Honda XL750 Transalp : కొత్త బైక్​ లాంచ్​ చేసిన హోండా- ధర ఎంతంటే..!-honda xl750 transalp adventure tourer launched check price details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Honda Xl750 Transalp : కొత్త బైక్​ లాంచ్​ చేసిన హోండా- ధర ఎంతంటే..!

Honda XL750 Transalp : కొత్త బైక్​ లాంచ్​ చేసిన హోండా- ధర ఎంతంటే..!

Sharath Chitturi HT Telugu
Oct 30, 2023 04:32 PM IST

Honda XL750 Transalp : హోండా సంస్థ.. ఇండియాలో కొత్త అడ్వెంచర్​ టూరర్​ని లాంచ్​ చేసింది. దీని పేరు హోండా ఎక్స్​ఎల్​750 ట్రాన్సల్ప్​. ఈ బైక్​ ధర ఎంతంటే..

కొత్త బైక్​ లాంచ్​ చేసిన హోండా.. ధర ఎంతంటే..!
కొత్త బైక్​ లాంచ్​ చేసిన హోండా.. ధర ఎంతంటే..!

Honda XL750 Transalp 2023 : హోండా మోటార్​సైకిల్​ అండ్​ స్కూటర్​ ఇండియా సంస్థ.. దేశంలో కొత్త బైక్​ని లాంచ్​ చేసింది. దీని పేరు హోండా ఎక్స్​ఎల్​750 ట్రాన్సల్ప్​. ఇదొక అడ్వెంచర్​ టూరర్​. ఈ మోడల్​ని సీబీయూ (కంప్లీట్లీ బిల్ట్​-అప్​) ద్వారా జపాన్​ నుంచి ఇండియాకు తీసుకొస్తోంది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. ఈ నేపథ్యంలో కొత్త బైక్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

హోండా కొత్త బైక్​ ఫీచర్స్​..

హోండా ఎక్స్​ఎల్​750 ట్రాన్సల్ప్​ డిజైన్​.. 1980 దశకంలో మంచి డిమాండ్​ సంపాదించుకున్న ట్రాన్సల్ప్​ మోడల్​ని పోలి ఉంటుంది. ఇందులో కాంపాక్ట్​ హెడ్​లైట్​, ఇంటిగ్రేటెడ్​ విండ్​స్క్రీన్​ వంటివి ఉంటాయి. రేర్​లో ఎల్​ఈడీ టెయిల్​లైట్​, అల్యూమీనియం కారియర్​ వంటివి వస్తున్నాయి. ఈ బైక్​కు 21 ఫ్రెంట్​ వీల్​, 18 ఇంచ్​ రేర్​ వీల్​ వస్తాయి. ఫలితంగా ఆఫ్​ రోడ్​లో స్మూత్​ రైడ్​ ఫీలింగ్​ పొందొచ్చు.

Honda XL750 Transalp price in India : ఇక ఫీచర్స్​ విషయానికొస్తే.. ఇందులో 5.0 ఇంచ్​ టీఎఫ్​టీ ప్యానెల్​ ఉంటుంది. స్పీడోమీటర్​, టాకోమీటర్​, గేర్​ పొజిషన్​ ఇండికేటర్​, ఫ్యూయెల్​ గేజ్​, కన్సమ్షన్​, రైడింగ్​ మోడ్స్​, ఇంజిన్​ పారామీటర్స్​ వంటివి డిస్​ప్లే అవుతాయి. వీటిని కస్టమర్లు కస్టమైజ్​ చేసుకోవచ్చు.

ఈ అడ్వెంచర్​ టూరర్​లో స్మార్ట్​ఫోన్​ వాయిస్​ కంట్రోల్​ సిస్టెమ్​ ఉంటుంది. ఫలితంగా.. బైక్​కి స్మార్ట్​ఫోన్​ని లింక్​ చేసుకోవచ్చు. దీని ద్వారా.. వాయిస్​ మేనేజ్​మెంట్​ కాల్స్​, మెసేజ్​లు, మ్యూజిక్​, నేవిగేషన్​ వంటి ఆప్షన్స్​ పొందొచ్చు. ఇందులో ఎమర్జెన్సీ స్టాప్​ సిగ్నల్​ కూడా ఉంటుంది. ఆటోమెటిక్​ టర్న్​ సిగ్నల్​ కాన్సెలింగ్​ ఫంక్షన్​ కూడా ఉంది.

రెండు కలర్​ ఆప్షన్స్​తో ఈ మోడల్​ అందుబాటులోకి వస్తోంది. అవి.. రోజ్​ వైట్​, మాట్​ బాలిస్టిక్​ బ్లాక్​.

హోండా కొత్త బైక్​ ధర ఎంతంటే..

Honda XL750 Transalp launch in India : హోండా ఎక్స్​ఎల్​750 ట్రాన్సల్ప్ ఎక్స్​షోరూం ధర రూ. 10,99,990. ఇది ఇంట్రొడక్టరీ ప్రైజ్​ మాత్రమే. మొదటి 100 మంది కస్టమర్లకే ఈ ఆప్షన్​ ఉందని, ఆ తర్వాత ఈ మోడల్​ ధర పెరగొచ్చని తెలుస్తోంది.

ఈ బైక్​కి సంబంధించిన బుకింగ్స్​ ఇప్పటికే మొదలయ్యాయి. బిగ్​వింగ్​ డీలర్​షిప్స్​ ద్వారా ఈ హోండా ఎక్స్​ఎల్​750 ట్రాన్సల్ప్​ని విక్రయిస్తోంది హోండా సంస్థ. హైదరాబాద్​, గురుగ్రామ్​, ముంబ, బెంగళూరు, ఇండోర్​, కొచ్చి, చెన్నై, కోల్​కతాలోని షోరూమ్స్​కు వెళ్లి బైక్​ని బుక్​ చేసుకోవచ్చు.

Honda XL750 Transalp price : నవంబర్​ నుంచి ఈ హోండా ఎక్స్​ఎల్​750 ట్రాన్సల్ప్ అడ్వెంచర్​ టూరర్​ డెలివరీలు మొదలవుతాయని సంస్థ ప్రకటించింది.

WhatsApp channel

సంబంధిత కథనం