Honda CB350 vs Royal Enfield Classic 350: హోండా సీబీ 350 వర్సెస్ రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 350.. ఏది బెటర్?
Honda CB350 vs Royal Enfield Classic 350: హోండా సీబీ 350, రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 350.. ఈ రెండు బైక్స్ కూడా 350 cc లాంగ్-స్ట్రోక్ ఇంజిన్‌ను ఉపయోగిస్తాయి. అయితే, ఈ రెండింటి మధ్య చాలా తేడాలు కూడా ఉన్నాయి.
Honda CB350 vs Royal Enfield Classic 350: హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా సంస్థ 350 సిసి సెగ్మెంట్లో మార్కెట్ వాటాను చేజిక్కించుకోవడానికి చాన్నాళ్లుగా ప్రయత్నిస్తోంది. వారు మొదట H'ness CB350 బైక్ ను, ఆ తరువాత CB 350 ఆర్ ఎస్ ను మార్కెట్లోకి తీసుకువచ్చారు. కానీ, అవేవీ కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 తో పోటీ పడలేకపోయాయి. దాంతో, ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి పోటీదారుగా సీబీ 350 (CB350) ని హోండా భారత మార్కెట్లో విడుదల చేయాలని నిర్ణయించింది.
Looks: లుక్స్
రెండు మోటార్‌సైకిళ్లు రెట్రో డిజైన్‌ను కలిగి ఉన్నాయి. చాలా వరకు లుక్స్ లో ఈ రెండింటి మధ్య సామీప్యత ఉంది. అయితే, హోండా సీబీ 350 (Honda CB350) ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్ తో కొంత ఆధునికతను జోడించింది. హార్డ్ కోర్ రాయల్ ఎన్ ఫీల్డ్ అభిమానులు మాత్రం హాలోజన్ బల్బులతో టైమ్‌లెస్ రెట్రో డిజైన్ నే ఇష్టపడతారు.
Features: ఫీచర్స్
ఫీచర్ల విషయానికొస్తే, CB350 అన్ని-LED లైటింగ్, డిజి-అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, హోండా స్మార్ట్‌ఫోన్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్, ట్రాక్షన్ కంట్రోల్ లతో వస్తుంది. క్లాసిక్ 350 (Royal Enfield Classic 350) ఒక చిన్న డిజిటల్ డిస్‌ప్లేతో, రెట్రో అనలాగ్ స్పీడోమీటర్‌తో వస్తుంది. క్లాసిక్ 350 టాప్-ఎండ్ వేరియంట్‌లో ట్రిప్పర్ నావిగేషన్ ఉంది.
Hardware: హార్డ్ వేర్
హోండా CB 350 ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్‌లను, వెనుక భాగంలో ట్విన్ గ్యాస్-ఛార్జ్డ్ షాక్ అబ్జార్బర్‌లను ఉపయోగిస్తుంది. బ్రేకింగ్ సిస్టమ్ లో ముందువైపు 310 mm డిస్క్ బ్రేక్స్, వెనుక వైపు 240 mm డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. డ్యూయల్-ఛానల్ ABS ఉంటుంది. క్లాసిక్ 350 లో కూడా ఇదే విధమైన సస్పెన్షన్ సెటప్ ఉంది. అయితే, బ్రేకింగ్ సిస్టమ్ లో ముందువైపు 300 mm డిస్క్ బ్రేక్స్, వెనుక వైపు 270 mm డిస్క్ బ్రేక్స్ లేదా 153 mm డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. వేరియంట్‌ను బట్టి సింగిల్ లేదా డ్యూయల్-ఛానల్ ABS ఉంటుంది.
Engine: ఇంజన్
హోండా CB350 లో 348.36 cc, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్-సిలిండర్ ఇంజన్ ఉంటుంది. దీన్ని BS6 స్టేజ్ 2 నిబంధనలకు అనుగుణంగా రూపొందించారు. ఇది 5,500 rpm వద్ద 20.78 bhp గరిష్ట శక్తిని, 3,000 rpm వద్ద 29.4 Nm గరిష్ట టార్క్ అవుట్‌పుట్‌ను విడుదల చేస్తుంది. స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్‌తో కూడిన 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. క్లాసిక్ 350 లోని J-ప్లాట్‌ఫారమ్ ఇంజిన్ 349 cc, ఎయిర్-ఆయిల్ కూల్డ్ యూనిట్క. ఇది 6,100 rpm వద్ద 20.2 bhp గరిష్ట శక్తిని, 4,000 rpm వద్ద 27 Nm గరిష్ట టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది.
Price : ధర
రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 350 ఎక్స్-షోరూమ్ ధర వేరియంట్ ను బట్టి రూ. 1.93 లక్షల నుంచి రూ. 2.25 లక్షల మధ్య ఉంటుంది. హోండా సిబి 350 ఎక్స్-షోరూమ్ ధర వేరియంట్ ను బట్టి రూ. 2 లక్షల నుంచి రూ. 2.18 లక్షల మధ్య ఉంటుంది.