!-kia ev2 to arrive as the most affordable electric car in 2026 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Kia Ev2 : అతి చౌకైన కియా ఈవీ2 వచ్చేస్తోంది..!

Kia EV2 : అతి చౌకైన కియా ఈవీ2 వచ్చేస్తోంది..!

Sharath Chitturi HT Telugu
Oct 13, 2023 07:56 AM IST

Kia EV2 : కియా ఈవీ2 సిద్ధమవుతోంది! ఇది అతి చౌకైన ఎలక్ట్రిక్​ వెహికిల్​గా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

అతి చౌకైన కియా ఈవీ2 వచ్చేస్తోంది..!
అతి చౌకైన కియా ఈవీ2 వచ్చేస్తోంది..! (Bloomberg/ Representative image)

Kia EV2 price : ఈవీ సెగ్మెంట్​లో ఫ్యూచరిస్టిక్​ డిజైన్​ మోడల్స్​తో దూసుకెళుతున్న కియా మోటార్స్​ సంస్థ.. మరో మోడల్​ను ప్రపంచానికి పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది! 2026 నాటికి కియా ఈవీ2 ఎలక్ట్రిక్​ వాహనాన్ని లాంచ్​ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. తొలుత ఇది యూరోపియన్​ మార్కెట్​లో అందుబాటులోకి వస్తుందని సమాచారం. అంతేకాకుండా.. 'ఈవీ' సిరీస్​లో.. ఇది​ అతి చౌకైన మోడల్​గా నిలుస్తుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఈవీపై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

కొత్త ఈవీ విశేషాలివే..

కియా ఈవీ2కి సంబంధించి ప్రస్తుతం పెద్దగా వివరాలేవీ బయటకు రాలేదు. కాకపోతే.. ఇదొక కాంపాక్ట్​-బీ సెగ్మెంట్​ మోడల్​గా ఉంటుందని, నగరాల్లో ఉపయోగకరంగా ఉండే విధంగా దీని డిజైన్​ ఉంటుందని టాక్​ నడుస్తోంది. యూరోప్​ ప్రజల టేస్ట్​కి తగ్గట్టు ఇందులో మార్పులు, చేర్పులు ఉంటాయట!

కియా మోటర్స్​లో సిగ్నేచర్​గా మారిన డిజిటల్​ టైగర్​ నోస్​ గ్రిల్​ని ఇందులోనూ ఉండనుంది. మొత్తం మీద బండి సైజు చిన్నగా ఉండొచ్చు. ఇక ఈ రానున్న కియా ఈవీ2లో ఈ-జీఎంపీ మాడ్యులర్​ ఆర్కిటెక్చర్​కి చెందిన సరికొత్త 400వీని సంస్థ వాడుతుందని తెలుస్తోంది. ఇదే నిజమైతే.. ధర చాలా వరకు తగ్గిపోతుంది.

Kia EV2 launch date India : అయితే.. ఈ వెహికిల్​కి అల్ట్రా-ఫాస్ట్​ ఛార్జింగ్​ లభించకపోవచ్చు. ఈ ఎలక్ట్రిక్​ వెహికిల్​ ప్రారంభ ధర 25వేల పౌండ్లుగా ఉంటుందని సమాచారం. అంటే ఇండియన్​ కరెన్సీలో అది రూ. 25.38లక్షలు! లాంచ్​ తర్వాత ఈ వెహికిల్​.. మినీ కూపర్​ ఎలక్ట్రిక్​ వంటి ఈవీలకు గట్టిపోటీనిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

రానున్న ఏళ్లల్లో ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​పై ఆధిపత్యాన్ని చెలాయించేందుకు.. పక్కా ప్లాన్​ వేసింది కియా మోటార్స్​! 3ఏళ్లల్లో.. ఈవీ5, ఈవీ4, ఈవీ3ని లాంచ్​ చేయనుంది. ఇక కియా ఈవీ2 కూడా ఈ లైనప్​లో చేరింది.

కియా ఈవీ5..

Kia EV5 specifications : అంతర్జాతీయ విద్యుత్ వాహన దినోత్సవం సందర్భంగా గురువారం కియా సంస్థ.. తన ఎలక్ట్రిక్ కార్ల లైనప్​లోకి మరో కొత్త ఎస్​యూవీని చేర్చింది. అత్యాధునిక ఫీచర్స్, నెక్ట్స్ లెవెల్ డిజైన్​తో కొత్త ఈవీ5 ఎస్​యూవీ స్పెసిఫికేషన్స్​ని రివీల్​ చేసింది.

ఈ కియా ఈవీ5 మొత్తం 3 వేరియంట్లలో లభిస్తుంది. అవి స్టాండర్డ్ వేరియంట్, లాంగ్ రేంజ్ వేరియంట్, లాంగ్ రేంజ్ ఏడబ్ల్యూడీ వేరియంట్. స్టాండర్డ్ వేరియంట్ లో 64 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్, 160 కిలోవాట్ మోటార్ ఉంటాయి. సింగిల్ చార్జ్ తో 530 కిమీలు ప్రయాణించవచ్చు. లాంగ్ రేంజ్ వేరియంట్, లాంగ్ రేంజ్ ఏడబ్ల్యూడీ వేరియంట్ లలో 88 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. సింగిల్ చార్జ్ తో లాంగ్ రేంజ్ వేరియంట్ 720 కిమీలు, లాంగ్ రేంజ్ ఏడబ్ల్యూడీ వేరియంట్ 650 కిమీలు ప్రయాణించవచ్చు.

Whats_app_banner