సుజుకి మోటార్‌సైకిల్స్ మరియు స్కూటర్స్ ఇండియా పండుగ సీజన్ సందర్భంగా పలు ఆఫర్లను ప్రకటించింది. సుజుకీ బైక్స్, స్కూటర్స్ కొనుగోలుపై రూ. 5,000 వరకు క్యాష్‌బ్యాక్, స్కూటర్లు, మోటార్‌సైకిళ్ల పై ఎటువంటి హైపోథికేషన్ లేకుండా 100 శాతం వరకు లోన్ అందిస్తోంది. ఇది కాకుండా, సుజుకి రూ. 6,999 విలువైన రైడింగ్ జాకెట్‌ను పండుగ గిఫ్ట్ గా అందిస్తోంది. అలాగే, రూ. 7,000 వరకు బీమా ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్స్ 31 అక్టోబర్ 2023 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
సుజుకీ బైక్స్ శ్రేణిలో మోటార్‌సైకిళ్లు, స్కూటర్లు, కొన్ని భారీ బైక్స్ ఉన్నాయి. సుజుకీ స్కూటర్ పోర్ట్‌ఫోలియోలో అవెంటిస్ (Avenis), యాక్సెస్ 125 (Access 125), బర్గ్మన్ స్ట్రీట్ (Burgman Street) బర్గ్మన్ స్ట్రీట్ ఈఎక్స్ (Burgman Street EX) ఉన్నాయి. అలాగే, బైక్స్ పోర్ట్ ఫోలియోలో వీ స్ట్రోమ్ ఎస్ ఎక్స్ (V-Strom SX), జిక్సర్ ఎస్ఎఫ్ 250 (Gixxer SF 250), జిక్సర్ 250 (Gixxer 250), జిక్సర్ ఎస్ఎఫ్ (Gixxer SF), జిక్సర్ (Gixxer) ఉన్నాయి. అలాగే, భారీ బైక్స్ కేటగిరీలో కటానా (Katana), హయబూసా (Hayabusa), వీ స్ట్రోమ్ 650 ఎక్స్ టీ (V-Strom 650XT) ఉన్నాయి. ఈ అన్ని మోడల్స్ కు సుజుకీ పండుగ ఆఫర్స్ వర్తిస్తాయి.
భారీ బైక్ ల లైనప్ ను విస్తరించాలని సుజుకీ భావిస్తోంది. త్వరలో వీ స్ట్రోమ్ 800 డీఈ(V-Strom 800DE) ను లాంచ్ చేయనుంది. ఇందులో 776 సీసీ లిక్విడ్ కూల్డ్, పారలల్ ట్విన్ యూనిట్ ఇంజన్ ఉంటుంది. 270 డిగ్రీ క్రాంక్ షాఫ్ట్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఇంజిన్ 8,500 ఆర్పీఎం వద్ద 83 బీహెచ్పీ గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇందులో 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది. ఈ బైక్ 22.7 kmpl మైలేజీ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.