Honda electric scooter : ఈ హోండా బుడ్డి ఎలక్ట్రిక్ స్కూటర్ని చూశారా?
Honda Motocompacto electric scooter : హోండా మోటోకాంపాక్టో ఈవీని చూశారా? ఈ మోడల్ని సంస్థ ఇటీవలే రివీల్ చేసింది. పూర్తి వివరాల మీకోసం..
Honda Motocompacto electric scooter : మన స్కూటర్ని సూట్కేస్లాగా ఫోల్డ్ చేసుకోగలిగితే ఎలా ఉంటుంది? పార్కింగ్ సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చని అనిపిస్తోంది కదా! జపాన్‌కు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హోండా.. ఇలాంటి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌నే రూపొందించింది. దీని పేరు హోండా మోటోకాంపాక్టో ఈ-స్కూటర్. ఈ మోడల్ని ఇటీవలే రివీల్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ స్కూటర్ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము.
హోండా మోటోకాంపాక్టో విశేషాలు..
1980 దశకంలోనే.. మోటోకాంపో అనే ఫోల్డెబుల్ స్కూటర్ని రూపొందించింది హోండా. అప్పట్లో అదొక సంచలనం. కారులోని బూట్ స్పేస్‌లో సింపుల్‌గా పట్టేసే విధంగా ఈ స్కూటర్ ఉండేది. కారును తీసుకువెళ్లలేని ప్రదేశాలకు.. ఈ స్కూటర్ వెళ్లేదు. మోయడానికి కూడా చాలా లైట్‌గా ఉండేది ఈ వెహికిల్. ఇక నాటి మోడల్ స్ఫూర్తితోనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ని రూపొందిచింది హోండా సంస్థ.
Honda Motocompacto EV : ఈ హోండా మోటోకాంపాక్టో బరువు 19 కేజీలు. చేతులతోనే దీనిని మోసుకుని వెళ్లొచ్చు. నగరాల్లో ఉండే వారికి ఈ బండి బాగా ఉపయోగపడుతుంది. క్యాంపస్‌లలో తిరిగేందుకు చక్కని ఆప్షన్ అవుతుంది. ఫోల్డ్ చేసినప్పుడు.. దీని పొడవు 742ఎంఎం. వెడల్పు 94ఎంఎం. ఎత్తు 536ఎంఎం. రైడ్ మోడ్‌లో ఉన్నప్పుడు.. ఈ ఈ-స్కూటర్ పొడవు 968ఎంఎం. వీల్‌బేస్ 742ఎంఎం.
ఒక మనిషి నడిచే సగటు వేగం కన్నా.. ఈ మోటోకాంపాక్టో స్పీడ్ 3 రెట్లు అధికం. దీని టాప్ స్పీడ్ 24కేఎంపీహెచ్. 7 సెకన్లలో టాప్ స్పీడ్ అందుకోగలదు. ఒక సీటు మాత్రమే ఉంటుంది. 120కేజీల వరకు బరువు మోయగలదు ఈ స్కూటర్.
Honda Motocompacto price : ఈ మోటోకాంపాక్టో ఎలక్ట్రిక్ స్కూటర్లో ఫ్రెంట్ వీల్ మోటార్ ఉంటుంది. ఇది 0.6 బీహెచ్పీ పవర్‌ని, 16 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులో అనేక వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్స్ ఉన్నాయి. ఇందులోని 6.8 ఏహెచ్ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 20కి.మీల వరకు ప్రయాణించవచ్చని సంస్థ చెబుతోంది. సాధారణంగా వాడే 110వీ ఛార్జర్‌తో ఈ వెహికిల్‌ను పూర్తిగా ఛార్జ్ చేసేందుకు కనీసం 3 గంటల 30 నిమిషాల సమయం పడుతుందట!
ఈ మోడల్ లాంచ్ డేట్‌పై ప్రస్తుతం క్లారిటీ లేదు. ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుంది? అన్న విషయంపైనా స్పష్టత లేదు. దీనిపై త్వరలోనే సంస్థ స్పందించే అవకాశం ఉంది.
హోండా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ని చూశారా?
దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హోండా నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రాబోతోంది. దీని పేరు హోండా ఎస్సీ ఈ. ఈ మోడల్‌కి సంబంధించిన కాన్సెప్ట్ వర్షెన్‌ని.. 2023 జపాన్ మొబిలిటీ షోలో ఇటీవలే ప్రదర్శించింది హోండా. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం