తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Honda Cb350 Launched : ఇండియాలో హోండా కొత్త బైక్​ లాంచ్​.. సీబీ350 ధర ఎంతంటే!

Honda CB350 launched : ఇండియాలో హోండా కొత్త బైక్​ లాంచ్​.. సీబీ350 ధర ఎంతంటే!

Sharath Chitturi HT Telugu

18 November 2023, 6:40 IST

    • Honda CB350 launched : ఇండియాలో హోండా కొత్త బైక్​ లాంచ్ అయ్యింది. ఈ హోండా సీబీ350 ధరతో పాటు ఇతర విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..
ఇండియాలో హోండా కొత్త బైక్​ లాంచ్​..
ఇండియాలో హోండా కొత్త బైక్​ లాంచ్​..

ఇండియాలో హోండా కొత్త బైక్​ లాంచ్​..

Honda CB350 launched : ఇండియాలో సరికొత్త బైక్​ని లాంచ్​ చేసింది జపాన్​కు చెందిన దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ హోండా. ఈ బైక్​ పేరు హోండా సీబీ350. ఇండియాలో మంచి డిమాండ్​ ఉన్న రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్​ 350కి ఈ మోడల్​ గట్టిపోటినిచ్చే విధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ బైక్​ ఫీచర్స్​, వేరియంట్స్​, ధర వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

Motorola X50 Ultra : మోటోరోలా ఎక్స్​50 అల్ట్రా లాంచ్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

హోండా కొత్త బైక్​ లాంచ్​..

హోండా సీబీ350 చూడటానికి చాలా క్లాసీగా ఉంది. ఇందులో సర్క్యులర్​ ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్​ ఉంటుంది. ప్రెషియెస్​ రెడ్​ మెటాలిక్​, పర్ల్​ ఇగ్నియస్​ బ్లాక్​, మాట్​ క్రస్ట్​ మెటాలిక్​, మాట్​ మార్షనల్​ గ్రీన్​ మెటాలిక్​, మాట్​ డూన్​ బ్రౌన్​ వంటి కలర్స్​లో ఈ బైక్​ అందుబాటులో ఉండనుంది. వీటికి బ్రౌన్​ లెథర్​ సీట్​ వస్తుంది. ఆల్​- ఎల్​ఈడీ లైట్​ సెటప్​, స్మార్ట్​ఫోన్​ కనెక్టివిటీతో కూడిన సెమీ డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, హోండా సెలెక్టెబుల్​ టార్క్​ కంట్రోల్​, ఎమర్జెన్సీ స్టాప్​ సిగ్నల్​ వంటి ఫీచర్స్​.. ఈ బైక్​ సొంతం.

Honda CB350 price : ఇక ఈ హోండా కొత్త బైక్​లో 348 సీసీ, ఎయిర్​ కూల్డ్​, సింగిల్​ సిలిండర్​ ఇంజిన్​ ఉంటుంది. హోండా హైనెస్​ సీబీ350, సీబీ350ఆర్​ఎస్​లో కూడా ఇదే ఇంజిన్​ కనిపిస్తుంది. ఇది.. 20.78 హెచ్​పీ పవర్​ని, 30 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. 5 స్పీడ్​ గేర్​ బాక్స్​ ఇందులో ఉంటుంది.

ఇక సస్పెషన్స్​ విషయానికొస్తే.. ఫ్రెంట్​లో టెలిస్కోపిక్​ ఫోర్క్స్​, రేర్​లో డ్యూయెల్​ షాక్​ అబ్సార్బర్స్​ వస్తున్నాయి. హోండా సీబీ350 రెండు వీల్స్​కి డిస్క్​ బ్రేక్స్​ ఉంటాయి. డ్యూయెల్​ ఛానెల్​ ఏబీఎస్​ని కూడా ఇస్తోంది హోండా.

హోండా సీబీ350 ధర ఎంతంటే..

Honda CB350 price Hyderabad : హోండా హైనెస్​ సీబీ350, సీబీ350ఆర్​ఎస్​ ప్లాట్​ఫామ్​పైనే ఈ హోండా సీబీ350ని కూడా నిర్మించింది సంస్థ. హోండా కొత్త బైక్​లో రెండు వేరియంట్స్​ ఉన్నాయి. అవి.. డీఎల్​ఎక్స్​, డీఎల్​ఎక్స్​ ప్రో. హోండా సీబీ350 ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 1.99లక్షలుగా ఉంది.

హండా సీబీ1000 హార్నెట్ చూశారా?

దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ హోండా నుంచి సరికొత్త బైక్​ రాబోతోంది. ఈ స్టైలిష్​ బైక్​ పేరు సీబీ1000 హార్నెట్​. ఈ మోడల్​ని.. 2023 ఈఐసీఎంఏ ఈవెంట్​లో ఆవిష్కరించింది సంస్థ. ఈ బైక్​లో 999 సీసీ, లిక్విడ్​ కూల్డ్​, 16 వాల్వ్​, ఇన్​-లైన్​ 4 సిలిండర్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది.. 150 హెచ్​పీ పవర్​ని జనరేట్​ చేస్తుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం