Two-seater electric car: హోండా నుంచి అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో రెండు సీట్ల సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ కార్-honda debuts two seater electric microcar ci mev with level 4 adas ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Two-seater Electric Car: హోండా నుంచి అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో రెండు సీట్ల సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ కార్

Two-seater electric car: హోండా నుంచి అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో రెండు సీట్ల సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ కార్

HT Telugu Desk HT Telugu

Two-seater electric car: జపాన్ లో జరుగుతున్న ఆటో షోలో ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా.. తన తొలి 2 సీటర్ సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. అత్యున్నత భద్రతా ప్రమాణాలతో ఈ కారును రూపొందించినట్లు వెల్లడించింది.

హోండా సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ కార్ సీఐ - ఎంఈవీ

Two-seater electric car: హోండా కార్స్ జపాన్ ఆటో షోలో లెవల్ 4 ఏడీఏఎస్ టెక్నాలజీతో ప్రపంచంలోనే మొట్టమొదటి టూ-సీటర్ సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ వాహనాన్ని ఆవిష్కరించింది. ఈ సీఐ - ఎంఈవీ (CI-MEV) అనే కోడ్ నేమ్ తో హోండా ఈ కారును ఆవిష్కరించింది. ఈ ఎలక్ట్రిక్ మైక్రోకార్ మూడు చక్రాలపై కూడా నడుస్తుంది.

Cooperative Intelligence: కోఆపరేటివ్ ఇంటెలిజెన్స్

ఈ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ వాహనం టే-సీటర్, ఫోర్-వీల్ మైక్రోకార్. ఇది కోఆపరేటివ్ ఇంటెలిజెన్స్ (CI), అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీతో స్వల్ప దూరాల ప్రయాణాలకు ఎంతో ఉపకరిస్తుంది. బాక్సీగా కనిపించే మైక్రోకార్ ఇటీవల ఎంజీ సంస్థ మార్కెట్లోకి తీసుకువచ్చిన కామెట్ ఈవీ (MG Comet EV) ని గుర్తు చేస్తుంది. అయితే, ఈ రెండింటి మధ్య కొన్ని తేడాలున్నాయి. MG కామెట్ EVలో నాలుగు సీట్లు ఉంటాయి. కానీ, హోండా మైక్రో కార్ లో రెండు సీట్లు మాత్రమే ఉంటాయి. అంతే కాకుండా, ఇందులో మొత్తం ఆరు 360 డిగ్రీ యాంగిల్ వైడ్ కెమెరాలు ఉంటాయి. ఈ సీఐ - ఎంఈవీ (CI-MEV) మైక్రో ఎలక్ట్రిక్ కారు లెవెల్ 4 ఏడీఏఎస్ (ADAS) టెక్నాలజీతో పని చేస్తుందని హోండా తెలిపింది.

కాంపాక్ట్ లుక్

సీఐ - ఎంఈవీ (CI-MEV) సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ కారు చాలా కాంపాక్ట్‌గా ఉంటుంది. టర్నింగ్ రేడియస్‌ చాలా తక్కువగా ఉంటుంది. మీ వాయిస్ కమాండ్స్ కు స్పందిస్తుంది. మీరు చెప్పిన లొకేషన్ ను గుర్తుంచుకుని, గమ్య స్థానానికి చేరుకున్న తరువాత ఆ విషయాన్ని మీకు తెలియచేస్తుంది. ఇందులో 4 రిమూవబుల్ బ్యాటరీస్ ను అమర్చారు.